
హైల్యాండ్స్ రాంచ్: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కొలెరాడోలోని ఓ పాఠశాలలోకి చొరబడిన ఇద్దరు విద్యార్థులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ‘డెవోన్ ఎరిక్సన్ (18), మరో విద్యార్థి కలిసి అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం హైల్యాండ్స్ రాంచ్‌లోని స్టెమ్ స్కూల్‌లోకి ప్రవేశించారు. ఒక్కసారిగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో భయభ్రాంతులకు లోనైన విద్యార్థులు స్కూల్ ఆవరణలో పరుగులు పెట్టారు’అని డగ్లస్ కౌంటీ షెరిఫ్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment