ట్రంప్ సుంకాల మోత, సోషల్‌ మీడియాలో మీమ్స్‌ హోరు మాములుగా లేదు! | Donald Trump Reciprocal Tariffs Meme Fest on social media | Sakshi
Sakshi News home page

ట్రంప్ సుంకాల మోత, సోషల్‌ మీడియాలో మీమ్స్‌ హోరు మాములుగా లేదు!

Published Thu, Apr 3 2025 2:47 PM | Last Updated on Thu, Apr 3 2025 5:45 PM

Donald Trump Reciprocal Tariffs Meme Fest on social media

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  (Donald Trump)   దాదాపు అన్ని దేశాలపై నా టారిఫ్స్‌ కొరడా ఝుళిపింఆడు. దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై  "రెసిప్రోకల్ టారిఫ్స్" (Reciprocal Tariffs) విధించడం  ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని.. అయితే కనీసం 10శాతం పన్నులు(Tariffs) చెల్లించాల్సింది ఉంటుందని ప్రకటించారు. భారత్‌  నుంచి దిగుమతి వస్తువులపై  26శాతం, చైనా నుండి వచ్చే వస్తువులపై 34 శాతం పన్ను విధించారు. దీంతో చైనా మొత్తం పన్నుల శాతం 54 శాతానికి  చేరింది. ఇక సౌత్‌  కొరియాపై 25 శాతం యూరోపియన్ యూనియన్ నుండి వచ్చే వస్తువులపై 20 శాతం పన్ను విధించారు. యూకే వచ్చే వస్తువులపై 10 శాతం పన్ను విధించారు. ట్రంప్‌  తాజా ప్రకటనపై పలు దేశాధినేతలు తీవ్ర నిరసన వ్యక్తం  చేశారు కూడా.  మరోవైపు ట్రంప్‌ వడ్డింపులపై సోషల్‌మీడియాలో మీమ్స్‌ వెల్లువెత్తాయి.

అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి, వృద్ధికోసం దాని మిత్రదేశాలు సహా దాదాపు అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలను విధించారు ట్రంప్‌. ఎవరూ ఆపలేని ఆర్థిక యుద్ధం జరుగుతోందంటూ జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించి, సుంకాలను ప్రకటించిన వెంటనే #TrumpTariffs , #TradeWar  ఎక్స్‌( X)లో ట్రెండింగ్‌ షురూ అయింది. 

 

చదవండి: రాత్రికి రాత్రే‌ సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్‌ గర్ల్‌?

"విముక్తి దినోత్సవ శుభాకాంక్షలు! మన డబ్బు నుండి మనం విముక్తి పొందేలా చేసినందుకు ట్రంప్ ధన్యవాదాలు. ఇకనాకు బువ్వ ఉండదు.  అమెరికా గ్రేట్‌  ఎగైన్‌ అంటే మనల్ని తిరిగి మహా మాంద్యంలోకి తీసుకెళ్లడం అని అనుకున్నాడనుకుంట’’ అని ఒకరు ట్వీట్‌ చేశారు. 
జపాన్ ఎగుమతులపై 24 శాతం సుంకాలు విధించినందుకు ట్రంప్‌ను విమర్శిస్తూ,"సరైన మనస్సు గల జపనీస్ వ్యక్తి అమెరికన్ కారును ఎందుకు కొనుగోలు చేయాలి?" అని  ప్రశ్నించారు.

 

చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్‌ వీడియో

అంతేకాదు ఈ సుంకాల నుండి రష్యాను మినహాయించినందుకు  నెటిజన్లు ట్రంప్‌ను కూడా ఎగతాళి చేశారు. "ట్రంప్ రష్యాపై విధించిన సుంకాలు లేదా ఆర్థిక చర్యలు లేవు. నాకు ఎందుకు ఆశ్చర్యంగా ఉంది" అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నవ్వుతూ  ఉన్న జిఫ్‌ను  ట్విట్‌ చేశాడు. "ట్రంప్‌స్టర్స్ శుభవార్త! మీ కిరాణా సామాగ్రికి ఎంత  మిగులుతుందో గుర్తించడం కష్టం.. ఎందుకంటే మిగతాటికి ఖర్చులు మరింత భారం అవుతాయి కనుక’’  అంటూ మరొక యూజర్‌  ట్రంప్‌ సుంకాలపై విమర్శనాస్త్రాలు సంధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement