జిల్లా కలెక్టర్‌గా సత్యనారాయణ
–విజయమోహన్ పోస్టింగ్‌పై సందిగ్ధత
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా కలెక్టర్‌గా సత్యనారాయణ నియమితులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి కల్పించి కర్నూలు కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఇంతవరకు ఇక్కడ కలెక్టర్‌గా పనిచేస్తున్న సి.హెచ్.విజయమోహన్ పోస్టింగ్‌పై స్పష్టత లేదు. విజయమోహన్ 2014 జులై 12న బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో ఈయన 33 నెలల పాటు కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. జిల్లాలో అత్యధిక కాలం పనిచేసిన కలెక్టర్లలో ఈయన ఒకరు. దాదాపు ఏడాది కాలంగా కలెక్టర్ బదిలీపై విస్తృత ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చిన బదిలీపై ఎట్టకేలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బదిలీ ఉత్తర్వులు ఏ క్షణమైనా వెలువడే అవకాశం ఉంది.