తోట్లవల్లూరు, న్యూస్‌లైన్ : మండలంలోని పాములలంకలో ఓ కౌలు రైతు ప్రమాదవశాత్తు బోరుగుంటలో జారి పడి మరణించాడు. మృతుడు గ్రామ పంచాయతీ వార్డు సభ్యు డు కూడా. గ్రామానికి చెందిన కౌలు రైతు మన్నె గోపి(32) ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లాడు. చేనుకు నీరు పెట్టేందుకు మోటారు స్విచ్ ఆన్ చేయడానికి వెళుతూ చీకట్లో బోరుగుంటలో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. బోరుపైపులకు జాయింట్‌గా ఉండే ప్లాంజ్ గుండెకు బలంగా తగలటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
సమీపంలో మరో పొలానికి నీరు వదలడానికి వెళ్లిన రవి అనే మరో రైతు పని ముగించుకుని గోపి కోసం వచ్చాడు. అతడు బోరుగుంటలో పడి ఉండటంతో దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు. రవి హుటాహుటిన గ్రా మంలోకి వెళ్లి ఈ విషయాన్ని చెప్పడంతో స్థానికులు పెద్దసంఖ్యలో ఘటనాస్థలికి వచ్చాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో గోపి వైఎస్సార్ సీపీ మద్దతుతో ఆరోవార్డు సభ్యునిగా గెలుపొందాడు. అతడి మరణంతో గ్రామంలో విషాదం నెల కొంది. కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు స్థానికులను కలచివేశాయి.
ఉప్పులేటి కల్పన పరామర్శ..
గోపి కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన ఆదివారం మధ్యాహ్నం పరామర్శించారు. గోపి మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నా రు. మృతుడి కుటుంబసభ్యులను ఓదార్చారు. గోపి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చాగంటిపాడులో కామెర్లతో ఇటీవల మృతి చెందిన జమ్మలమూడి ప్రభాకర్ కుటుంబసభ్యులను కూడా కల్పన పరామర్శించారు. ఆమె వెంట పార్టీ మండల కన్వీనర్ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చింతలపూడి గవాస్కర్‌రాజు, పార్టీ నాయకులు వీరంకి కృష్ణకిషోర్, కోనేరు భానుప్రసాద్, మర్రెడ్డి శేషిరెడ్డి, కొల్లిపర చింతయ్య, గొరిపర్తి సూర్యనారాయణ, సోలే ధర్మారావు, సోలే నాగరాజు, తదితరులు ఉన్నారు.
బోరుగుంటలో పడి కౌలురైతు దుర్మరణం
Published Mon, Aug 26 2013 1:07 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM
Advertisement
Advertisement