
న్యూఢిల్లీ: షాంఘై మాస్టర్స్ ఏటీపీ టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌లో బరిలోకి దిగిన బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయం తొలి రౌండ్‌లో... దివిజ్ శరణ్ (భారత్)– సితాక్ (న్యూజిలాండ్) జోడీ రెండో రౌండ్‌లో ఓటమి చవిచూశాయి.
బోపన్న–వాసెలిన్ జంట 6–7 (4/7), 4–6తో మెక్‌లాచ్లాన్ (జపాన్)–స్ట్రఫ్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది. కుబోట్ (పోలాండ్)–మెలో (బ్రెజిల్) జంట 6–3, 6–4తో దివిజ్–సితాక్ ద్వయంపై గెలిచింది. దివిజ్–సితాక్ జంటకు 27,450 డాలర్లు (రూ. 20 లక్షల 37 వేలు), బోపన్న–వాసెలిన్ జోడీకి 14,480 డాలర్లు (రూ. 10 లక్షల 74 వేలు ) ప్రైజ్‌మనీగా లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment