వేతనాలందక వెతలు | 104 employees wages stalled in Nalgonda | Sakshi
Sakshi News home page

వేతనాలందక వెతలు

Published Wed, Aug 6 2014 1:19 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

వేతనాలందక వెతలు - Sakshi

వేతనాలందక వెతలు

 నల్లగొండ టౌన్ / మిర్యాలగూడ :గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న 104 ఉద్యోగులకు వేతనాలు నిలిచిపోయాయి. రాష్ట్ర విభజన ప్రభావంతో ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో ఉద్యోగులు అప్పులు చేసి కాలం వెల్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. ఫిబ్రవరి వరకు వేతనాలు అందించిన రాష్ట్ర ప్రభుత్వం మార్చి నుంచి ఉద్యోగులకు వేతనాలను విడుదల చేయలేదు.
 
 రూ.కోటికిపైగా బకాయిలు
 జిల్లాలో 104 వాహనాలు 26 వరకు నడుస్తున్నా యి. సుమారు 156 మంది వివిధ రకాల ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఫార్మసిస్టులు, ల్యాబ్‌టెక్నీషియన్‌లు, డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్‌లు, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వీరం తా ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్నా రు. వీరంతా నిరుపేదలే కావడం తో ప్రతి నెలా వేతనం వస్తే తప్ప పూటగడవని పరిస్థితి. ప్రస్తు తం  ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్‌లకు రూ.10,900, డ్రైవర్లకు రూ.8వేలు, కంప్యూటర్ ఆపరేటర్‌లకు రూ. 9500, సెక్యూరిటీ గార్డులకు రూ. 6700ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుంది.
 
 వీరి వేతనాల కోసం ప్రతి నెలా రూ.18.50లక్షలు విడుదల చేయాల్సి ఉంది. 5నెలలుగా సు మారు కోటి రూపాయల వేతనాలు బకాయి ఉ న్నా వాటి విడుదల విషయంలో ప్రభుత్వం నోరు మెదపడం లేదని  ఉద్యోగు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు రాక జూన్ నెలలో తమ పిల్లలను పాఠశాలలు, కళాశాలల్లో చేర్చడానికి, వారికి పుస్తకాలు, దుస్తులు, ఫీజుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆవేదన వ్య క్తం చేశారు. పెరిగిన ధ రల కారణంగా నెలనెలా వేతనాలు వస్తేనే పూ టగడవడం కష్టంగా మారిందని వాపోతున్నా రు. అధికారు లు తగిన చర్యలు తీసుకొని తమ వేతనాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
 
 తమకు ఐదు నెలలుగా వేతనా లు రావాల్సి ఉందని, వాటిని ఇప్పించాలని అధికారులు, మంత్రులను కలిసి 104 ఉద్యోగులు విన్నవించారు. ఇప్పిస్తామని వారు హామీ ఇచ్చారే గానీ నేటికీ వేతనా లు అందలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  104 వాహనాన్ని వదిలి ఇతర పనులు చేయలేక, వేతనాలు లేక పూటగడవడం కష్టంగా మారిందని వారు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్   త మను మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల కోసం మేలో జిల్లా  వైద్యాధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించగా వారం రోజుల్లో అందేలా చర్యలు తీ సుకుంటామని అదనపు జేసీ వెంకట్రావు హా మీ ఇచ్చారని, అయినా నేటికీ అందలేదని ఉద్యోగులు తెలిపారు. ఇటీవల జిల్లా కలెక్టరు చిరంజీవులును కలిసి తమ సమ్యను విన్నవించామని, ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డిని కలిసి విన్నవించినా ఫలితం లేద ని 104 సిబ్బంది వాపోయారు.
 
 పది రోజుల్లో మూడు నెలల వేతనాలు
 పది రోజుల్లో మూడు నెలల వేతనాలను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయనుంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఈ విషయాన్ని తెలిపారు. నిధులు విడుదల కాగానే 104 ఉద్యోగులకు వేతనాలు అందిస్తాం. వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
 - పి.ఆమోస్, డీఎంహెచ్‌ఓ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement