Mercenary killers
-
ప్రిగోజిన్ మరణంపై అనేక అనుమానాలు!
వాషింగ్టన్: రష్యాలోని కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ మరణంపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ సహా పదిమంది దుర్మరణం పాలయ్యారు. అయితే, ఈ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, ఉద్దేశపూర్వకంగా కూల్చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, విమానం కూలిన తీరుతో పాటు ఇతరత్రా అంశాలను విశ్లేషించి ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపాయి. ఈ మేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి జనరల్ పాట్ రైడర్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానాన్ని క్షిపణితో కూల్చేశారని చెప్పారు. అయితే, దీనిపై మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. ఈ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పుతిన్ తన శత్రువులను తుదముట్టించే క్రమంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు. విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, కూల్చేశారని వివరించారు. అయితే, పేలుడుకు కారణమేమిటనే విషయం కానీ, తన పేరును కానీ వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. మరోవైపు, తన సెక్యూరిటీతో పాటు తన అనుచరుల భద్రత విషయంలో తమ చీఫ్ ప్రిగోజిన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారని వాగ్నర్ గ్రూపుకు చెందిన సైనికులు చెబుతున్నారు. అలాంటిది కీలక అనుచరులను వెంటబెట్టుకుని ఒకే విమానంలో ఎందుకు ప్రయాణించారో తెలియడం లేదంటున్నారు. వాగ్నర్ గ్రూపులోని కీలక వ్యక్తులంతా సెయింట్ పీటర్స్బర్గ్కు ఎందుకు వెళుతున్నారో కూడా తెలియదని చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియా ప్రిగోజిన్ ఆఫ్రికా దేశంలో ఉన్నారని అక్కడ తమ సైన్యంలో ఎవరైనా చేరాలనుకుంటే చేరవచ్చని ఆయన తెలుపుతున్నట్లు ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం చూస్తే తిరుగుబాటు నాయకుడిని ఆఫ్రికాలోనే హత్య చేసి దాన్ని విమాన ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రిగోజిన్ చనిపోయాడన్న వార్తపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. వాస్తవాలు ఏమిటో తెలియదు కానీ ఇందులో ఆశ్చర్యమేమీ లేదని అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ అయితే.. ప్రిగోజిన్ విమాన ప్రమాదంపై హేతుబద్దమైన అనుమానాలున్నాయని అన్నారు. మొత్తంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఎదురు తిరిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనడానికి ప్రిగోజిన్ ఉదంతాన్ని ఉదహరిస్తూ ప్రపంచ నేతలు స్పందించడం కొసమెరుపు. ఇది కూడా చదవండి: భారత్ చైనా సంబంధాలు బలపడాలి: జిన్‌పింగ్ -
బెలారస్ లో వాగ్నర్ సైన్యం.. అంతా ప్లాన్ ప్రకారమే..?
మాస్కో: రష్యా బలగాలపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ సైన్యం చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రస్తుతం బెలారస్ లో ఉన్నట్లుగా చూపిస్తూ ఇటీవల ఒక వీడియో బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్ బెలారస్ లో ఉంటేనే పోలాండ్, లిథువానా సమీపంలోని నాటో ఆస్తులపై చేసేందుకు అనువుగా ఉంటుందంటున్నాయి రష్యా వర్గాలు. లొకేషన్ చేంజ్.. రష్యాపై ఉన్నట్టుండి తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూపు సైన్యం చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్తోనూ రష్యా అధ్యక్షుడు పుతిన్ తోనూ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశంకో మధ్యవర్తిత్వం నడిపి సంధి కుదిర్చిన విషయం తెలిసిందే. సంధి జరిగిన నాటి నుండి ఇంతవరకు వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ ఎక్కడా బయట కనిపించలేదు. దీనిపై చాలా అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఇటీవల విడుదలైన కొన్ని వీడియోల ఆధారంగా ఆయన బెలారస్ లో ఆశ్రయం పొందినట్లు తెలుస్తోంది. రష్యాకే బెనిఫిట్.. బెలారస్ లో యెవ్జెనీ ప్రిగోజిన్ అక్కడి సైన్యానికి శిక్షణ ఇస్తోన్న కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్యా మాజీ సైన్యాధికారి ఆండ్రీ కర్తపోలోవ్ కొంత స్పష్టత ఇచ్చారు. వాగ్నర్ సైన్యం ప్రస్తుతం బెలారస్ లో ఉండడమే కరెక్టని, అక్కడ ఉంటేనే బెలారస్ సరిహద్దు ప్రదేశాలు పోలాండ్, లిథువానాలతోపాటు ఉక్రెయిన్ లోని నాటో ఆస్తులపై దాడి చేసే వీలుంటుందని, అది రష్యాకు కలిసొచ్చే అంశమేనని తెలిపారు. మరోపక్క ఇదంతా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రణాళికలో భాగమని, దాని అనుసారంగానే తిరుగుబాటు సైన్యాధ్యక్షుడు యెవ్జెనీ ప్రిగోజిన్‌ను దేశం దాటించి అతని స్థానంలో మరొకరిని వాగ్నర్ బృందానికి నాయకుడిగా నియమించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇది కూడా చదవండి: రిషి సునాక్ ప్రభుత్వానికి షాక్.. ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ.. -
తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్ తో పుతిన్ భేటీ..?
మాస్కో: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం 500 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గత వారం రోజులుగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల పుతిన్ సైన్యంపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్గేనీ ప్రిగోజిన్ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశమయ్యారు. గత వారం రోజుల్లో ఉక్రెయిన్ కు అమెరికా క్లస్టర్ బాంబులు సాయం చేయడం, టర్కీ దేశం తమవద్ద ఖైదీలుగా ఉన్న ఉక్రెయిన్ కమాండర్ లను విడుదల చేయడం వంటి హఠాత్పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా కూడా కొన్ని కీలక పావులు కదిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వాగ్నర్ గ్రూపుతోపాటు మరికొన్ని గ్రూపులను కలిపి మొత్తం 35 మందిని అధ్యక్షుడు పుతిన్ తో సమావేశానికి ఆహ్వానించింది క్రెమ్లిన్. ఈ సమావేశానికి కమాండర్లు కూడా హాజరవ్వగా సమావేశం మూడు గంటల పాటు సాగిందని తెలిపాయి క్రెమ్లిన్ వర్గాలు. ఈ సందర్బంగా క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రి పెస్కోవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. సమావేశం ఫలప్రదంగా సాగిందని.. వాగ్నర్ గ్రూపు తాము పుతిన్ సైనికులమని ఆయన ఆదేశిస్తే యుద్ధరంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నామన్నట్లు తెలిపారు. కొద్ది రోజుల క్రితం రష్యా సైన్యానికి ఎదురు తిరిగిన వాగ్నర్ గ్రూపు రోస్తోవ్ లోని సైనిక ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని మాస్కో వస్తున్నాం కాసుకోమని పుతిన్ కే సవాలు విసిరిన విషయం తెలిసిందే. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశంకో చొరవతో సంధి కుదిరి ప్రిగోజిన్ దళాలు తిరుగుముఖం పట్టాయి. ఒప్పందం ప్రకారం ప్రిగోజిన్ బెలారస్ వెళ్లాల్సి ఉండగా వెళ్లకుండా రష్యాలోని ఉన్నారు. ఈ సందర్బంగా యెవ్గేనీ ప్రిగోజిన్ మాట్లాడుతూ మేము చేసింది ప్రభుత్వంపై తిరుగుబాటు కాదని సైనిక బృందాలకు, నాయకులకు న్యాయం చేయమని ప్రభుత్వానికి తెలియజేసాం అంతేనని వివరణ ఇచ్చారు. ఇది కూడా చదవండి: బుద్ధి మారలేదు.. జైలు తప్పలేదు.. -
వాగ్నర్ గ్రూపులోని 21000 మందిని మట్టుబెట్టాం.. జెలెన్స్కీ
క్యీవ్ : ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్పెయిన్ మీడియా నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తిరుగుబాటు సైన్యమైన వాగ్నర్ గ్రూపుకు సంబంధించిన సుమారు 21000 మందిని చంపామని మరో 80,000 మంది గాయపడి ఉంటారని నిర్ధారించారు. పదహారు నెలలుగా సాగుతున్న యుద్ధంలో బలమైన రష్యాను ఉక్రెయిన్ సమర్థవంతంగానే ఎదుర్కొంది. రష్యా ఆక్రమించుకున్న ఒక్కో ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటూ ఉక్రెయిన్ ముందుకు సాగుతోంది. ఈ సందర్బంగా స్పానిష్ మీడియా సమావేశంలో పాల్గొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వారడిగిన కొన్ని సందేహాలకు సమాధానమిచ్చారు. యెవ్గెనీ ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ గ్రూపు చేసిన తిరుగుబాటు ప్రస్తావన రాగా రష్యాతో జరిగిన యుద్ధంలో వారు కూడా ఎక్కువగానే నష్టపోయారని తెలిపారు. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో రష్యా ప్రేరేపిత సైన్యమమైన వాగ్నర్ గ్రూపుకు చెందిన సుమారు 80000 మంది గాయాల పాలవగా దాదాపు 21000 మందిని మట్టుబెట్టామని అన్నారు. శత్రువును మా నేల మీద నుండి తరిమేయడమే మా ముందున్న ప్రధమ కర్తవ్యమని తెలిపారు. ఈ యుద్ధ నేపథ్యంలో మీ ప్రాణానికి హాని ఉంది భయంగా లేదా..? అని ఓ విలేఖరి ప్రశ్నించగా.. నాకంటే రష్యా అధ్యక్షుడికే ఎక్కువగా ప్రాణహాని ఉందని, నన్ను చంపాలనే ఉద్దేశ్యం ఆయనకు తప్ప ఎవరికీ లేదని, కానీ ఆయనను చంపాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయని అన్నారు. ఇదిలా ఉండగా జూన్ 29న రష్యా సైన్యం పైన తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూపు రష్యా అధ్యక్షుడికి కంటి మీద కునుకు లేకుండా చేసిన విషయం తెలిసిందే. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకో చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం చేయడంతో యెవ్గేనీ ప్రిగోజిన్ దళాలు శాంతించి వెనక్కు మళ్ళిన విషయం తెలిసిందే. కాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రిగోజిన్ దళాలకు మూడు ప్రత్యామ్నాయాలు విధించినట్లు రష్యాతో తిరిగి ఒప్పందం కుదుర్చుకోవాలని, యధావిధిగా పౌరసత్వాన్ని కొనసాగించాలని లేదా బెలారస్ కు తరలిపొమ్మని సూచించినట్లు చెబుతున్నాయి మీడియా వర్గాలు. ఇది కూడా చదవండి: వారు కాపాడటానికి వచ్చారనుకున్నాం.. కానీ.. -
వాళ్ళే అసలైన హీరోలు.. వీళ్లంతా పిరికిపందలు
మాస్కో: రష్యాలో తిరుగుబాటు విషయమై బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకో జరిపిన మధ్యవర్తిత్వం ఫలించడంతో వాగ్నర్ బలగాలు తమ స్థావరాలకు తిరుగు ప్రయాణమయ్యాయి. రొస్తోవ్ ప్రజానీకం వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా స్థానికులు తిరిగి వెళ్తోన్న వాగ్నర్ సైన్యాన్ని హీరోలుగానూ స్థానిక పోలీసులను పిరికిపందలగానూ, దొంగలుగానూ అభివర్ణించారు. ప్రిగోజిన్ బృందాలు రష్యాను వీడి వెళ్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో రాగానే రొస్తోవ్‌లోని జనం రోడ్డు మీదకు వచ్చి తమ అభిప్రాయాలను వెల్లడించారు. రష్యా సైన్యం తీరు మొదటి నుంచీ తప్పులతడకగానే ఉందని వాగ్నర్ గ్రూపుపై వారి ఆధిపత్యం సహించలేకే వారు తిరుగుబాటు చేశారని అన్నారు. బఖ్ ముత్ లోనూ ఇతర చోట్ల ఏం జరిగిందో మీరు చూశారు. ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో మన సైనికులు వేల సంఖ్యలో చనిపోయారు. రష్యా సైన్యం వారికి తగినన్ని ఆయుధాలు పంపలేదని, మనవాళ్ళే మనం గెలవకుండా అడ్డుకున్నారని ఇక్కడివారు చెబుతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెంచి పోషించిన కిరాయి సైన్యం ఆయనపైనే తిరుగుబాటు చేసి ప్రిగోజిన్ నాయకత్వంలో మాస్కోకు వస్తున్నామని చెప్పగానే రష్యా సైన్యం భయపడిందని.. వాగ్నర్ సైనికులే అసలైన హీరోలని.. వారికి భయపడి పారిపోయిన ఇక్కడి పోలీసులు పిరికిపందలు, దొంగలని అన్నారు. People in Rostov yell 'shame' and 'traitors' at police who came in to the city after Wagner forces left. pic.twitter.com/bL1Rz8ZX4D — The Spectator Index (@spectatorindex) June 24, 2023 -
రష్యాలో హైడ్రామా మధ్య ముగిసిన తిరుగుబాటు సంక్షోభం
మాస్కో: తిరుగుబాటు నాయకుడు యెవ్జెనీ ప్రిగోజిన్ పై ఉన్న క్రిమినల్ కేసును ఉపసంహరించుకునే విధంగా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకో జరిపిన మధ్యవర్తిత్వం ఫలించింది. దీంతో మాస్కో వైపుగా కదులుతామని హెచ్చరించిన వాగ్నర్ తిరుగుబాటు సైన్యం శాంతించి తిరుగుముఖం పట్టింది. క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ మాట్లాడుతూ రక్తపాతాన్ని నిరోధించి, అంతర్గత ఘర్షణలను తగ్గుముఖం పట్టించి, పరిస్థితులు తీవ్ర పరిణామాలకు దారితీయకుండా చూడాలన్నదే మా ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్బంగా దేశం కోసం వారు చేసిన వీరోచిత పోరాటాలను మేమెప్పుడూ గౌరవిస్తామని అన్నారు. బెలారస్ అధ్యక్షుడు లుకాశెంకో జరిపిన ఈ మధ్యవర్తిత్వం ప్రకారం వాగ్నర్ సైన్యం నాయకుడు యెవ్జెనీ ప్రిగోజిన్ పై ఉన్న క్రిమినల్ కేసును ఎత్తివేస్తున్నట్లుగానూ, అలాగే వాగ్నర్ సైనికులపై ఎలాంటి విచారణ కూడా ఉండదని పెస్కోవ్ అన్నారు. ఇక ఈ తిరుగుబాటులో పాల్గొనని సైనికులు యధాతధంగా తమ విధులకు హాజరవ్వొచ్చని తెలిపారు. యెవ్జెనీ ప్రిగోజిన్ పై తీవ్రవాద నేరం మోపబడ్డ గంటల వ్యవధిలోనే అతని తిరుగుబాటు సైన్యం రష్యాలో ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. శనివారం రష్యా సైన్యంపై చేసిన తిరుగుబాటుకి దక్షిణ రష్యా అట్టుడికిపోయింది. అప్పటికే ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని ఉత్తర రష్యా వైపుగా వస్తున్నామని ప్రిగోజిన్ ప్రకటించారు. దీంతో మరింత విధ్వంసం తప్పదని భావించిన తరుణంలో రష్యా మిత్రపక్షమైన బెలారస్ అధ్యక్షుడు లుకాశెంకో చొరవ తీసుకుని జరిపిన మధ్యవర్తిత్వం ఫలించడంతో ఊపిరి తీసుకున్నాయి రష్యా శ్రేణులు. ఇది కూడా చదవండి: ఈజిప్టుకు చేరుకున్న ప్రధాని మోదీ -
రష్యాలో తిరుగుబాటు ఆరంభం మాత్రమే.. ఉక్రెయిన్
క్యీవ్: రష్యాపై వాగ్నర్ గ్రూపు కిరాయి సైన్యంతో విరుచుకుపడుతోన్న సంఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సన్నిహితుడు మిఖాయిలో పోడోల్యాక్ స్పందిస్తూ "ఇది ఆరంభం మాత్రమే"నని తెలిపారు. రష్యా తిరుగుబాటు సైన్యం రొస్తొవ్ మిలటరీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించినట్లు ఒక ఆడియో టేపు ద్వారా వాగ్నర్ సంస్థ అధినేత యెవ్జెని ప్రిగోజిన్ తెలిపారు. ఊహించని విపత్తు ఎదురవడంతో రష్యాకు ఇప్పుడు ఊపిరాడటం లేదు. ఒకప్పుడు తమతో కలిసి ఉన్న వాగ్నర్ సంస్థ ఇప్పుడు తిరుగుబాటు చేయడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి రష్యా సైనిక బలగాలు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రస్తుతం ప్రేక్షక పాత్రకు వహిస్తూ ఊపిరి పీల్చుకుంటోంది. రెండు అత్యున్నత స్థాయి వర్గాల మధ్య విభేదాలు సర్వ సాధారణమని, అంతా సెటిల్ అయ్యినట్లు నటించడం లాంటివి ఇక్కడ పనిచేయవని అన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అత్యంత సన్నిహితుడు మిఖాయిలో పోడోల్యాక్. రష్యా తిరుగుబాటు సైన్యం నాయకుడు యెవ్జెని ప్రిగోజిన్ చేస్తోన్న దాడులే అసలైన ఉగ్రవాద వ్యతిరేక చర్యగా ఆయన వర్ణించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇది ఆరంభం మాత్రమేనాని అన్నారు. ఇది కూడా చదవండి: టైటాన్ జలాంతర్గామిలో మేము వెళ్ళాలి.. కానీ అదృష్టవశాత్తూ.. -
పాతిక వేలమంది చావడానికి రెడీ.. మాస్కోలో హైఅలర్ట్
మాస్కో: రష్యాలో తిరుగుబాటు జెండా ఎగిరింది. కిరాయి సైన్యం గ్రూప్ వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ అరెస్ట్‌కు ఆదేశాలు జారీ చేశాయి. క్రెమ్లిన్ ఆయనపై సాయుధ తిరుగుబాటు ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ పరిణామంతో చిర్రెత్తిపోయిన ప్రిగోజిన్.. రష్యా సైన్యంపై ప్రతిదాడికి ఆదేశాలిచ్చాడు. అంతేకాదు రష్యాలో వినాశనం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. మా సైన్యం పాతికవేల మంది. అంతా చావడానికి సిద్ధంగా ఉన్నాం. రష్యా కోసం ఏమైనా చేస్తాం. మేమింకా ముందుకు వెళ్తాం. అడ్డొచ్చిన ప్రతీది నాశనం చేసి ముగిస్తాం అంటూ ప్రిగోజిన్ ఆడియో సందేశం పంపించాడు. అంతేకాదు.. ఇప్పటికే వార్నర్ గ్రూప్ రోస్తోవ్ రీజియన్‌లోకి ప్రవేశించిందంటూ ప్రకటించారాయన. మార్చ్‌గా పలు నగరాల వైపు వెళ్తున్నట్లు తెలిపారు. దీంతో.. మాస్కోతో పాటు పలు ప్రధాన నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఒకప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సన్నిహిత వర్గమైన ఈ వాగ్నర్ ప్రైవేటు సైన్యం గతంలో తమతో కలిసి ఉక్రెయిన్ పై పోరాడటంలో సహకరించింది. కానీ ఇప్పుడు వారితో వైరం రష్యా సైన్యానికి పెను ప్రమాదమే తెచ్చిపెట్టింది. రష్యా మిలిటరీ తన గ్రూపును లక్ష్యంగా చేసుకుని క్షిపణుల దాడకి దిగుతోందని.. ప్రతిఘటన కొనసాగుతుందని యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రకటించాడు. పుతిన్ శత్రువైన మిఖాయిల్ ఖోదోర్ కోవ్స్కీ కూడా యెవనిన్ ప్రిగోజిన్ కు మద్దతుగా నిలవాలని రష్యా ప్రజానీకానికి పిలుపునివ్వడం విశేషం యెవనిన్ ప్రిగోజిన్ నాయకత్వంలోని వాగ్నర్ ప్రైవేటు సైన్యం ఇప్పటికే రస్తొవ్ దక్షిణ మిలటరీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు, అంతర్జాతీయ వ్యవహారాల ప్రధాన కార్యాలయం తోపాటు ఎఫ్.ఎస్.బి డిపార్ట్మెంటును, ఒక పోలీస్ డిపార్ట్మెంటును కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు లోకల్ చానళ్లు ప్రసారం చేస్తున్నప్పటికీ అధికారంగా రష్యా సైన్యం ధ్రువీకరించలేదు. 📢Chronicles of the military coup in the Russian Federation.📢 By today's morning, Prigozhin announced that he had taken control of the city of the regional center - the city of Rostov.#Europe #Russia #RussiaUkraineWar #RussiaIsLosing #Russland pic.twitter.com/dI95o18GPG — Denis Jankauskas (@artsenvacatures) June 24, 2023 రోస్తోవ్లోకి వార్నర్ గ్రూప్ ప్రవేశించిందని ప్రిగోజిన్ ప్రకటించినప్పటికీ.. సైన్యం దానిని ధృవీకరించలేదు. కానీ తిరుగుబాటు సైన్యం రాక గురించిన సమాచారమందగానే రష్యా సైన్యం ప్రజలను అప్రమత్తం చేసిన ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు కదలవద్దని హెచ్చరించింది. మాస్కో నగర మేయర్ సెర్జీ సోబ్యానిన్ మాట్లాడుతూ ఉగ్రవాద వ్యతిరేక చర్యలను తీసుకుని రక్షణ వలయాన్ని పటిష్టం చేయనున్నామని తెలిపారు. లిపెట్స్క్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజలను, స్థానిక భద్రతా దళాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు లిపెట్స్క్ గవర్నర్ ఇగర్ అర్థమొనోవ్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపాయి క్రెమ్లిన్ వర్గాలు. పుతిన్‌కు బాగా క్లోజ్.. ► యెవ్జెనీ ప్రిగోజిన్. 1961 రష్యాలో జన్మించారు. 1990 నుంచి పుతిన్‌తో ఆయన అనుబంధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ యుద్ధం తొలినాళ్లలో ప్రిగోజిన్ రాజకీయ చర్చకు సైతం దారి తీశారు. ► పొలిటికో ప్రకారం.. ప్రిగోజిన్, పుతిన్ ఒకే ఊరివాళ్లు(అప్పుడు లెనిన్గ్రాడ్.. ఇప్పుడు సెయింట్ పీటర్బర్గ్). 18 ఏళ్ల వయసులోనే క్రిమినల్‌గా జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత దొంగతనం కేసులోనూ జైలుపాలయ్యాడు. ఆపై 13 ఏళ్లకు దోపిడీ కేసులో 13 ఏళ్ల జైలు శిక్షపడి.. అందులో 9 ఏళ్లపాటు శిక్ష అనుభవించాడు. ► జైలు నుంచి బయటకు వచ్చాక హాడ్డాగ్స్ అమ్ముతూ జీవనం కొనసాగించాడు. అటుపై సెయింట్ పీటర్‌బర్గ్‌లో ఖరీదైన రెస్టారెంట్లను తెరిచాడు. ► పుతిన్ చెఫ్‌గా ప్రిగోజిన్‌కి ఓ పేరుంది. రెస్టారెంట్ బిజినెస్ కాటరింగ్ ఆర్డర్స్‌తో ప్రభుత్వానికి బాగా దగ్గరయ్యాడు ప్రిగోజిన్. ఆ తర్వాత మీడియా రంగం, ఇంటర్నెట్ రంగంలోకి ప్రవేశించాడతను. ► ఈ ఏడాది జనవరిలో 62 ఏళ్ల ప్రిగోజిన్.. రష్యా సైన్యానికి తోడుగా ప్రైవేట్ సైన్యం వాగ్నర్‌తో ఉక్రెయిన్ యుద్ధంలో భాగం పంచుకుంటూ వస్తున్నాడు. ఉక్రెయిన్‌లోనే కాదు.. ఆఫ్రికా, మధ్య ఆఫ్రికా రిపబ్లిక్, లిబియా, మాలిలోనూ వాగ్నర్ గ్రూప్ దురాగతాలు కొనసాగుతున్నాయని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. ఇదీ చదవండి: నూతన రంగాల్లోనూ కలిసి ముందుకు -
కశ్మీర్లోకి టర్కీ కిరాయి సైనికులు!
న్యూఢిల్లీ: కశ్మీర్లోకి టర్కీ తూర్పు సిరియా నుంచి కిరాయి సైనికులను పంపుతోందని ఏఎన్ఎఫ్ న్యూస్ తెలిపింది. త్వరలో ఇక్కడ నుంచి కశ్మీరుకు చేరాలని సిరియాలోని సులేమన్‌షా బ్రిగేడ్స్ టెర్రరిస్టు ఆర్గనైజేషన్ అబు ఇమ్షా తన అనుచరులకు సూచించారని స్థానిక వర్గాలు వెల్లడించినట్లు తెలిపింది. త్వరలో కశ్మీర్‌కు వెళ్లే వారి జాబితాను టర్కీ అధికారులు ఇతర టెర్రరిస్టు కమాండర్లను అడిగి తయారు చేస్తారని అబు ఇమ్షా చెప్పాడు. ఈ జాబితాలో పేరు నమోదు చేయించుకున్నవారికి 2 వేల డాలర్లు ముడతాయని వివరించాడు. ఇదంతా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పన్నాగమని గ్రీకు జర్నలిస్టు అండ్రియాస్ మౌంట్‌జొరాలియస్ ఒక నివేదికలో వెల్లడించారు. ఇస్లాం ప్రపంచంలో సౌదీ డామినేషన్‌ను సవాలు చేసేందుకు ఎర్డోగాన్ యత్నిస్తున్నారని, ఆగ్నేయాసియాలో ముస్లింలపై పట్టు సాధించేందుకు కశ్మీర్ విషయంలో పాక్‌కు మద్దతు పలుకుతున్నారని ఆండ్రియాస్ చెప్పారు. అయితే భారత్‌లో టర్కీ రాయబారి ఈ వార్తలను నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి తొలగించిన సందర్భంలో టర్కీ పాకిస్తాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. అలాగే పలుమార్లు పాక్‌కు అంతర్జాతీయ వేదికలపై కూడా టర్కీ మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో కశ్మీర్ అంశంలో టర్కీ తలదూరుస్తుందన్న వార్తలపై రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బావను చంపించి, ఫేసుబుక్ లో షేర్ చేసిన బావమరిది
హైదరాబాద్: బావమరిది బావ బతుకు కోరుతాడంటారు. కానీ ఇక్కడ బావను మట్టుపెట్టాడో బావమరిది. కిరాయి హంతకులతో బేరం కుదుర్చుకుని బావను చంపించి ఆపై ఆ విషయాన్ని ఫేసుబుక్ లోకి కూడా షేర్ చేశాడు. చంద్రశేఖర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణహత్యకు గురయ్యాడు. బల్కంపేటలో మూడు రోజుల క్రితం కిడ్నాప్ అయిన చంద్రశేఖర్ చివరికి శవమై కనిపించాడు. అతన్ని కిడ్నాప్ చేసింది బావమరిది అనిల్ అని పోలీసులు తెలిపారు. దుండగులతో సుపారీ (కిరాయి) కుదుర్చుకున్న అనిల్ బావను కిడ్నాప్ చేయించాడు. కిడ్నాప్ కు గురైన చంద్రశేఖర్ ను రంగారెడ్డి జిల్లా తాండూరు సమీపంలో దుండగులు దారుణంగా చంపి రోడ్డుపై పడివేసి వెళ్లారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలను ఫేస్బుక్ ద్వారా అనిల్ తన చెల్లికి పంపినట్టు పోలీసులు తెలిపారు. ప్రసుత్తం కిరాయి హంతకులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.