G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్‌లో గొప్పేముంది?  | G20 Summit Updates: Ukraine Says G20 Summit Declaration Nothing To Be Proud Of - Sakshi
Sakshi News home page

G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్‌లో గొప్పేముంది? 

Published Sat, Sep 9 2023 8:17 PM | Last Updated on Sat, Sep 9 2023 8:22 PM

Ukraine Says G20 Joint Declaration On War Nothing To Be Proud Of - Sakshi

క్యివ్: భారత దేశం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని ప్రకటించిన ఢిల్లీ డిక్లరేషన్‌కు సభ్యదేశాలు ఆమోదం తెలిపాయి. ఇందులో ప్రస్తావించిన ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశాన్ని కూడా జీ20 దేశాలు ఆమోదించాయి. కానీ ఢిల్లీ డిక్లరేషన్‌లో ఉక్రెయిన్ యుద్ధం అంశంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ.

ఉక్రెయిన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒలెగ్ నికోలెంకో తన ఎక్స్(ట్విట్టర్) ద్వారా డిక్లరేషన్‌పై స్పందిస్తూ భారత్ ప్రతిపాదించిన ఢిల్లీ డిక్లరేషన్‌లో ఎక్కడా రష్యా పేరును ప్రస్తావించకుండా డాక్యుమెంటేషన్ చేసి ఆమోదం పొందడంలో గొప్పేముందని ప్రశ్నించారు. పదాల అమరిక విషయంలో నేర్పును కనబరచి సమావేశాల్లో మా ప్రస్తావన తీసుకొచ్చినందుకు జీ20 భాగస్వామ్య దేశాలకు కృతజ్ఞతలు చెబుతూ మాకు కూడా సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించి ఉంటే ఇక్కడి పరిస్థితులను కళ్ళకు కట్టేవాళ్లమని అన్నారు. ఢిల్లీ డిక్లరేషన్‌లో పదాలను ఈ విధంగా వాడి ఉంటే మరింత అర్ధవంతంగానూ వాస్తవానికి దగ్గరగానూ ఉండేదని చెబుతూ డిక్లరేషన్‌ను సవరించి మరీ చూపించారు.

ఇది కూడా చదవండి: G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించిన భారత్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement