చేతబడి చేసి తీసుకెళ్లారు : చంద్రముఖి | BLF MLA Candidates Chandramukhi Missing Case | Sakshi

చేతబడి చేసి తీసుకెళ్లారు : చంద్రముఖి

Published Fri, Nov 30 2018 11:00 AM | Last Updated on Fri, Nov 30 2018 11:00 AM

BLF MLA Candidates Chandramukhi Missing Case - Sakshi

చంద్రముఖి

బంజారాహిల్స్‌: గోషామహల్‌ బీఎల్‌ఎఫ్‌ అభ్యర్ధి, ట్రాన్స్‌జెండర్‌ ఎం.రాజేష్‌ అలియాస్‌ చంద్రముఖి(32) అదృశ్యంపై మిస్టరీ వీడింది. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చంద్ర ముఖి బుధవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షం కావడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. తన కూతురు కనిపించడం లేదని చంద్రముఖి తల్లి హైకోర్టులో హెబియస్‌కార్పస్‌ పిటీషన్‌ దాఖలు చేయడంతో బుధవారం పోలీసులకు చెమటలు పట్టాయి.

ఏమాత్రం ఆచూకి లేని చంద్రముఖిని గురువారం ఉదయంలోగా హైకోర్టులో ఎలా ప్రవేశపెట్టాలో తెలియక సతమతమయ్యారు. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బృందాలుగా విడిపోయి తెలుగు రాష్ట్రాలను జల్లెడపట్టారు. ఎట్టకేలకు రాత్రి 11  ప్రాంతంలో చంద్రముఖి సికింద్రాబాద్‌లోని లంబా థియేటర్‌ సమీపంలో ఉన్నట్లు సమాచారం అంద డంతో పోలీసులు ఆమెను స్టేషన్‌కు ర ప్పించడంతో కథ సఖాంతమైంది.

గురువారం ఉదయం ఆమెను హైకోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవే శపెట్టారు. అంతకుముందు ఆమె విలేకరులతో మాట్లా డుతూ.. ఆ రోజు ఉదయం 8 గంటలకు రూ.25 వేలు బ్యాంకులో జమ చేసేందుకు వెళుత్తుండగా ఓ ఆటో ఎక్కడం జరిగిందన్నారు. ఆ ఆటో వాల తనను కోఠిలోని ఓ వీధిలోకి తీసుకెళ్లాడని అక్కడ మరో ఆటో ఎక్కి ఎల్బీనగర్‌లో దిగానన్నా రు. అక్కడ బస్సు ఎక్కి విజయవాడలో, అక్కడి నుం చి తిరుపతి, అక్కడి నుంచి చెన్నై వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఎవరో తనను చేతబడి చేసి ముందుకు నడిపించినట్లుగా ఉందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement