రాఘవేందర్‌రెడ్డి (ఫెల్)
చేవెళ్ల: పెళ్లి సంబంధాలు కుదరడం లేదనే మనస్థాపం చెందిన ఓ యువకుడు ఉరివేసుకొని ఆతహ్మత్య చేసుకున్నాడు. ఈ సంఘటన చేవెళ్ల మండలంలోని పామెన గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... చేవెళ్ల మండలంలోని పామెన గ్రామానికి చెందిన తొలికట్ట నర్సింహారెడ్డి, లక్ష్మమ్మలకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. నర్సింహారెడ్డి ఆర్టీసీ డ్రైవర్.
కూతురు పెళ్లి కాగా, ఇద్దరు కుమారులు గ్రామంలో వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు. పెద్ద కుమారుడు రాఘవేందర్‌రెడ్డి (27)కి పెళ్లీడు వచ్చిందని రెండు మూడు సంబంధాలు చూసిన అవి కుదరలేదు. దీంతో యువకుడు తనకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్థాపం చెంది తరచూ బాధపడేవాడు. గురువారం తెల్లవారుజామున పొలం వైపు వెళ్లి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం పొలాల వైపుకు వెళ్లిన మృతుడి చిన్నాన్న శివారెడ్డి మృతదేహాన్ని గమనించి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబీకులు మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment