లండన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై.. దాదాపు మూడేళ్లు గడుస్తోంది. అయితే.. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత దారుణమైన ప్రతిఘటనను అక్టోబర్ నెలలో రష్యా బలగాలు ఎదుర్కొన్నాయని బ్రిటన్ సాయుధ దళాల అధిపతి అన్నారు. అక్టోబర్‌లో రోజుకు సగటున 1,500 మంది రష్యన్ సైనికులు మరణించటం లేదా గాయపడటం జరిగిందని బిట్రన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ టోనీ రాడాకిన్ తెలిపారు.
‘‘రష్యా తన యుద్ధంలో మరణించిన వారి సంఖ్యను వెల్లడించలేదు. అయితే ఫిబ్రవరి 2022లో రష్యా.. ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించినప్పటి నుండి గత నెలలో అత్యధికంగా సైనికులను కోల్పోయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశయం కారణంగా సమామరు 7 లక్షమ మంది మరణించటం లేదా గాయపడటం జరిగింది. పుతిన్ ఆశయం కోసం రష్యా ఈ భారీ నష్టం, నొప్పి, బాధ భరించవల్సి వచ్చింది. చాలా తక్కువ భూభాగం కోసం అధిక సైన్యం నష్టపోయింది. రష్యా ప్రభుత్వం.. రక్షణ, భద్రతపై ప్రజా వ్యయంలో 40 శాతానికి పైగా ఖర్చు చేస్తోంది. అధ్యక్షుడు పుతిన్ దేశంపై అధిక భారం వేశారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్ మద్దతు ఇస్తునే ఉంటుంది. అది అధ్యక్షుడు పుతిన్ గ్రహించవలసిన సందేశం. ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి భరోసా’’ అని అన్నారు.
రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాటంలో ఉక్రెయిన్ బలమైన మద్దతుదారులలో బ్రిటన్ ఒకటి. ఉక్రెయిన్‌కు బిలియన్లకొద్ది పౌండ్లతో సైనిక సహాయంతో పాటు ఆయుధాలు, బలగాలకు శిక్షణను అందిస్తోంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి పాశ్చాత్య దేశాల భవిష్యత్తు నిబద్ధత గురించి ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ ఉక్రెయిన్‌కు మద్దతును మరోసారి ప్రకటించటం గమనార్హం.
చదవండి: కెనడాలో టెంపుల్‌పై దాడి.. ఖలిస్తానీ నిరసన నిర్వాహకుడు అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment