
కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటూ ఉంటే.. మరికొన్ని దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి. ఈ జాబితాలో గూగుల్ ఒకటి. ఈ కంపెనీ తాజాగా తన క్లౌడ్ డివిజన్‌లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.
గూగుల్ ఉద్యోగులను తొలగించిన విషయం వెల్లడైనప్పటికీ.. ఎంతమంది ఉద్యోగులను తొలగించారు అనేదానికి సంబంధించిన విషయం వెల్లడికాలేదు. అయితే తొలగింపులు కొన్ని విభాగాలకు మాత్రమే పరిమితమైనట్లు తెలుస్తోంది. సంస్థ దీర్ఘకాలిక విజయాల కోసం కంపెనీ కీలకమైన కొన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి యోచిస్తోంది. ఈ సమయంలో కొన్ని సర్దుబాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కారణంగానే.. కొంతమంది ఉద్యోగులను తొలగించినట్లు గూగుల్ ప్రతినిధి వెల్లడించారు.
బెంగళూరులో గూగుల్ కొత్త ఆఫీస్
టెక్ దిగ్గజం గూగుల్ (Google) బెంగళూరులో తమ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించింది. దీనికి ’అనంత’ అని పేరు కూడా పెట్టింది. అనంత అంటే 'అపరిమితం' అని అర్థం. ఇది టెక్నాలజీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అపరిమితమైన అవకాశాలను సూచిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న.. భారీ ఆఫీసులలో ఇది ఒకటని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment