
104 కొత్త వాహనాలు
విజయనగరం ఫోర్ట్: పల్లె ప్రాంత ప్రజలకు తమ గ్రామాల్లోనే వైద్య సేవలు అందించేలా నాడు మహానేత రూపొందించిన పల్లె సంజీవని మళ్లీ సిద్ధమవుతోంది. ఆస్పత్రులకు వెళ్లలేని రోగులకోసం నేరుగా 104 వాహనా లు ఉదయం 7 గంటలకే గ్రామానికి చేరుకు ని అక్కడి రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు చేసి, నెలకు సరిపడా మందులు అందించేవారు.దీనివల్ల రోగులు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన మరణానంతరం ఆ సేవలు సన్నగిల్లాయి. నెలల తరబడి వైద్యంకోసం రోగులు ఎదు రు చూడాల్సిన దుస్థితి దాపురించింది. వారి సమస్యలు తెలుసుకున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ వాటికి పునరుద్ధరించేందుకు చర్యలు చపట్టారు.
ఆధునిక హంగులతో వాహనాలు
వాహనాల రూపురేఖలు పూర్తిగా మార్చేసి అత్యాధునిక వసతులతో కూడిన 104 మొ బైల్ హెల్త్ సర్వీస్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. మండలానికి ఒకటి చొప్పన 104 వాహనాలను జిల్లాకు 34 కేటాయించా రు. వాహనాల్లో నాణ్యమైన మందులు, నిపు ణులైన వైద్యులు, సిబ్బంది ఉండేలా చర్య లు చేపట్టారు. జూలై ఒకటో తేదీ నుంచి కొ త్త వాహనాలు అందుబాటులోకి వచ్చే అవ కాశం ఉంది. ఈ సౌకర్యం అందుబాటులో ఉన్న రోజుల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు బీపీ, మధుమేహం, ఆస్తమా, మూర్చ, దగ్గు, జలుబు, జ్వరం వంటి వాటికి 104 వాహనాలపైనే ఆధారపడేవారు. వారికి నెలకు సరిపడా మందులను 104వాహనాల ద్వారా అందించేవారు.
టీడీపీ హయాంలో కనుమరుగు: గత టీడీపీ ప్రభుత్వం 104 వాహనాలను పూర్తిగా మూలకు నెట్టేసింది. మందులను కూడా అంతంత మాత్రంగానే అందించేది. వైఎస్సార్ హయంలో నెలలో 28 రోజులు గ్రామాలకు వెళ్లే వాహనాలు టీడీపీ హయాంలో నామమాత్రంగా వెళ్లేవి. కొన్ని వాహనాలు శిథిలావస్థకు చేరుకున్నా... పట్టించుకోలేదు. మళ్లీ సర్కారు తాజా నిర్ణయంతో సేవలు అందుబాటులోకి రానున్నాయి.
గ్రామాల్లోనే వైద్య సేవలు: ఆరోగ్య సమస్యలతో గ్రామీణ ప్రాంత ప్రజలు దూరంగా ఉండే పిహెచ్‌సీలకు వెళ్లే పనిలేకుండా 104 వాహనంలోనే అవసరమైన వారికి పరీక్షలు చేసి మందులు సైతం అందజేస్తారు.
104 వాహనంలో అందే సేవలు
వాహనంలో ల్యాబ్‌టెక్నీషియన్ ఉంటారు. అక్కడే రక్త పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తారు. దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, మధుమేహం వంటి జబ్బులకు, గర్బిణులకు మందులు అందజేస్తారు. కొత్త వాహనంలో ఆక్సిజన్ సిలిండర్‌తోపాటు, వైద్యుడు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించనున్నారు. ఎవరు ఏ సమయంలో వచ్చినా అందరికీ మందులు అందజేసేలా చర్యలు చేపడుతున్నారు. 104 వాహనాల్లో వైద్యులు పరీక్ష చేసిన తర్వాత ఏదైనా అనారోగ్యంతో ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వస్తే 104 వాహనంలో పరీక్షలు చేసిన డాక్టరే మళ్లీ పరీక్షిస్తారు. దీని వల్ల రోగికి ఒకే డాక్టర్‌తో పూర్తి స్థాయి వైద్యసేవలు అందుతాయి.ఫ్యామిలీ డాక్టర్ విధానంలో 104 వాహనాల వైద్యులు సేవలు అందిస్తారు. రోగి సమాచారా న్ని డిజిటలైజేషన్ చేస్తారు. తర్వాత 104 వాహనంలో ఒకసారి చికిత్స చేయించు కున్న రోగి వివరాలు ఎక్కడైనా తెలుసుకుని ఆ రోగికి ఫాలోఅప్ వైద్యం సులభంగా అందించే అవకాశం ఉంది.
పల్లెవాసులకు ఆధునిక వైద్యం
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కొత్తగా 34 వాహనాలను మంజూరు చేసింది. అత్యాధునిక వసతులతో వాహనాలను రూ పొందించారు. కొత్త వాహనాల ద్వారా పల్లె ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందనున్నాయి. – బి.సూర్యారావు, 104 జిల్లా మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment