క్యీవ్: రష్యాపై వాగ్నర్ గ్రూపు కిరాయి సైన్యంతో విరుచుకుపడుతోన్న సంఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సన్నిహితుడు మిఖాయిలో పోడోల్యాక్ స్పందిస్తూ "ఇది ఆరంభం మాత్రమే"నని తెలిపారు.
రష్యా తిరుగుబాటు సైన్యం రొస్తొవ్ మిలటరీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించినట్లు ఒక ఆడియో టేపు ద్వారా వాగ్నర్ సంస్థ అధినేత యెవ్జెని ప్రిగోజిన్ తెలిపారు. ఊహించని విపత్తు ఎదురవడంతో రష్యాకు ఇప్పుడు ఊపిరాడటం లేదు. ఒకప్పుడు తమతో కలిసి ఉన్న వాగ్నర్ సంస్థ ఇప్పుడు తిరుగుబాటు చేయడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి రష్యా సైనిక బలగాలు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రస్తుతం ప్రేక్షక పాత్రకు వహిస్తూ ఊపిరి పీల్చుకుంటోంది.
రెండు అత్యున్నత స్థాయి వర్గాల మధ్య విభేదాలు సర్వ సాధారణమని, అంతా సెటిల్ అయ్యినట్లు నటించడం లాంటివి ఇక్కడ పనిచేయవని అన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అత్యంత సన్నిహితుడు మిఖాయిలో పోడోల్యాక్. రష్యా తిరుగుబాటు సైన్యం నాయకుడు యెవ్జెని ప్రిగోజిన్ చేస్తోన్న దాడులే అసలైన ఉగ్రవాద వ్యతిరేక చర్యగా ఆయన వర్ణించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇది ఆరంభం మాత్రమేనాని అన్నారు.
ఇది కూడా చదవండి: టైటాన్ జలాంతర్గామిలో మేము వెళ్ళాలి.. కానీ అదృష్టవశాత్తూ..
Comments
Please login to add a commentAdd a comment