protection System
-
క్రయోజనిక్ ఇంజిన్ 20 పరీక్ష సక్సెస్
సూళ్లూరుపేట: సీఈ20 క్రయోజనిక్ ఇంజన్లో సంక్లిష్టమైన ప్రక్రియను దాటడం ద్వారా మళ్లీ స్టార్ చేయడానికి వీలుండే వ్యవస్థల అభివృద్ధిలో మరో ముందడుగు వేశామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) గురువారం ప్రకటించింది. భవిష్యత్తు ప్రయోగాలకు ఈ పరీక్ష ఎంతగానో దోహదపడుతుందని ఇస్రో పేర్కొంది. నాజిల్ ఏరియా నిష్పత్తి 100 శాతం ఉండేలా సముద్ర ఉపరితల స్థాయిలో హాట్ టెస్ట్‌లో సీఈ20 క్రయోజనిక్ ఇంజన్‌ను నవంబర్ 29న విజయవంతంగా పరీక్షించామని ఇస్రో గురువారం వెల్లడించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో వారి ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఈ పరీక్షకు వేదికైంది. ఎల్వీఎం మార్క్–3 రకం రాకెట్లో పైభాగానికి తగు శక్తిని అందివ్వడంలో సీఈ20 ఇంజన్ సాయపడుతుంది. 19 టన్నుల థ్రస్ట్‌ను అందించే పరీక్షలో ఈ ఇంజన్ నెగ్గింది. ఇప్పటికే ఎల్వీఎం2 ఆరు ప్రయోగాల్లో ఈ ఇంజన్ అద్భుతంగా పనిచేసింది. ‘‘గగన్‌యాన్ మిషన్‌కు కావాల్సిన 20 టన్నుల థ్రస్ట్ స్థాయిని అందించేందకు ఈ ఇంజన్ అర్హత సాధించింది. భవిష్యత్తులో సీ32 స్టేజ్‌లో పేలోడ్ పరిమాణాన్ని పెంచేందుకు ఉపయోగపడే 22 టన్నుల థ్రస్ట్‌ను అందించే కార్యక్రమాల్లోనూ ఈ ఇంజన్‌ను ప్రయోగాత్మకంగా వాడొచ్చు’’అని ఇస్రో పేర్కొంది. మళ్లీ ఇంజన్‌ను రీస్టార్ చేసేందుకు అవసరమయ్యే బహుళధాతు ఇగ్నైటర్ సామర్థ్యాన్నీ విజయవంతంగా పరీక్షించారు. ‘‘సముద్రమట్టం స్థాయిలో సీ20 ఇంజన్‌కు సవాళ్లు ఎదురవుతాయి. నాజిల్ పెద్దదిగా ఉండటంతో 50 ఎంబార్ స్థాయిలో విపరీతమైన శక్తి బయటకు వెలువడుతుంది. దీంతో ఇంజన్ సమీపంలో అత్యంత ఉష్ణం జనించడంతోపాటు పెద్దస్థాయిలో కంపనాలు మొదలై ఆ నాజిల్ దెబ్బతినే ప్రమాదముంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వినూత్న ‘నాజిల్ ప్రొటెక్షన్ సిస్టమ్’ను ఉపయోగించాం’’అని ఇస్రో పేర్కొంది. -
విద్యుత్ కేంద్రాల రక్షణపై పిడుగు!
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం జిల్లా మణుగూరులోని 1,080 (4్ఠ270) మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని జనరేటర్ ట్రాన్స్ఫార్మర్పై శనివారం రాత్రి పిడుగు పడటం రాష్ట్రంలోని కీలక థర్మల్ విద్యుత్ కేంద్రాల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. పిడుగుల నుంచి రక్షణ కల్పించే పటిష్ట ఏర్పాట్లు ఉన్నా భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగు పడటం అనేక సందేహాలకు తావిస్తోంది. పిడుగుల నుంచి రక్షణ కల్పించేందుకు జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ లైట్నింగ్ అరెస్టర్లు, ఎర్తింగ్ టవర్లు, ఎర్త్పిట్ల వంటి రక్షణ వ్యవస్థలన్నీ విఫలం కావడంతోనే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.జనరేటర్ ట్రాన్స్ఫార్మర్పై పిడుగు పడినా మంటలు వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి నైట్రోజన్ ఇంజెక్షన్, స్ప్రింక్లర్ల వ్యవస్థలు సైతం అనుకున్న రీతిలో పనిచేయలేదన్న చర్చ జరుగుతోంది. దీంతోనే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఒకటో యూనిట్‌కు సంబందించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దగ్ధమైనట్లు కొందరు ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. పిడుగుల నుంచి రక్షణ కల్పించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థల డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణలో లోపాలతోనే ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.దీంతో రూ. వేల కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2020 ఆగస్టులో జరిగిన భారీ అగి్నప్రమాదంలో 9 మంది ఇంజనీర్లు, ఇతర సిబ్బంది మృతిచెందడం తెలిసిందే. నాటి ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించినా వారిపై జెన్కో యాజమాన్యం చర్యలు తీసుకోలేదు. అందువల్లే ఆ తరహాలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ వ్యవస్థలన్నీ విఫలం... భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఒక్కో యూనిట్లో 16.8 కేవీ సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్‌ను 400 కేవీ సామర్థ్యానికి పెంచితేనే గ్రిడ్‌కు సరఫరా చేయడానికి వీలవుతుంది. ఆ పనిని జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లు చేస్తాయి. విద్యుత్ కేంద్రంలో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లు ఉండే ప్రాంతాన్ని స్విచ్యార్డ్గా పిలుస్తారు. అక్కడ సబ్ స్టేష న్కు సంబంధించిన అన్ని పరికరాలు ఉంటాయి. పిడుగుల నుంచి రక్షణ కల్పించడానికి స్విచ్‌యార్డ్ చుట్టూ రక్షణ వలయం ఉంటుంది. జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ నుంచి 400 కేవీ విద్యుత్ బయటకు సరఫరా అయ్యే చోట ఓ లైట్నింగ్ అరె స్టర్ ఉంటుంది.