ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతును తమ సిబ్బందే ఆస్పత్రికి తరలిస్తున్నారంటూ కౌలు రైతును పోలీసులు భుజాలపై తీసుకెళ్తున్నట్లు ఉన్న వీడియోను విడుదల చేశారు. అయితే ఘటన జరిగిన అనంతర పరిణామాలు మాత్రం పోలీసులనే దోషులుగా చూపుతున్నాయి. సీఎం సభా ప్రాంగణం వద్ద జిల్లా వైద్యాధికారి, హెలీప్యాడ్ వద్ద అంబులెన్సులు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండగా పోలీసులు ఎందుకు తరలించాల్సి వచ్చింది? సీఎం చంద్రబాబు సైతం పోలీసుల వల్లనో, మరే కారణంగానో అవమానంగా భావించి కౌలు రైతు చనిపోయాడంటూ ఎందుకు ప్రసంగించారు?