
పుతిన్‌పై కాదు, పెంగ్విన్స్‌పై పన్నులు: ట్రంప్ సుంకాలపై సెటైర్లు
అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దాదాపు 1800 దేశాలను టార్గెట్ చేస్తూ పరస్పరం (రెసిప్రోకల్ టారిఫ్స్) పన్నులు విధించడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. అనేక దేశాధినేతలు తమ స్పందన వెల్లడించారు కూడా. దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్యబాణాలు వెల్లువెత్తాయి కూడా. మరీ ముఖ్యంగా అయితే జనావాసాలు లేని ఒక ద్వీపంపై ట్రంప్ సుంకాలు విధించిన తీరు మరింత విస్మయ పర్చింది. దీనిపై పెంగ్విన్ మీమ్స్(penguin memes) ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
సబ్ అంటార్కిటిక్ హిందూ మహాసముద్రంలోని హర్డ్ అండ్ మెక్‌డొనాల్డ్ దీవుల (Heard and McDonald Islands) పై ఎందుకు పన్నులు విధించారు అనేదే పెద్ద ప్రశ్న. మానవ జనాభా లేని బంజరు సబ్-అంటార్కిటిక్ ఆస్ట్రేలియన్ ప్రాంతమైన హర్డ్ , మెక్‌డొనాల్డ్ దీవుల నుండి వచ్చే అన్ని ఎగుమతులపై ట్రంప్ 10శాతం సుంకాలను విధించారు. అయితే ఈ దీవులు ఆస్ట్రేలియా భూభాగం కిందకు వస్తాయి కాబట్టి.. వాటిని టారిఫ్స్ జాబితాలో చేర్చినట్లు వైట్ హౌస్ అధికారి వివరణ ఇచ్చారు.

వాస్తవానికి ఈ దీవుల్లో మనుషులు నివసించరు. దాదాపు 80 శాతం మంచుతో కప్పబడిన ఈ ప్రాంతం యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది. దీవులు యాక్టివ్ అగ్నిపర్వతాలు, వివిధ సముద్ర జంతువులకు నిలయంగా ఉండటంతో అక్కడ ప్రజలు నివసించటం లేదు. దాదాపు దశాబ్ధకాలం నుంచి ఆ ప్రాంతాన్ని ఎవ్వరూ సందర్శించలేదని తెలుస్తోంది. ఈ ప్రాంతం పెంగ్విన్లు, సీల్స్‌కు ఆవాస ప్రాంతంగా ఉంది.
The penguin wore a suit. But didn’t escape the Trump tarifs on the Heard og McDonald Islands. Maybe it didn’t say thank you? pic.twitter.com/aaPr1ufCr0
— Christopher Arzrouni (@CArzrouni) April 3, 2025
ఓవల్ ఆఫీసులో ఉక్రెయిన్ నాయకుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్థానంలో పెంగ్విన్‌ను అమెరికా అధ్యక్షుడు ,ఉపాధ్యక్షుడు వాన్స్‌తో ఇటీవల జరిగిన వివాదాస్పద సమావేశానికి ఉటింకిస్తూ ఒక మీమ్ ఉంది. జెలెన్‌స్కీ ప్లేస్‌లో పెంగ్విన్‌ను ఉంచారు. మరొక మీమ్ యుఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో స్థానంలో చక్రవర్తి పెంగ్విన్‌ను చూస్తున్నట్లు ఉంది. "పెంగ్విన్‌లు సంవత్సరాలుగా మనల్ని చీల్చి చెండాడుతున్నాయి" అని మొదిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మాజీ కమ్యూనికేషన్స్ చీఫ్‌గా 11 రోజులు పనిచేసిన ఆంథోనీ స్కారాముచ్చి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. చమత్కరించారు. ఈ సుంకాల జాబితాలో రష్యా లేదనే వాస్తవాన్ని ప్రస్తావిస్తూ. "ట్రంప్ పుతిన్‌పై కాదు పెంగ్విన్‌లపై సుంకాలను విధించారు" అంటూ అమెరికా సెనేట్ డెమోక్రటిక్ నాయకుడు చక్ షుమర్ పోస్ట్ చేశారు,
Outstanding memes capturing the absurdity of Trump’s tariff on penguin inhabited Heard & McDonald Islands #owngoal #PowerToThePenguins pic.twitter.com/AETymaLFdC
— Eddie Lloyd (@worldzonfire) April 4, 2025
;
చదవండి: ట్రంప్ సుంకాల మోత, సోషల్ మీడియాలో మీమ్స్ హోరు మాములుగా లేదు!
మరోవైపు ట్రంప్ సుంకాల దెబ్బతో అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 2020లో కోవిడ్ మహమ్మారి తర్వాత మళ్లీ ఇపుడు స్టాక్స్ తీవ్రంగా నష్టపోతున్నాయి.