Russian troops
-
రష్యాకు ‘అక్టోబర్’ షాక్.. రోజుకు 1500 మంది సైనికుల మృతి!
లండన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై.. దాదాపు మూడేళ్లు గడుస్తోంది. అయితే.. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత దారుణమైన ప్రతిఘటనను అక్టోబర్ నెలలో రష్యా బలగాలు ఎదుర్కొన్నాయని బ్రిటన్ సాయుధ దళాల అధిపతి అన్నారు. అక్టోబర్‌లో రోజుకు సగటున 1,500 మంది రష్యన్ సైనికులు మరణించటం లేదా గాయపడటం జరిగిందని బిట్రన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ టోనీ రాడాకిన్ తెలిపారు.‘‘రష్యా తన యుద్ధంలో మరణించిన వారి సంఖ్యను వెల్లడించలేదు. అయితే ఫిబ్రవరి 2022లో రష్యా.. ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించినప్పటి నుండి గత నెలలో అత్యధికంగా సైనికులను కోల్పోయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశయం కారణంగా సమామరు 7 లక్షమ మంది మరణించటం లేదా గాయపడటం జరిగింది. పుతిన్ ఆశయం కోసం రష్యా ఈ భారీ నష్టం, నొప్పి, బాధ భరించవల్సి వచ్చింది. చాలా తక్కువ భూభాగం కోసం అధిక సైన్యం నష్టపోయింది. రష్యా ప్రభుత్వం.. రక్షణ, భద్రతపై ప్రజా వ్యయంలో 40 శాతానికి పైగా ఖర్చు చేస్తోంది. అధ్యక్షుడు పుతిన్ దేశంపై అధిక భారం వేశారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్ మద్దతు ఇస్తునే ఉంటుంది. అది అధ్యక్షుడు పుతిన్ గ్రహించవలసిన సందేశం. ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి భరోసా’’ అని అన్నారు.రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాటంలో ఉక్రెయిన్ బలమైన మద్దతుదారులలో బ్రిటన్ ఒకటి. ఉక్రెయిన్‌కు బిలియన్లకొద్ది పౌండ్లతో సైనిక సహాయంతో పాటు ఆయుధాలు, బలగాలకు శిక్షణను అందిస్తోంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి పాశ్చాత్య దేశాల భవిష్యత్తు నిబద్ధత గురించి ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ ఉక్రెయిన్‌కు మద్దతును మరోసారి ప్రకటించటం గమనార్హం.చదవండి: కెనడాలో టెంపుల్‌పై దాడి.. ఖలిస్తానీ నిరసన నిర్వాహకుడు అరెస్ట్ -
కొనసాగుతున్న భీకర పోరు
కీవ్: ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఖేర్సన్ దక్షిణ ప్రాంతం, జపోరిజియా పరిధిలో రష్యా సేనలు స్వీయ రక్షణలో పడ్డాయని ఉక్రెయిన్ సైన్యం శనివారం ప్రకటించింది. ఇరాన్ తయారీ షాహీద్ డ్రోన్లు, క్షిపణులు, శతఘ్ని, మోర్టార్ దాడులు పెరిగాయని ఉక్రెయిన్ తెలిపింది. పలు చోట్ల జరిగిన దాడుల్లో శనివారం నలుగురు మరణించారని వెల్లడించింది. ఒడెసాలోని నౌకాశ్రయం వద్ద జరిగిన దాడిలో ముగ్గురు మరణించారు. 24 మంది గాయపడ్డారు. 20కిపైగా షాహీద్ డ్రోన్లు, ఎనిమిది క్షిపణులను కూల్చేశామని ఉక్రెయిన్ తెలిపింది. మరోవైపు యూరప్‌లోనే అతిపెద్ద అణువిద్యుత్కేంద్రం జపోరిజియా న్యూక్లియర్పవర్ ప్లాంట్‌లో చివరి రియాక్టర్‌ను అధికారులు షట్‌డౌన్ చేశారు. ప్లాంట్ సమీపంలో బాంబుదాడుల బెడద ఎక్కువవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉక్రెయిన్ అణుఇంథన సంస్థ ఎనర్జియాటమ్ తెలిపింది. కేంద్రక విచ్ఛిత్తి చర్య, అత్యధిక ఉష్ణోద్భవం, పీడనాలను ఆపేందుకు ఆరింటిలో చిట్టచివరిదైన ఐదో రియాక్టర్లో కూలింగ్ రాడ్లను కోర్లోకి దింపేశామని తెలిపింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఉక్రెయిన్ ఇంధన వ్యవస్థకు సరఫరా చేసే విద్యుత్ లైన్లు దాడుల కారణంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్లాంట్ నుంచి బయటకు విద్యుత్ సరఫరా అసాధ్యం. రియాక్టర్ షట్డౌన్కు ఇదీ ఒక కారణమేనని ఎనర్జియాటమ్ వివరించింది. ఈ ప్రాంతాన్ని ఆక్రమించాక ప్లాంట్ నిర్వహణ బాధ్యత రష్యా చేతికొచ్చింది. మరోవైపు కఖోవ్కా డ్యామ్ పేల్చివేతతో వరదమయమైన ఖేర్సన్లో ఇంకా నీరు 4.5 మీటర్ల ఎత్తులో నిలిచే ఉంది. ఈ వారంలో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ముంపు ప్రజలకు సహాయక చర్యలకు విఘాతం కలగొచ్చని ఆ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ ప్రొకుడిన్ హెచ్చరించారు. దాదాపు 7 లక్షల మంది తాగునీటి కోసం అల్లాడుతున్నారని ఐక్యరాజ్యసమితి సహాయక విభాగం అధిపతి మార్టిన్ ఆందోళన వ్యక్తంచేశారు. -
Russia Ukraine War: పులిని చూసిన మేకల్లా పారిపోయారు!
కీవ్: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేపట్టిన రష్యాకు కీవ్ సైన్యం ప్రతిఘటన ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. దీంతో ఆక్రమించుకున్న కీలక నగరాలను విడిచి వెనక్కి వెళ్తున్నాయి రష్యా సేనలు. ఇటీవలే ఖేర్సన్ నగరాన్ని తమ బలగాలు ఖాళీ చేసినట్లు రష్యా ప్రకటించింది. మాస్కో బలగాలు తిరిగి వెళ్లిపోయిన క్రమంలో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేసిన ఓ పౌరుడు.. రష్యా సేనలు పులిని చూసిన మేకల వలే పారిపోయాయని ఓ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ‘పుతిన్ మమ్మల్ని చంపాలనుకున్నాడు. కానీ తన సొంత దేశాన్ని నాశనం చేసుకున్నాడు. ఖేర్సన్ నుంచి తిరిగి వెళ్లిపోవటం రష్యాకు ఘోర పరాభవం.’ అని పేర్కొన్నాడు ఖేర్సన్ పౌరుడు. మరోవైపు.. రష్యా బలగాలు వెళ్లిపోయిన క్రమంలో స్థానికులు బ్లూ అండ్ ఎల్లో ఫ్లాగ్స్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ సంబరాలు చేసుకున్నారు. ఖేర్సన్కు స్వతంత్రం వచ్చిందంటూ నినాదాలు చేశారు. గత శనివారం పోలీసు, టీవీ, రేడియో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. స్థానిక పరిపాలన భవనం వద్ద డ్యాన్సులు చేస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఉక్రెయిన్ సాయుధ బలగాలకు చెందిన జెడ్-ఎస్-యూ అనే అక్షరాలను పలుకుతూ హోరెత్తించారు. మరోవైపు.. రష్యా బలగాలు తిరిగి వెళ్లిపోయినప్పుటికీ నగరాన్ని పునరుద్ధరించటంలో చాలా సవాళ్లు ఎదురుకానున్నాయి. రష్యాతో యుద్ధంలో ఖేర్సన్ నగరం భారీగా దెబ్బతిన్నది. నీరు, విద్యుత్తు, ఔషధాలు, ఆహారం వంటి వాటి కొరత తీవ్రంగా ఉంది. రష్యా బలగాలు వెళ్తూ వెళ్తూ కీలక మౌలిక సదుపాయాలైన సమాచార, నీటి సరఫరా, విద్యుత్తు వంటి వాటిని ధ్వంసం చేసి వెళ్లినట్లు అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఇదీ చదవండి: మోదీ ప్రారంభించిన 15 రోజుల్లోనే భారీ పేలుడు.. తప్పిన పెను ప్రమాదం! -
రష్యాను చావుదెబ్బ కొట్టేందుకు ఉక్రెయిన్‌కు గోల్డెన్ ఛాన్స్!
కీవ్: రష్యాను చావుదెబ్బకొట్టి యుద్ధంలో పైచేయి సాధించేందుకు ఉక్రెయిన్‌కు కొద్ది రోజుల్లో సువర్ణావకాశం రాబోతుందని బ్రిటన్ స్పై చీఫ్ రిచర్డ్ మూరే అంచనా వేశారు. రష్యాకు బలగాల కొరత ఏర్పడిందని, కొద్ది రోజుల్లో వారికి మెటీరియల్ సరఫరా చేయడానికి కూడా ఎవరూ అందుబాటులో ఉండే పరిస్థితి లేదని చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయలో రష్యా సేనలు యుద్ధాన్ని కొద్దిరోజుల పాటు ఆపాల్సి వస్తుందని మూరే పేర్కొన్నారు. ఆ అవకాశాన్ని కీవ్ సద్వినియోగం చేసుకుని రష్యాను కోలుకోలేని దెబ్బ కొట్టవచ్చని అభిప్రాయపడ్డారు. కొలరడోలో అస్పెన్ సెక్యూరిటీ ఫోరంలో మాట్లాడుతూ మూరే ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా 15,000 బలగాలను కోల్పోయిందని మూరే చెప్పారు. ఇది తమ అంచనా మాత్రమే అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదటపెట్టి ఐదు నెలలు కావస్తోంది. రష్యా సేనలను నిలువరించేందుకు కీవ్‌కు అమెరికా సహా అగ్రదేశాలు భారీ ఆయుధ, ఆర్థిక సాయం అందించాయి. దీంతో అమెరికా హిమార్స్ దీర్ఘ శ్రేణి క్షిపణనులను ఉక్రెయిన్ సేనలు ఇటీవలే మోహరించాయి. అదను చూసి వాటిని ఉపయోగిస్తే యుద్ధంలో విజయం సాధించవచ్చని కీవ్ ప్రపంచానికి నిరూపించవచ్చని మూరే అభిప్రాయడ్డారు. ఉక్రెయిన్ సేనలు మరింత తెగువను చూపితే రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని తిరిగిపొందవచ్చన్నారు. చదవండి: రోబోటిక్ డాగ్ ... సైనికుడిలా కాల్పులు జరుపుతోంది -
Russia-Ukraine war: శరణమో, మరణమో
కీవ్/మాస్కో: తూర్పు ఉక్రెయిన్‌లోని సెవెరోడొనెట్స్క్ నగరంలో మారియూపోల్ దృశ్యమే పునరావృతం అవుతోంది. నగరంపై రష్యా సేనలు పట్టు బిగించాయి. 800 మందికిపైగా పౌరులు ఓ కెమికల్ ప్లాంట్‌లో తలదాచుకుంటున్నారు. వారికి, నగరంలోని వారికి లొంగిపోవడం లేదా మరణించడం ఏదో ఒక్క అవకాశమే మిగిలి ఉందని సమాచారం. డోన్బాస్లో భారీ సంఖ్యలో ఉక్రెయిన్ ఆయుధాలను, సైనిక సామగ్రిని ధ్వంసం చేశామని రష్యా సోమవారం తెలియజేసింది. వుహ్లెదర్ థర్మల్ పవర్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ వైమానిక దాడులు జరిపినట్లు సమాచారం. 40,000 మంది రష్యా జవాన్లు బలి! జూన్ ఆఖరు నాటికి రష్యా సైన్యం 40,000 మంది జవాన్లను కోల్పోనుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. డోన్బాస్లోకి రిజర్వు బలగాలను దించేందుకు రష్యా ప్రయత్నిస్తోందన్నారు. యుద్ధం మరో రెండేళ్లపాటు కొనసాగుతుందని రష్యా మాజీ ప్రధాని కాస్యనోవ్ అంచనా వేశారు. 20 మంది మహిళలపై వేధింపులు: అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారన్న ఆనుమానంతో రష్యా పోలీసులు 20 మంది మహిళలను అదుపులోకి తీసుకొని, అమానవీయంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ రష్యాలోని నిజ్నీ నొవోగొరోడ్లో ఈ దారుణం జరిగిందని బాధితుల తరపు న్యాయవాది చెప్పారు. రష్యా పోలీసులు 18 నుంచి 27 ఏళ్ల వయసున్న 20 మంది మహిళలను వివస్త్రలను చేసి, ఐదుసార్లు స్క్వాట్స్ చేయించారని తెలిపారు. అంతేకాకుండా ఈ దారుణాన్ని ఫోన్లలో వీడియో తీశారని పేర్కొన్నారు. -
Russia-Ukraine war: ఖర్కీవ్ నుంచి రష్యా సేనలు ఔట్!
కీవ్/హెల్సింకీ: ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్ నుంచి రష్యా బలగాలు వెనక్కు మళ్లుతున్నాయి. ఉక్రెయిన్ ప్రతిఘటనను తట్టుకోలేకే రష్యా వెనుకడుగు వేస్తున్నట్లు ఇంగ్లండ్ పేర్కొంది. ఖర్కీవ్‌లో ఉక్రెయిన్‌దే పై చేయి అని చెప్పింది. తూర్పు ప్రాంతంలో రష్యా ఆధీనంలో ఉన్న ఆరు పట్టణాలను, గ్రామాలను తమ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. యుద్ధ ఫలితం యూరప్, మిత్రదేశాల మద్దతుపై ఆధారపడి ఉంటుందన్నారు. అమెరికా రిపబ్లికన్ నేత మిచ్ మెక్కానెల్ నేతృత్వంలో సెనేట్ సభ్యులు ఆయనతో భేటీ అయ్యారు. పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్లో హోరాహోరీ పోరు జరుగుతోంది. ‘నాటో’కు దరఖాస్తు చేస్తాం: ఫిన్లండ్ నాటోలో చేరేందుకు దరఖాస్తు చేయాలని నిర్ణయించినట్టు ఫిన్లండ్ అధ్యక్షుడు సౌలీ నీనిస్టో స్పష్టం చేశారు. శనివారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్లో ఈ విషయం చెప్పారు. స్వీడన్ కూడా నాటోలో చేరాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. పుతిన్‌కు ఆగస్టులో పదవీ గండం!: పుతిన్‌ను గద్దె దించడానికి రష్యాలో ఇప్పటికే ప్రయత్నాలు మొదలైనట్టు ఉక్రెయిన్ నిఘా విభాగం చీఫ్ మేజర్ జనరల్ కైరిలో బడానోవ్ చెప్పారు. ఆయనపై తిరుగుబాటు జరుగనుందన్నారు. యుద్ధంలో ఈ ఏడాది ఆఖరుకల్లా రష్యా ఓడిపోతుందన్నారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పుతిన్ తీవ్రమైన అనారోగ్యం పాలైనట్టు రష్యా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆయన పార్కిన్సన్తోనూ బాధపడుతున్నట్లు వార్తలొచ్చాయి. -
ఉక్రెయిన్ తిప్పికొడుతోంది
కీవ్: ఉక్రెయిన్‌పై నెలకు పైగా సాగిస్తున్న యుద్ధంలో రష్యా సేనలు క్రమంగా వెనకడుగు వేస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. రష్యా సైన్యం ఆక్రమించిన చాలా పట్టణాలు, గ్రామాలను ఉక్రెయిన్ దళాలు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాయి. కీవ్, చెర్నిహివ్ ప్రాంతాల్లో, ఇతర చోట్ల కనీసం 30కి పైగా సెటిల్మెంట్లను ఇప్పటికే విముక్తం చేసినట్టు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. కీవ్, పరిసర ప్రాంతాల నుంచి రష్యా దళాలు భారీ స్థాయిలో వెనక్కు వెళ్లడం శనివారం కూడా కొనసాగింది. 700కు పైగా సాయుధ వాహనాలు కీవ్ నుంచి బెలారస్ దిశగా వెనుదిరుగుతూ కన్పించాయి. అయితే అవి వెనక్కు వెళ్లడం లేదని, తూర్పున డోన్బాస్‌పై భారీ దాడి కోసమే బయల్దేరుతున్నాయని ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయి. పైగా రష్యా దళాలు వెనక్కు వెళ్తూ వీలైన చోటల్లా మందుపాతరలు అమర్చాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్‌కు మరో 30 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను అందజేయనున్నట్టు అమెరికా ప్రకటించింది. వీటిలో లేజర్ గైడెడ్రాకెట్ సిస్టమ్స్, మానవరహిత విమానాలు, నైట్ విజన్ పరికరాలు, సాయుధ వాహనాలు తదితరాలుంటాయని పేర్కొంది. మరోవైపు శుక్రవారం రష్యా, ఉక్రెయిన్ బృందాల మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్ చర్చలు ఏ మేరకు పురోగతి సాధించిందీ తెలియరాలేదు. కానీ ఉక్రెయిన్ తమ దేశంపై దాడులు చేస్తోందన్న వార్తలు చర్చలకు ఆటంకం కలిగిస్తాయని పుతిన్ అధికార ప్రతినిధి ద్మత్రీ పెస్కోవ్ అన్నారు. కీవ్‌ను సందర్శించాలని ఆలోచిస్తున్నట్టు పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. ఇక మారియుపోల్ సహా పలు నగరాల్లో రష్యా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. యువకులను ఏడాది పాటు సైనిక విధుల్లోకి తీసుకునే వార్షిక కార్యక్రమానికి రష్యా శుక్రవారం శ్రీకారం చుట్టింది. లక్షన్నర మందిని రిక్రూట్ చేసుకోవాలన్నది లక్ష్యమని చెప్తున్నారు. రష్యాకు ఆయుధాల కొరత రష్యా వద్ద పలు కీలక ఆయుధాలు దాదాపుగా నిండుకున్నాయని ఇంగ్లండ్ రక్షణ వర్గాలు చెబుతున్నాయి. వాటిని ఇప్పుడప్పుడే భర్తీ చేసుకునే అవకాశాలు కూడా లేవంటున్నాయి. హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు, క్రూయిజ్ మిసైళ్ల కొరత రష్యాను తీవ్రంగా వేధిస్తున్నట్టు చెప్పాయి. పలు కీలక విడి భాగాలను ఉక్రెయిన్ నుంచే రష్యా దిగుమతి చేసుకుంటోందని సమాచారం. 2014 క్రిమియా యుద్ధానంతరం రష్యాకు ఆయుధాల ఎగుమతిని ఉక్రెయిన్ బాగా తగ్గించింది. యుద్ధ నేపథ్యంలో నెలకు పైగా అవి పూర్తిగా ఆగిపోయాయి. ఇంగ్లండ్ స్టార్‌స్ట్రీక్ మిసైల్‌తో రష్యా హెలికాప్టర్ కూల్చివేత ఇంగ్లండ్‌లో తయారైన స్టార్‌స్ట్రీక్ మిసైల్ సాయంతో రష్యా ఎంఐ–28ఎన్ హెలికాప్టర్‌ను లుహాన్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ కూల్చేసింది. మిసైల్ ఢీకొట్టడంతో హెలికాప్టర్ రెండు ముక్కలై నేలకూలిన వీడియో వైరల్‌గా మారింది. ధ్వని కంటే మూడు రెట్ల వేగంతో దూసుకెళ్లే ఈ లేజర్ గైడెడ్ మిసైల్ సిస్టమ్ తక్కువ ఎత్తులో వెళ్లే హెలికాప్టర్లను 100 శాతం కచ్చితత్వంతో నేలకూలుస్తుంది. పైగా ఇది చాలా తేలిగ్గా ఉంటుంది గనుక ఎక్కడికైనా సులువుగా మోసుకెళ్లవచ్చు. భుజం మీది నుంచి కూడా ప్రయోగించవచ్చు. స్టార్‌స్ట్రీక్ ప్రయోగంపై రష్యా మండిపడింది. ఇకపై ఇంగ్లండ్ ఆయుధ సరఫరాల నౌకలు, వాహనాలను లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతామని హెచ్చరించింది. -
Russia-Ukraine War: చెర్నోబిల్‌ను వీడిన రష్యా ఆర్మీ
ప్రమాదకరంగా మారిన చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ నుంచి రష్యా సేనలు వైదొలిగాయని ఉక్రెయిన్ ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఎనెర్గోఆటం తెలిపింది. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24వ తేదీ నుంచి యుద్ధం ప్రారంభించిన రష్యా సేనలు చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకోవడంతో ప్రపంచ నేతలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 1986 నుంచి మూసివేసి ఉన్న ఈ ప్లాంట్ వెలుపల తవ్విన గుంతల నుంచి ప్రమాదకర స్థాయిలో అణుధార్మికత వెలువడటంతో ఆ ప్రాంతం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా సేనలు తెలిపాయని ఎనెర్గోఆటం పేర్కొంది. చెర్నోబిల్‌కు సంబంధించి తాజాగా తమకు ఎటువంటి సమాచారం అందలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తెలిపింది. త్వరలోనే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తామని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోస్సి తెలిపారు. మారియుపోల్ నగరంపై రష్యా దాడులు తీవ్రతరమయ్యాయి. నగరంలో చిక్కుకుపోయిన పౌరులను తీసుకు వచ్చేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం పంపించిన 45 బస్సుల కాన్వాయ్‌ను రష్యా ఆర్మీ అడ్డుకుంది. మారియుపోల్‌లో పౌరుల కోసం 14 టన్నుల ఆహారం, మందులతో వెళ్లిన వాహనాలను కూడా రష్యా సైన్యం అడ్డుకున్నట్లు సమాచారం. బెల్గోరాడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ హెలికాప్టర్ గన్‌షిప్పులు దాడి చేయడంతో చమురు డిపో మంటల్లో చిక్కుకుందని ఆ ప్రాంత గవర్నర్ ఆరోపించారు. ఉక్రెయిన్–రష్యా చర్చలు పునఃప్రారంభం ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి చర్చలు వీడియో లింక్ ద్వారా శుక్రవారం పునఃప్రారంభమయ్యా యి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కార్యాలయం సైతం ధ్రువీకరించింది. ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చివరిసారిగా మూడు రోజుల క్రితం టర్కీలో చర్చలు జరిగాయి. డోన్బాస్, క్రిమియాపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చర్చల్లో రష్యా ప్రతినిధి మెడిన్స్కీ చెప్పారు. -
పాకిస్థాన్‌లో రష్యా దళాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్, రష్యాల బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరుదేశాలు సంయుక్తంగా 'ఫ్రెండ్ షిప్ 2016' పేరుతో సంయుక్త డ్రిల్‌ను నిర్వహించనున్నాయి. ఇందుకోసం రష్యా దళాలు శుక్రవారం పాకిస్థాన్ చేరుకున్నాయి. రేపటి నుంచి ఈ డ్రిల్ ప్రారంభం కానుంది. ఇందులో ఇరుదేశాల నుంచి 200 మంది సైనికులు పాల్గొంటారని, పాక్ తో సైనిక విన్యాసం కొనసాగించడం ఇది మొదటి సారని రష్యా మిలిటరీ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. రెండు వారాలపాటు ఈ విన్యాసాలు కొనసాగనున్నాయి.గత పదిహేనేళ్లలో పాకిస్థాన్ ఆర్మీ అధికారులు రష్యాలో పర్యటించి ఎమ్ఐ35 యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఎస్యు ఫైటర్ జెట్ లను కొనుగోలు చేసేందుకు కూడా పాక్ ప్రయత్నం చేస్తోందని అక్కడి మీడియా వెల్లడించింది. -
క్రిమియాపై రష్యా ఆధిపత్యం
ఉక్రెయిన్‌లో కెర్చ్ ఓడరేవు స్వాధీనం కవ్వింపు చర్యలు ఆపాలి: అమెరికా కీవ్ (ఉక్రెయిన్)/వాషింగ్టన్: అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్నా ఉక్రెయిన్ విషయంలో రష్యా వెనక్కి తగ్గడంలేదు. ఉక్రెయిన్‌లోకి తన బలగాలను వేగంగా దింపుతోంది. రష్యా అభిమానులు ఉండే ఆ దేశ తూర్పు ప్రాంతం క్రిమియాను పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకుంది. దీనిపై ఉక్రెయిన్ సోమవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా దండయాత్రకు దిగడంతో తాము వినాశనపు అంచున ఉన్నామన్నామంటూ ఉక్రెయిన్ ప్రధాని అర్సెని యాట్సెన్యుక్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తమ చర్యల్ని రష్యా సమర్థించుకుంది. ఉక్రెయిన్‌లో పరిస్థితులు చక్కబడేవరకూ క్రిమియాలో అదనపు బలగాల అవసరం ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీలావ్రోవ్ చెప్పారు. బాయ్‌కాట్ చేస్తామని, ఆంక్షలు విధిస్తామని పాశ్చాత్య దేశాలు హెచ్చరించడాన్ని ఆయన ఆక్షేపించారు. పదవీచ్యుతుడైన ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ ఇప్పటికీ న్యాయబద్ధమైన అధ్యక్షుడని రష్యా ప్రధాని దిమిత్రి మెద్వదెవ్ పేర్కొన్నారు. మరోపక్క తమ దేశానికి 20 కిలోమీటర్ల చేరువలో ఉండే ఉక్రెయిన్ ఓడరేవు పట్టణం కెర్చ్ను రష్యా అనుకూల దళాలు అధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పటికే క్రిమియాపై పట్టుసాధించిన రష్యా.. కెర్చ్ రేపు ద్వారా మరిన్ని బలగాలను ఉక్రెయిన్‌కు పంపే అవకాశం ఉందంటూ ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ చొరబాట్లను నిరోధించి రష్యా దళాలను వెనక్కి పంపే వ్యూహాలు ఆ దేశాలు రచిస్తున్నాయి. ఉద్రిక్తతలను పెంచే చర్యలు ఆపాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ను కోరారు. కాగా, క్రిమియాలో రష్యాకు అనుకూలంగా వ్యవహరించే గవర్నర్లను తొలగించే పనిని ఉక్రెయిన్ చేపట్టింది. అంతేగాక నేవీ చీఫ్‌ను కూడా తొలగించింది. కాగా, తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా దళాలు మోహరించిన ప్రభావం అంతర్జాతీయ ఆయిల్ రేట్లపై పడే అవకాశం కనిపిస్తోంది. మాస్కో స్టాక్ ఎక్చేంజి 13 శాతం నష్టపోయింది. డాలర్‌తో రూబుల్ మారక విలువ తగ్గింది. ఆసియా, యూరప్ మార్కెట్లు ఒడిదుడులకు లోనయ్యాయి.