Ind vs Aus: Rohit Sharma, Steve Smith receive Test caps from PM Modi - Sakshi
Sakshi News home page

Ind Vs Aus: ప్రధానులు మోదీ, ఆల్బనీస్‌తో కెప్టెన్లు.. కోహ్లిని పరిచయం చేసిన రోహిత్‌!

Published Thu, Mar 9 2023 1:15 PM | Last Updated on Thu, Mar 9 2023 1:48 PM

Ind Vs Aus 4th Test: Rohit Get Cap From PM Modi Cheers Smith Video - Sakshi

Ind Vs Aus 4th Test Ahmedabad: బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సిరీస్‌లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టుకు ఇరు జట్ల ప్రధానులు హాజరయ్యారు. అహ్మదాబాద్‌లో గురువారం ఆరంభమైన మొదటి రోజు ఆటను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి అంటోని ఆల్బనీస్‌తో కలిసి స్టేడియానికి విచ్చేశారు.

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సభ్యులు వీరికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ ఆసీస్‌ ప్రధాని ఆల్బనీస్‌ను సత్కరించారు. క్రికెట్‌లో 75 ఏళ్లుగా భారత్‌- ఆస్ట్రేలియా మధ్య కొనసాగుతున్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ ఆల్బనీస్‌ చిత్రపటాన్ని బహూకరించారు.

కెప్టెన్లకు స్పెషల్‌ క్యాప్‌
ఇక బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రధాని మోదీకి ఆయన ఫొటోను అందించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు స్పెషల్‌ క్యాప్‌ అందించగా.. ఆల్బనీస్‌ తమ జట్టు సారథి స్టీవ్‌ స్మిత్‌కు క్యాప్‌ అందించారు. ఈ క్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్‌, స్మిత్‌ జట్టు సభ్యులను తమ ప్రధానులకు మర్యాదపూర్వకంగా పరిచయం చేశారు.

ఇక రోహిత్‌ శర్మ.. మాజీ సారథి, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిని ప్రధాని మోదీకి పరిచయం చేయగానే ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా నాలుగు రోజుల పర్యటలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్‌ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా నిర్ణయాత్మక చివరి టెస్టులో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిస్తే రోహిత్‌ సేన డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రవేశిస్తుంది. లేదంటే న్యూజిలాండ్‌-శ్రీలంక ఫలితం వెలువడిన తర్వాతే ఫైనల్లో ఆసీస్‌ను ఢీకొట్టేది ఎవరో తేలుతుంది. 

చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. కొత్త కెప్టెన్‌ దూరం! సారథిగా భువీ
WPL 2023: గుజరాత్‌ కెప్టెన్‌ స్థానంలో సౌతాఫ్రికా ఓపెనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement