కీవ్: రష్యాను చావుదెబ్బకొట్టి యుద్ధంలో పైచేయి సాధించేందుకు ఉక్రెయిన్‌కు కొద్ది రోజుల్లో సువర్ణావకాశం రాబోతుందని బ్రిటన్ స్పై చీఫ్ రిచర్డ్ మూరే అంచనా వేశారు. రష్యాకు బలగాల కొరత ఏర్పడిందని, కొద్ది రోజుల్లో వారికి మెటీరియల్ సరఫరా చేయడానికి కూడా ఎవరూ అందుబాటులో ఉండే పరిస్థితి లేదని చెప్పారు.
ఇలాంటి క్లిష్ట సమయలో రష్యా సేనలు యుద్ధాన్ని కొద్దిరోజుల పాటు ఆపాల్సి వస్తుందని మూరే పేర్కొన్నారు. ఆ అవకాశాన్ని కీవ్ సద్వినియోగం చేసుకుని రష్యాను కోలుకోలేని దెబ్బ కొట్టవచ్చని అభిప్రాయపడ్డారు. కొలరడోలో అస్పెన్ సెక్యూరిటీ ఫోరంలో మాట్లాడుతూ మూరే ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా 15,000 బలగాలను కోల్పోయిందని మూరే చెప్పారు. ఇది తమ అంచనా మాత్రమే అని పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదటపెట్టి ఐదు నెలలు కావస్తోంది. రష్యా సేనలను నిలువరించేందుకు కీవ్‌కు అమెరికా సహా అగ్రదేశాలు భారీ ఆయుధ, ఆర్థిక సాయం అందించాయి. దీంతో అమెరికా హిమార్స్ దీర్ఘ శ్రేణి క్షిపణనులను ఉక్రెయిన్ సేనలు ఇటీవలే మోహరించాయి. అదను చూసి వాటిని ఉపయోగిస్తే యుద్ధంలో విజయం సాధించవచ్చని కీవ్ ప్రపంచానికి నిరూపించవచ్చని మూరే అభిప్రాయడ్డారు. ఉక్రెయిన్ సేనలు మరింత తెగువను చూపితే రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని తిరిగిపొందవచ్చన్నారు.
చదవండి: రోబోటిక్ డాగ్ ... సైనికుడిలా కాల్పులు జరుపుతోంది
Comments
Please login to add a commentAdd a comment