ఫిన్లాండ్‌కు చెందిన టెక్ కంపెనీ నోకియా ఉద్యోగాల కోతలను ప్రకటించింది. కంపెనీ చైనాలో దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. కంపెనీ ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా యూరప్‌లో కూడా అదనంగా మరో 350 మందిని తొలగించింది. యూరప్‌లో ఉద్యోగాల కోతలను గురించి సంస్థ ప్రతినిధి ధృవీకరించినప్పటికీ.. చైనాలో ఉద్యోగుల తొలగింపు గురించి ప్రస్తావించలేదు.
చైనా నోకియా కంపెనీలో 10,400 మంది ఉద్యోగులు ఉండగా.. ఐరోపాలో వీరి సంఖ్య 37,400గా ఉంది. ఖర్చులను తగ్గించి 2026 నాటికి సుమారు 868 మిలియన్ డాలర్ల నుంచి 1.2 బిలియన్ డాలర్లు లేదా రూ.7,300 కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఆదా చేయాలని నోకియా భావిస్తోంది.
నోకియాకు కీలకమైన మార్కెట్లలో చైనా ఒకటి. అయితే.. హువావే, జెడ్‌టిఇ వంటి చైనా కంపెనీలను యుఎస్ నిషేధించడంతో, చైనా కంపెనీలు నోకియా, ఎరిక్సన్ వంటి వాటితో తమ ఒప్పందాలను తగ్గించుకున్నాయి. 2019లో నోకియా నికర అమ్మకాలలో చైనా వాటా 27 శాతం కాగా.. ప్రస్తుతం ఇది 6 శాతానికి తగ్గింది.
నోకియా ఉద్యోగుల తొలగింపు చేపట్టకముందే.. ఈ వారం ప్రారంభంలో మెటా సంస్థ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్‌ల విభాగంలోని టీమ్‌లలో కూడా ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. అయితే ఏ విభాగంలో ఎంత మంది ఉద్యోగులను తొలగించారనేది కంపెనీ వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment