కుటుంబ కలహాల నేపథ్యంలో వరుసకు అన్నయ్య అయిన ఎంపీటీసీ పై తమ్ముడు కత్తితో దాడి చేశాడు.
కుటుంబ కలహాల నేపథ్యంలో వరుసకు అన్నయ్య అయిన ఎంపీటీసీ పై తమ్ముడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎంపీటీసీని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక ఎంపీటీసీ చంద్రమౌళి(35)పై వరుసకు తమ్ముడైన సత్యనారాయణ కత్తితో దాడి చేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి మధ్య గత కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.