10 మంది సీనియర్ విద్యార్థుల సస్పెన్షన్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఇటీవల కొత్తగా కళాశాలలో చేరిన వైద్య విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ పేరిట ఇబ్బందులకు గురిచేశారని, గోడ కురీ్చలు వేయించడం వంటి చర్యలతో వేధించారని కళాశాల డైరెక్టర్‌కు రాత పూర్వక ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు పదిమంది సీనియర్ వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ విధించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఏర్పడిన ఈ వైద్య కళాశాలకు 2016 జనవరిలో భారత వైద్యమండలి (ఎంసీఐ) నుంచి అనుమతులు లభించాయి. అదే సంవత్సరం జూన్‌లో తరగతులు ప్రారంభం కాగా.. ఇప్పటివరకు ర్యాగింగ్ ఘటనలు చోటుచేసుకోలేదు. తాజాగా ర్యాగింగ్ కారణంగా 10 మంది విద్యార్థుల సస్పెన్షన్ చర్చనీయాంశంగా మారింది. సదరు విద్యార్థులపై డిసెంబర్ ఒకటి వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని.. ర్యాగింగ్‌ను ఉపేక్షించేది లేదని కళాశాల డైరెక్టర్ రమేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment