ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ రంగంలో సేవలందిస్తున్న బాష్ కంపెనీ తన ఉద్యోగులకు తగ్గించబోతున్నట్లు సంకేతాలిచ్చింది. జర్మనీలోని తన ప్లాంట్‌లో పని చేస్తున్న దాదాపు 7,000 మంది ఉద్యోగులను కొలువుల నుంచి తొలగించనున్నట్లు జెక్‌పోస్పోలిటా నివేదించింది.
జెక్‌పోస్పోలిటా నివేదికలోని వివరాల ప్రకారం..బాష్ సీఈఓ స్టీఫెన్ హర్తంగ్ మాట్లాడుతూ..‘ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆటోమోటివ్ సేవలందిస్తున్న బాష్ కంపెనీ ఉద్యోగులను తగ్గించే పనిలో నిమగ్నమైంది. జర్మనీ ప్లాంట్‌లోని దాదాపు 7,000 మంది సిబ్బందికి ఉద్వాసన కల్పించనుంది. ప్రధానంగా ఆటోమోటివ్ సప్లై సెక్టార్‌లో, టూల్స్ డివిజన్, గృహోపకరణాల విభాగంలో పనిచేసే వారు ఈ నిర్ణయం వల్ల త్వరలో ప్రభావం చెందవచ్చు’ అని చెప్పారు.
విభిన్న రంగాల్లో సిబ్బంది సర్దుబాటు
‘కంపెనీ 2023లో దాదాపు 98 బిలియన్ డాలర్ల(రూ.8.18 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. ఈ సంవత్సరం అమ్మకాలపై రాబడి అధికంగా 4 శాతంగా ఉంటుందని అంచనా వేశాం. 2026 నాటికి ఇది ఏడు శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే 2024లో కంపెనీ అంచనాలను చేరుకోకపోవచ్చు. ప్రస్తుతానికి మా సిబ్బందిని విభిన్న విభాగాల్లో మరింత సర్దుబాటు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నాను’ అని చెప్పారు.
ఇదీ చదవండి: స్విగ్గీకి రూ.35,453 జరిమానా!
రూ.66 వేలకోట్లతో కొనుగోలు
బాష్ కంపెనీ ఉద్యోగులను తగ్గించాలని భావిస్తున్నప్పటికీ ఇతర కంపెనీల కొనుగోలుకు ఆసక్తిగా ఉందని నివేదిక ద్వారా తెలిసింది. బాష్ సంస్థ ఐరిష్ కంపెనీ జాన్సన్ కంట్రోల్స్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద కొనుగోలుగా ఉండబోతున్న ఈ డీల్ విలువ ఏకంగా ఎనిమిది బిలియన్ డాలర్లు(రూ.66 వేలకోట్లు)గా ఉంది. హీట్ పంప్, ఎయిర్ కండిషనింగ్ పరిశ్రమలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ కొనుగోలు ఎంతో ఉపయోగపడుతుందని నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment