డాక్టర్ ఉమా సుందరికి వినతి పత్రం సమర్పిస్తున్న సిబ్బంది
కడప రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని, తమ సమస్యలను పరిష్కరించాలని చంద్రన్న 104 సంచార వైద్య సిబ్బంది కోరారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజక వర్గాల కేంద్రాల్లో ఎన్టీఆర్ విగ్రçహా లకు వినతి పత్రం సమర్పించారు. జీఓ 151– ని అమలు చేయాలని, తమను ప్రభుత్వ రంగ సంస్ధ ఉద్యోగులుగా పరిగణించాలని కోరుతూ వీరు చేపట్టిన సమ్మె బుధవారానికి రెండో రోజుకు చేరింది.
రాష్ట్ర ప్రభుత్వం 104 ఉద్యోగులు చేపడుతున్న సమ్మెను నిర్వీర్యం చేయడానికి ఉక్కుపాదం మోపుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో అద్దెకు వాహనాలు, డ్రైవర్లను తీసుకొచ్చి పల్లెలకు పంపిస్తున్నారు. ఉదాహరణకు సిద్దవటంలో ఒక డ్రైవర్‌ను తీసుకువచ్చి 104 వాహనాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించగా ఆ విభాగం ఉద్యోగులు అడ్డగించారు. డ్రైవర్‌ను లైసెన్స్‌ను చూపించమని అడిగారు. అతని వద్ద లైసెన్స్ లేకపోవడంతో ఎందుకు ఇలా చేస్తున్నారని నిర్వాహకులను సిబ్బంది ప్రశ్నించారు. దీంతో అద్దెకు ఒక వాహనాన్ని, డ్రైవర్‌ను తీసుకొని వెళ్లారు. జిల్లాలో ప్రలు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.
తమ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ‘104’అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భాస్కర్, కార్యదర్శి ఆనంద్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఉమా సుందరిని కోరారు. ఈమేరకు వినతి పత్రం సమరించారు.
Comments
Please login to add a commentAdd a comment