
సాక్షి, అమరావతి: ఏపీలో నేటి నుంచి 104 వాహనాలకు బ్రేకులు పడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 292 వాహనాలను ఆపేసి సమ్మెలోకి చేపడుతున్నట్లు 104 ఉద్యోగుల సంఘం ప్రకటించింది. జిల్లా కలెక్టరేట్ల ఎదుట, వైద్యాధికారి కార్యాలయాల ఎదుట నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు ఉద్యోగులు తెలిపారు. గతంలో వేతనాల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ.. అది అమలు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ.. అది నెరవేరలేదని, తమను ప్రభుత్వం మర్చిపోయారని 104 ఉద్యోగులు అంటున్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment