కౌలు రైతుకు కడబంతీ కరవే | Lease farmer may loss seed subsidy, if government cut loans | Sakshi
Sakshi News home page

కౌలు రైతుకు కడబంతీ కరవే

Published Sat, Nov 9 2013 3:24 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

కౌలు రైతుకు కడబంతీ కరవే - Sakshi

కౌలు రైతుకు కడబంతీ కరవే

విశ్లేషణ: రాబోయే రోజుల్లో కౌలు రైతును మరింత గడ్డు పరిస్థితుల్లోకి నెట్టేసే నిర్ణయాలు అమలు కాబోతున్నాయి. ప్రస్తుతం కౌలు రైతుకు బ్యాంకు రుణాలు లేవు. నష్ట పరిహారం, బీమా సొమ్ము రాదు. అయితే రైతుతో సమానంగా కౌలు రైతుకు కూడా సబ్సిడీ ధరలకు ఎరువులు అందుతున్నాయి. కొద్ది పరిమితుల్లో విత్తనాలూ సబ్సిడీ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయాల వల్ల ఈ వెసులుబాటునూ కౌలు రైతులు కోల్పోయే ప్రమాదం ఉంది.
 
 కుండపోత వర్షాలు ఆగాయి. వెంటనే రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 8 వరకు (పత్రికల నివేదికల మేరకు) 40 మంది రైతులు బలవన్మరణాల పాలయ్యారు. ఇందులో 22 మంది కౌలురైతులే. వ్యవసాయంలో ఒడిదుడుకులు ఎదురైన ప్రతిసారీ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగం లో అత్యధికులు కౌలురైతులే. రైతు దేశానికి వెన్నెముక అయితే, మారిన పరిస్థితుల్లో వ్యవసాయానికి కౌలురైతు ఆయువుపట్టు.
 
 అధికారిక లెక్కలే లేవు...
 http://img.sakshi.net/images/cms/2013-11/71383940912_Unknown.jpgరాష్ట్రంలో కౌలురైతుల అధికారిక లెక్కలు లేవు. ఇక్కడ దా దాపు 2 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. సగటు భూకమతం 2.5 ఎకరాలు. ఈ లెక్కన 80 లక్షల మంది రైతులు ఉన్నారనుకుంటే ఇందులో కనీసం సగం, 40 లక్షల మంది కౌలురైతులేనని అంచనా. కానీ కౌలు ఒప్పందాలు 90 శాతంపైగా నోటి మాటపైనే ఉంటాయి, ప్రస్తుతం అమలవుతున్న ‘కౌల్దారీచట్టం’లో కొన్ని పరి స్థితుల్లో కౌలుదారులకు భూ యాజమాన్య హక్కులు సం క్రమించే అవకాశముంది. ఈ కారణంగా భూములున్న రైతులు కౌలు పత్రాలు రాయించడానికి వెనకాడుతున్నా రు. కానీ సొంత భూమి లేదు కాబట్టి బ్యాంకులు కౌలు దారులకు అప్పులు ఇవ్వవు. పంట నష్టపరిహారం, బీమా పథకాల లబ్ధి కూడా భూయజమానులకే దక్కుతుంది.
 
  ఇటీవలి కాలంలో కౌలు రైతుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా మాట్లాడుతోంది. కౌలు రైతులకు పెద్ద ఎత్తున పంట రుణాలు ఇస్తామని, పంట నష్టపరిహారం భూ యజమానులకు కాకుండా సాగుచేస్తున్న కౌలుదారులకే అందేలా చర్యలు తీసుకుంటామని.. ఇలా. అయితే ఆచర ణలో మాత్రం ప్రభుత్వసాయం అందడం లేదు. కౌలు పత్రం రాయించినప్పటికీ భూమిపైన తన యాజమాన్య హక్కులకు ఎలాంటి భగంవాటిల్లదన్న భరోసా భూయ జమానులకు ఉండేలా ‘కౌలుదారీచట్టం’లో మార్పులు తీసుకొస్తే తప్ప కౌలురైతుల గుర్తింపు సాధ్యంకాదు. చట్టం లో మార్పులు తేకుండా ఎన్ని కబుర్లు చెప్పినా కౌలు రైతు లకు చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదు.‘లోన్ ఎలిజిబుల్ కార్డు’ (ఎల్‌ఈసీ) జారీలో అదే తేటతెల్లమైంది.
 
 నత్తనడక ‘ఎల్‌ఈసీలు’
 కౌలు రైతులకు ప్రభుత్వం ‘ఎల్‌ఈసీ’ జారీ చేస్తుందని, వీటి ఆధారంగా బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలని నిర్ణ యించారు. రాష్ట్ర ప్రభుత్వం 2013-14 సంవత్సరంలో 14.55 లక్షల మందికి ఎల్‌ఈసీల మంజూరు లక్ష్యమని  ప్రకటించింది. ఇప్పటివరకూ జారీ చేసినవి 4.39 లక్షలు మాత్రమే. ఖరీఫ్ సీజన్ పూర్తయిపోయినా ప్రభుత్వం తాను నిర్దేశించుకున్న లక్ష్యంలో పదోవంతు మందికి కూడా ఎల్‌ఈసీలు మంజూరు చేయలేదు. ప్రభుత్వ నిర్వా కం ఎలా ఉందో బ్యాంకుల వైఖరి కూడా అలాగే ఉంది. ప్రభుత్వం 4.39 లక్షల మంది కౌలురైతులకు ఎల్‌ఈసీలు మంజూరు చేస్తే, బ్యాంకులు కేవలం 1.14 లక్షల మందికే పంట రుణాలు ఇచ్చాయి. 40 లక్షల మంది కౌలు రైతుల కుగాను చివరకు వీరికే బ్యాంకు రుణం అందింది. ఈ లెక్కన రాష్ట్రంలో 38.86 లక్షల మంది కౌలు రైతులు బ్యాం కు అప్పులకు నోచుకోలేదు. గత ఏడాది కౌలు రైతులకు రూ.2000 కోట్లు రుణాలను లక్ష్యంగా ప్రకటించినప్పటికీ వాస్తవంగా ఇచ్చింది రూ.270 కోట్లు మాత్రమే. గత ఏడాది కౌలురైతులకు లక్ష్యం మేరకు రుణాలు మంజూరు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వానిదే ప్రధాన బాధ్యత అని, రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో కౌలు రైతులకు ఎల్‌ఈసీలు మంజూరు చేయకపోవడం వల్లనే రుణాలు ఇవ్వలేక పోయామని బ్యాంకర్లు చెప్పారు.
 
 అందని రుణాలు...
 ఈ ఏడాది ఖరీఫ్‌కు రూ.31,996 కోట్ల పంటరుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇందులో రూ.26,609 కోట్లు పంట రుణాలు ఇచ్చారు (లక్ష్యంలో 83 శాతం). మజూరు చేసిన రుణాల్లో కౌలు రైతులకు ఇచ్చిం ది రూ.231.70 కోట్లు మాత్రమే. ఈ ఖరీఫ్‌లో బ్యాంకులు మంజూరు చేసిన పంట రుణాల్లో 0.87 శాతం మొత్తం మాత్రమే కౌలు రైతులకు అందింది. రాష్ట్రంలోని రైతుల్లో దాదాపు 50 శాతం మంది కౌలు రైతులు ఉంటే, పంట రుణాల్లో మాత్రం వీరికి ఒక్క శాతం కూడా అందలేదు. బ్యాంకు రుణాలు దక్కని రైతులంతా ప్రైవేటు వడ్డీ వ్యాపా రులనే ఆశ్రయిస్తున్నారు. పంటలు దెబ్బ తింటే ఎక్కువ మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటానికి ఇది ప్రధాన కారణం. మరోవైపు వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోయాయి. రైతు ఒక ఎకరాలో పత్తి సాగు చేయా లంటే కనిష్టంగా రూ.30 వేలు ఖర్చు అవుతుంది. కౌలు రైతు అయితే అదనంగా రూ.15 వేలు కౌలు చెల్లించాలి. సొంత భూమి ఉన్న రైతులకు సాగు ఖర్చు రూ.30 వేలు అయితే, కౌలు రైతు సాగు ఖర్చు రూ.45 వేలు. ఈ పెట్టుబడి వడ్డీకి తెచ్చుకోవాల్సిందే. కాస్త మెరుగైన ధర కోసం ఆగే పరిస్థితి కూడా కౌలు రైతుకు ఉండదు.
 
 ఇది పరిహాసమే...
 ఇటీవలి కుండపోత వర్షాలకు దాదాపు 28 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాల ద్వారా తేల్చారు. మన రాష్ట్రంలో సగటు కమతం 2.5 ఎక రాలు అనుకుంటే దాదాపు 11.20 లక్షల మంది రైతులకు పరిహారం అందాలి. రైతుల్లో సగ భాగం కౌలు రైతులను కుంటే 5 లక్షల 10 వేల మందికి పరిహారం అందాల్సి ఉంటుంది. వాస్తవానికి అలా జరగదు. పంట నష్టం జరి గిన ప్రాంతంలో ఎల్‌ఈసీ కార్డులు ఉన్న కౌలు రైతులకు మాత్రమే ప్రభుత్వమిచ్చే పంట నష్టపరిహారం చెందు తుంది. ఏ పత్రాలు లేని కౌలు రైతులకు పరిహారం అం దదు. ఆ పరిహారం సాగుచేయని భూయజమానులకే అందుతుంది.
 
 పొంచి ఉన్న ముప్పు
 రాబోయే రోజుల్లో కౌలురైతును మరింత గడ్డు పరిస్థితు ల్లోకి నెట్టేసే నిర్ణయాలు అమలు కాబోతున్నాయి. ప్రస్తు తం కౌలు రైతుకు బ్యాంకు రుణాలు లేవు. నష్ట పరిహారం, బీమా సొమ్ము రాదు. అయితే రైతుతో సమానంగా కౌలు రైతుకు కూడా సబ్సిడీ ధరలకు ఎరువులు అందుతు న్నాయి. కొద్ది పరిమితుల్లో విత్తనాలూ సబ్సిడీ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయాల వల్ల ఈ వెసులుబాటునూ కౌలు రైతులు కోల్పోయే ప్రమాదం ఉంది. విత్తనాల సరఫరాకు సంబం ధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ‘నగదు బదిలీ’ పథకానికి శ్రీకారం చుట్టింది. నాలుగు జిల్లాల్లో ప్రస్తుత రబీ సీజన్ లోనే ఈ విధానాన్ని అమలుచేస్తున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. బ్యాంక్ అకౌంట్లకు, ‘ఆధార్’ అనుసం ధానించి ‘నగదు బదిలీ’ ద్వారా ఎరువులు సరఫరా చేయా లన్న ప్రతిపాదనలు ఉన్నాయి. పూర్తి ధర చెల్లించి ఎరు వులు కొనుగోలు చేస్తే, సబ్సిడీ మొత్తం సంబంధిత రైతు ఖతాలో నేరుగా జమవుతుంది. ఈ ప్రతిపాదనలు అమ లైతే ఎరువుల సబ్సిడీ పొందే అవకాశాన్ని కూడా కౌలు రైతు కోల్పోతాడు.       
 
 (రైతుల ఆత్మహత్యలపై పలు సంఘాలు, సంస్థలు అధ్య యనాలు చేశాయి. ఏ పైరు సాగుచేసే రైతులు ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు? ఆత్మహత్యలు చేసుకునే రైతుల్లో స్త్రీల శాతం ఎంత? పురుషుల శాతం ఎంత? ఏ వయసు వారు ఎక్కువ మంది ఉన్నారు? ఇలాంటి వర్గీకరణలు పైపట్టికలో ఉన్నాయి. అయితే, రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో కౌలు రైతు వివరాలు లేవు. ఆ కోణంలో కూడా గణాంకాలు రూపొందిస్తే కౌలు రైతు చిత్రపటం స్పష్టంగా కనిపిస్తుంది. ఎకరా, అర్ద ఎకరా సొంత పొలం ఉండి, అదనంగా నాలుగైదు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసిన రైతులే ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.)
 - బి. గణేష్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement