సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించనుండగా, ఆయనకు జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ నటించనున్నట్లు సమాచారం. పుష్పరాజ్ (బన్నీ)కు చెల్లెలుగా ఐశ్వర్యా కనిపించనున్నట్లు టాక్.
అంతేకాకుండా అనుకోసి పరిస్థితుల్లో ఐశ్వర్యా చనిపోతుందని, దీనికి ఓ పోలీసు అధికారే కారణం అవుతాడని,దీంతో అతడిపై పుష్పరాజ్ ఎలా పగ తీర్చుకుంటాడన్న కథాంశాంతో మూవీ ఉండనుందట. మరి ఈ రోల్‌కు ఐశ్వర్యా ఓకే చెబుతుందా? లేక సిస్టర్ రోల్ అని సైడ్ అవుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా బాలీవుడ్ నటి ఊశ్వరిరౌటేలా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది. ఇలా అన్ని హంగులతో సినిమాపై ఇప్పటికే పాజిటివ్ హైప్ క్రియేట్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
చదవండి : మరో రికార్డు సొంతం చేసుకున్న సిద్ శ్రీరామ్
'ఆ ఫోటోలు పెడుతున్నారు..కొంచెమైనా సిగ్గుండాలి'
Comments
Please login to add a commentAdd a comment