వెలుపలి ప్రాంతాల్లో ఎక్కడైనా పిడ గు పడినా స్విచ్యార్డ్కి అధిక వోల్టేజీ సరఫరా కాకుండా ఈ లైట్నింగ్ అరెస్టర్ రక్షణగా పనిచేస్తూ ఉంటుంది. ఇక పిడుగు నేరుగా స్విచ్‌యార్డ్ మీద పడినా ప్రమాదం ఉండకుండా దాని చుట్టూ టవర్లు ఉంటాయి. ఆ టవర్లన్నింటినీ వైర్లతో అనుసంధానించి భూమిలోకి ఎర్తింగ్ చేస్తారు. దీంతో స్విచ్యార్డ్పై పిడుగు పడి నా అందులోంచి హై వోల్టేజీ విద్యుత్ భూమిలోకి వెళ్లిపోయేలా ఈ వ్య వస్థ పనిచేస్తుంది. జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ మీద పిడుగు పడకుండా దారిమళ్లించడానికి దానికి రెండు వైపులా లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చే స్తారు.ఒకవేళ పిడుగు పడినా దాని ప్రభావం భూమిలోకి వెళ్లిపోతుంది. ఇక స్విచ్‌యార్డ్ కింద భూగర్భంలో అర మీటర్ లోపల మెటాలిక్ ప్లేట్లతో ఫెన్సింగ్ మెష్ తరహాలో వలయం ఏర్పాటు చేస్తారు. లైట్నింగ్ అరెస్టర్లను వాటితో అనుసంధానిస్తారు. స్విచ్‌యార్డ్ లోపుల ఎర్త్ పిట్లు కూడా ఉంటాయి. భూగర్భంలో 5 మీటర్ల లోతు వరకు రాడ్డును పాతి ఎర్తింగ్ వ్యవస్థతో కనెక్ట్ చేస్తారు. వాటన్నింటికీ తోడుగా జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ భూగర్భంలో సొంత ఎర్తింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థలన్నీ ఏకకాలంలో విఫలం కావడం వల్లే భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని జనరేటింగ్ ట్రాన్స్ఫార్మర్పై పిడుగుపడి తీవ్ర నష్టాన్ని కలిగించిందన్న చర్చ జరుగుతోంది. సరిగ్గా పనిచేయని రక్షణ వ్యవస్థలు.. పిడుగుపాటు లేదా ఇతర కారణాలతో జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగితే తక్షణమే మల్సిఫైయర్ యాక్టివేట్ అయి మంటలకు ఆక్సిజన్ అందకుండా నిరంతరం నీళ్లను చల్లుతుంది. దీంతో ఆక్సిజన్ అందక మంటలు ఆగిపోతాయి. ఇక టాన్స్ఫర్మర్ వద్ద మరో రక్షణ వ్యవస్థగా నైట్రోజన్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు. సాధారణంగా ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్ మరుగుతూ వేడిగా ఉంటుంది. ఆయిల్ ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరితే ట్రాన్స్ఫార్మర్లలో మంటలు చెలరేగి దగ్ధమయ్యే ప్రమాదం ఉంటుంది.అందుకే నిరంతరం ఆయిల్ ఉష్ణోగ్రతలను నైట్రోజన్ ఇంజెక్షన్ సిస్టమ్ కనిపెడు తూ ఉంటుంది. ఒకవేళ మంటలు చెలరేగే స్థాయికి ఉష్ణోగ్రతలు పెరిగితే తక్షణమే ట్రాన్స్ఫార్మర్ను ట్రిప్ చేయడంతోపాటు అందులోని ఆయిల్ లో 10 శాతాన్ని బయటకు పంపిస్తుంది. అలా ఏర్పడే ఖాళీ ప్రదేశాన్ని నైట్రోజన్‌తో నింపేస్తుంది. దీంతో ఆక్సిజన్ అందక ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగవు. భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ రక్షణ వ్యవస్థలు సైతం సరిగ్గా పనిచేయలేదనే చర్చ జరుగుతోంది.ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ కాలంజనరేటర్ ట్రాన్స్ఫార్మర్ను 2020లో ప్రారంభించగా ఇప్పటికే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసింది. ఇన్సూ్యరెన్స్ చేయించి ఉంటేనే జెన్కోకు నష్టం తప్పనుంది. లేకుంటే సొంత ఖర్చుతో మరమ్మతులు నిర్వహించక తప్పదు. బీహెచ్ఈఎల్–¿ోపాల్ ఈ ట్రాన్స్ఫార్మర్ను తయారు చేసింది. -
రైళ్లకు రక్షణ ‘కవచం’.. కిలోమీటర్‌కు 50 లక్షల వ్యయం.. తేడా వస్తే బ్రేకులే!
సాక్షి, అమరావతి: ఒడిశా రాష్ట్రంలో ఇటీవల కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన ఘోర ప్రమాదం రైల్వే చరిత్రలో పెద్ద మచ్చే. కవచ్ రక్షణ వ్యవస్థ ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేశారు. రైళ్ల ప్రమాదాల నివారణకు భారత రైల్వే శాఖ రూపొందించిన ఈ కవచ్ వ్యవస్థ ఇప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉంది. దేశవ్యాప్తంగా కవచ్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి 15 ఏళ్లు పడుతుందని రైల్వే శాఖ నివేదిక వెల్లడించింది. స్వర్ణ చతుర్భుజి మార్గంలో 2028 నాటికి అందుబాటులోకి తెస్తామని తెలిపింది. స్వర్ణ చతుర్భుజిలోని చెన్నై – హౌరా మార్గంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నందున రాష్ట్రంలో మరో ఐదేళ్లలో (2028నాటికి) కవచ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. స్వదేశీ పరిజ్ఞానంతో ‘కవచ్’ సాంకేతిక, మానవ తప్పిదాలతో రెండు రైళ్లు ఒకే సమయంలో ఒకే ట్రాక్ మీదకు వస్తే ఢీకొనకుండా నివారించేందుకు రైల్వే రీసెర్చ్ డిజైన్స్– స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ‘కవచ్’ పేరుతో ఆధునిక రక్షణ వ్యవస్థను రూపొందించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రైల్వే శాఖ రూపొందించిన ఈ వ్యవస్థను ఇప్పటికే విజయవంతంగా పరీక్షించింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందించిన ఈ వ్యవస్థకు ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ అందించే అత్యుత్తమ స్థాయి సేఫ్టీ ఇంటెగ్రిటీ లెవెల్ –4 (ఎస్ఐఎల్ 40) సర్టిఫికేషన్ కూడా రావడం విశేషం. దేశంలో రైళ్లు ఢీకొన్న ఘటనల్లో 89 శాతం ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని వెల్లడైంది. దాంతో శాస్త్రీయంగా అధ్యయనం చేసి ‘యాంటీ కొల్లీషన్ పరికరాలను’ రైల్వే శాఖ రూపొందించింది. దీనిని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పరీక్షించగా, పూర్తి సఫలీకృతమైంది. దీంతో ‘కవచ్’ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో కేవలం 1,450 కిలోమీటర్ల మేరే అందుబాటులోకి తెచ్చారు. ఇటీవలి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనతో కవచ్ వ్యవస్థను దేశమంతా దశలవారీగా విస్తరించేందుకు రైల్వే శాఖ ప్రణాళికను రూపొందించింది. అందుకోసం హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ అనే సంస్థతో కలసి కవచ్ ప్రాజెక్టును చేపట్టినట్టు రైల్వే శాఖ తెలిపింది. ఇదీ ప్రణాళిక.. ♦ దేశంలో రైళ్ల రద్దీ అత్యధికంగా ఉండే స్వర్ణ చతుర్భుజి మార్గంలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం కిలోమీటర్‌కు రూ.50 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ♦ స్వర్ణ చతుర్భుజి మార్గంలో మొదటగా ముంబయి–ఢిల్లీ, ఢిల్లీ–హౌరా రూట్లో కవచ్ వ్యవస్థను నెలకొల్పుతారు. ఇప్పటికే రైల్వే శాఖ ఈ పనులు ప్రారంభించింది. ముంబయి – ఢిల్లీ 1,384 కి.మీ., ఢిల్లీ–హౌరా 1,454 కి.మీ. కలిపి మొత్తం 2,838 కి.మీ. మేర ఈ పనులను 2024 డిసెంబర్‌కు పూర్తి చేయాలన్నది లక్ష్యం. ♦ రెండో దశ కింద స్వర్ణ చతుర్భుజిలోని ఇతర మార్గాల్లో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ మీదుగా చెన్నై–హౌరా మార్గంలో కూడా కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. చెన్నై –హౌరా, చెన్నై–బెంగళూరు–ముంబయి మార్గంలో 2024 డిసెంబర్లో పనులు ప్రారంభించి 2028నాటికి పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. ♦ ఆంధ్రప్రదేశ్ గుండా చెన్నై–హౌరా మార్గంలో మొత్తం 1,162 కి.మీ. మేర కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ఈ మార్గంలో కవచ్ వ్యవస్థ పనితీరును పర్యవేక్షించేందుకు విజయవాడ, విశాఖపట్నం, కటక్, బాలాసోర్లను ప్రధాన కేంద్రాలుగా గుర్తించారు. ♦ అనంతరం మూడో దశ కింద చెన్నై–ఢిల్లీ మార్గంలో మొత్తం 2,182 కి.మీ. మేర కవచ్ వ్యవస్థను నెలకొల్పుతారు. కవచ్ పనిచేస్తుందిలా.. కవచ్ వ్యవస్థలో భాగంగా రైళ్లలో మైక్రో ప్రాసెసర్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ (జీపీఎస్), యాంటీ కొల్లీషన్ పరికరాలను ఏర్పాటు చేస్తారు. రైల్వే ట్రాక్‌లను కూడా ఈ పరిజ్ఞానంతో అనుసంధానిస్తారు. ఇస్రో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల నుంచి ఈ పరికరాలు సిగ్నల్స్‌ను స్వీకరిస్తాయి. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు ఒకేసారి పొరపాటున వస్తే మోడెమ్ సహాయంతో ఆటోమేటిగ్గా ఆ రెండు రైళ్లకు పరస్పరం సమాచారం చేరుతుంది. ఒక రైలు ప్రయాణిస్తున్న మార్గంలోనే మరో రైలు కూడా ఎదురుగా వస్తుంటే... నిర్ణీత దూరంలో ఉండగానే ఈ పరికరాల ద్వారా గుర్తించొచ్చు. దాంతో వెంటనే రైలులో ఆటోమేటిక్ బ్రేకులు పడి రైలు నిలిచిపోతుంది. ఈ పరికరాలు మానవ తప్పిదాలను కూడా గుర్తించి నివారించేందుకు దోహదపడతాయి. దాంతో రైళ్లు పరస్పరం ఢీకొనకుండా పూర్తిగా నివారించడం సాధ్యపడుతుంది. -
రైలు ప్రమాదాల నివారణకు ‘కవచ్’
సాక్షి, అమరావతి: రైళ్లు పరస్పరం ఢీకొనే ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు రైల్వే శాఖ ఆధునిక సాంకేతిక రక్షణాత్మక వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. రెండు రైళ్లు ఒకేసారి ట్రాక్ మీదకు వచ్చి ఢీకొనడం తీవ్ర ప్రమాదాలకు దారి తీస్తోంది. దీన్ని నివారించేందుకు ‘కవచ్’ పేరుతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రధానంగా సిగ్నలింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. దేశంలో 2 వేల కిలోమీటర్ల మేర రైలు మార్గాల్లో ‘కవచ్’ విధానాన్ని ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వెల్లడించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోఅభివృద్ధి చేసిన కవచ్ విధానంతో రైళ్లు పరస్పరం ఢీకొనడాన్ని పూర్తిగా నివారించవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపితమైంది. వేగం తగ్గించకుండానే.. ప్రస్తుతం రైళ్ల డ్రైవర్లు ఏదైనా రైల్వే స్టేషన్ రాగానే రైళ్ల వేగాన్ని తగ్గిస్తుంటారు. ఆ స్టేషన్లో రైలు నిలపాల్సిన అవసరం లేకపోయినా సరే రైళ్ల వేగాన్ని తగ్గిస్తున్నారు. పొరపాటున ఎదురుగా ఏదైనా రైలు వస్తుందేమోనని ముందు జాగ్రత్తగా వేగాన్ని తగ్గిస్తారు. మళ్లీ వేగం పుంజుకునేందుకు కొంత సమయం పడుతుంది. దాంతో రైళ్లు తగిన వేగంతో ప్రయాణించడం సాధ్యపడటం లేదు. కవచ్ పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టిన తరువాత ఆ విధంగా నిలపాల్సిన అవసరం లేని రైల్వే స్టేషన్లు సమీపించగానే రైళ్ల వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉండదు. దాంతో రైళ్లు గమ్యస్థానాలకు త్వరగా చేరేందుకు అవకాశం ఉంటుంది. విజయవంతంగా ప్రయోగం రైల్వే శాఖ కవచ్ వ్యవస్థను ఇప్పటికే విజయవంతంగా పరీక్షించింది. భారత దేశంలో రైళ్లు ఢీకొన్న ప్రమాదాలను విశ్లేషించగా 89 శాతం ప్రమాదాలు మానవ తప్పిదంతోనే సంభవించాయని వెల్లడైంది. దాంతో శాస్త్రీయంగా అధ్యయనం చేసి యాంటీ కొల్లీషన్ పరికరాలను రైల్వే శాఖ రూపొందించింది. ఈ పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా కొంకణ్ రైల్వే పరిధిలో పరీక్షించారు. అనంతరం ఈశాన్య రైల్వే పరిధిలోనూ ప్రవేశపెట్టారు. ఆ రెండుచోట్లా ఈ వ్యవస్థ పూర్తిగా విజయవంతమైంది. దాంతో ఈ వ్యవస్థకు ‘కవచ్’ అనే పేరుపెట్టి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. మొదటి దశలో దేశంలో 2వేల కిలోమీటర్ల మేర లైన్లలో కవచ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ప్రధానంగా మెట్రో నగరాలను కలుపుతూ ఉన్న లైన్లలో వీటిని ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. చెన్నై–కోల్‌కతా మార్గంలో కూడా వీటిని ప్రవేశపెట్టనున్నారని సమాచారం. కవచ్ వ్యవస్థ ఇలా.. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో కవచ్ వ్యవస్థను రైల్వే శాఖ సిద్ధం చేసింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందించిన ఈ వ్యవస్థకు ఎస్ఐఎల్–4 సర్టిఫికేషన్ కూడా రావడం విశేషం. ఈ పరిజ్ఞానాన్ని ఏర్పరచడంలో భాగంగా మైక్రో ప్రాసెసర్లు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్), యాంటీ కొల్లీషన్ పరికరాలను రైళ్లలో ఏర్పాటు చేస్తారు. రైల్వే ట్రాక్‌లను కూడా ఈ పరిజ్ఞానంతో అనుసంధానిస్తారు. ఇస్రో ఉపగ్రహాల నుంచి ఈ పరికరాలు సిగ్నల్స్‌ను స్వీకరిస్తాయి. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు ఒకేసారి పొరపాటున వస్తే మోడెమ్ సహాయంతో ఆటోమేటిగ్గా ఆ రెండు రైళ్లకు పరస్పరం సమాచారం చేరుతుంది. ఒక రైలు ప్రయాణిస్తున్న మార్గంలోనే మరో రైలు కూడా ఎదురుగా వస్తుంటే.. నిర్ణీత దూరంలో ఉండగానే ఈ పరికరాల ద్వారా వెంటనే గుర్తించడం సాధ్యపడుతుంది. దాంతో వెంటనే రైలులో ఆటోమేటిక్ బ్రేకులు పడి రైలు నిలిచిపోతుంది. ఈ పరికరాలు మానవ తప్పిదాలను కూడా గుర్తించి నివారించేందుకు దోహదపడతాయి. -
చైనా : ఒకేసారి 10 అణ్వాయుధాలు
బీజింగ్: ప్రపంచంలోని ఏ మూలనున్న లక్ష్యాలనైనా తాకేలా.. ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయే ఖండాతర క్షిపణి వచ్చే ఏడాదికల్లా చైనా అమ్ముల పొదిలోకి చేరనుంది. డాంగ్‌ఫెంగ్ –41గా పిలుస్తున్న ఈ కొత్త క్షిపణి.. మాక్ 10 కంటే వేగంతో దూసుకుపోగలదు. ప్రత్యర్థి క్షిపణి రక్షణ వ్యవస్థలోకి చొచ్చుకుపోయి తన దారికి అడ్డువచ్చే వేటినైనా తునాతునకలు చేయగల సత్తా ఈ ఖండాంతర క్షిపణి సొంతమని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. 2012లో ప్రకటించిన ఈ క్షిపణిని ఇంతవరకూ ఏడు సార్లు పరీక్షించగా.. తాజాగా మరోసారి నవంబర్ మొదటి వారంలో పరీక్షించినట్లు సమాచారం. 2018 ప్రథమార్ధానికి ఈ అత్యాధునిక క్షిపణి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అందుబాటులోకి రానుంది. 12 వేల కి.మి. దూరంలో లక్ష్యాల్ని ఛేదించే డాంగ్‌ఫెంగ్–41లో మూడంచెల ఘనరూప ఇంధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఇది ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయి వాటిని వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించగలదని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ‘స్పైక్ క్షిపణుల’ ఉపసంహరణ ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేయాలని భావించిన స్పైక్ యాంటి ట్యాంక్ మిస్సైళ్ల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని భారత్ నిర్ణయించింది. ఈ తరహా క్షిపణుల్ని దేశీయ పరిజ్ఞానంతో తయారుచేసే బాధ్యతను రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు అప్పగించింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్పైక్ క్షిపణుల సాంకేతికతను పూర్తిస్థాయిలో భారత్‌కు బదిలీ చేసేందుకు ఇజ్రాయెల్ వైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ తరహా క్షిపణుల రూపకల్పనకు డీఆర్డీవోకు నాలుగేళ్ల గడువు ఇచ్చినట్లు వెల్లడించాయి. ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్, భారత్‌కు చెందిన కళ్యాణి గ్రూప్ స్పైక్ మిస్సైళ్లను రూపొందించడానికి హైదరాబాద్‌లో రూ.70 కోట్లతో ఉత్పత్తి కేంద్రాన్ని ఆగస్టులో ప్రారంభించాయి. -
హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్‌కు అద్భుతమైన వైద్యం
‘రోగనిరోధక వ్యవస్థ’ అనేది అనేక రకాల అనారోగ్యాలకు గురి కాకుండా నిత్యం మనల్ని రక్షించే ఒక పటిష్టమైన రక్షణ వ్యవస్థ. ఇది ఒక్కోసారి పొరబడి శరీర అంతర్భాగాలపైనే దాడి చేస్తుంది. ఇలాంటప్పుడు ఉత్పన్నమయ్యే రకరకాల ఆటో ఇమ్యూన్ సమస్యలలో ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ కూడా ఒకటి. సాధారణంగా వెన్నుపూసలు అరిగి, వాటి మధ్య డిస్కులు దెబ్బతినటంతో వెన్నెముక సమస్యలు వస్తాయి. ఒక్కోసారి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ స్వయంగా, వెన్ను సంబంధిత కణజాలంపై దాడి చేయటంతో ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ సమస్య ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్కు గురైన వెన్నెముక బిరుసుగా మారిపోయిన స్థితినే ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ అంటారు. డిస్కులు, కండరాలు, లిగమెంట్లు, టాండన్‌లు, కార్టిలేజ్‌లు మొ॥సముదాయాలతో కూడిన వెన్నెముక నిర్మాణం ఎంతో సంక్లిష్టమైనది. మనిషి ముఖ్యంగా వంగేందుకు మరియు ఇతర ముఖ్య కదలికలన్నింటికీ వెన్నెముక తోడ్పాటు చాలా కీలకం. ఎప్పుడైతే వెన్నెముక దగ్గర కణజాలం ఫైబ్రోసిస్ బారిన పడుతుందో లేదా వెన్నెముక అసాధారణంగా పెరిగి, పూసలు ఒకదానికొకటి కలసిపోతాయో అప్పుడు వెన్నెముక తన సహజ కదలికలు కోల్పోయి, బొంగు కర్ర మాదిరిగా గట్టిగా మారిపోవటాన్ని వైద్య పరిభాషలో ‘బ్యాంబుస్పైన్’ అని అంటారు. ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ కారణాలు: జన్యుపరమైన ఒక పరిశీలన మేరకు, 90% వ్యాధి బాధితులు ఏఔఅఆ27 అనే జన్యువును కలిగి అంటారు. ఇంతే కాకుండా ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ వ్యాధికి కుటుంబ చరిత్ర కూడా ఒక కారణం. లక్షణాలు: సాధారణ స్థితికి మొదలుకుని అత్యంత తీవ్ర స్థితి వరకు నుడము, తుంటి కీళ్ళు మరియు పిరుదులలో నొప్పి ఉండవచ్చు. వెన్నుపూసలు ఒకదానికొకటి నొక్కుకుపోవటంతో, నడుము-తుంటి భాగంతో పాటు మెడ పట్టేసి మామూలు కదలికలకు ఆటంకమవుతుంది. ఇది కేవలం వెన్నెముకతో పాటు, కాళ్ళు చేతుల తాలూకు కీళ్ళు గుండె కవాటాలను మరియు ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి బాధితులలో 40% మందిలో కనిపించే కంటి సంబంధ లక్షణాలు: కళ్ళు ఎర్రగా మారి వెలుతురు చూడలేకపోవడం, కొన్ని సందర్భాల్లో కంటిచూపు మందగించడం, వీటితో పాటు జ్వరం, నీరసం మరియు ఆకలి తగ్గడం. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: ఒక దీర్ఘకాలిక సమస్యగా పరిణమించే ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ వ్యాధిని మొదట్లోనే గుర్తించి, సత్వర వైద్యం చేయిస్తే, వెన్నెముక పాడవకుండా కాపాడవచ్చు. కేవలం హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో మాత్రమే అందుబాటులో ఉండే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో రోగి లక్షణాలైన నొప్పి, తిమ్మిరి, మంటలను పూర్తిగా తగ్గించడంతో పాటు వ్యాధి మూలకారణాన్ని కూడా గుర్తించి సమర్థవంతమైన చికిత్సను అందివ్వడం జరుగుతుంది. ఈ విశిష్ట హోమియోపతి చికిత్సతో శరీర రోగనిరోధక వ్యవస్థను క్రమపరిచి, ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్‌ను సంపూర్ణంగా నయం చేయవచ్చు లేదా వ్యాధి తీవ్రతను పూర్తిగా తగ్గించి, దుష్పలితాల నుండి పూర్తిగా కాపాడవచ్చు. డా. శ్రీకాంత్ మోర్లావర్, ఇకఈ హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
ఫ్రెండ్లీ పోలీస్
ఆదిలాబాద్ క్రైం : మీ పోలీసులు ఎలా ఉండాలనుకుంటున్నారు..? పోలీసు వ్యవస్థలో మార్పులు చేసే అంశాలేవి..? మీకు కావాల్సిన రక్షణ వ్యవస్థను ఎంచుకోండి.. ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి, మీ అమూల్యమైన సలహాలు, సూచనలతో ‘ఫ్రెండ్లీ పోలీస్’ వ్యవస్థను రూపొందించే దిశగా రాష్ట్ర సర్కార్ అడుగులు వేస్తోంది. పోలీసు వ్యవస్థను మార్చి నూతన వ్యవస్థను ఏర్పాటు చేసేలా పలు అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 10లోగా ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి పూర్తి నివేదిక అందజేయాలని పోలీసు శాఖను ప్రభుత్వం ఆదేశించింది. కాగా.. ఇటీవ ల పలు మండలాల్లోని పోలీసు స్టేషన్లు, జిల్లా కేం ద్రంలో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే.. దుర్గా నవరాత్రులు, దసరా, బక్రీద్ పండుగలు వరుసగా రావడంతో ప్రజాభిప్రాయ సేకరణ ఆలస్యమైంది. నేటితో పండుగలన్నీ పూర్తవుతుండడంతో జిల్లా పోలీసు శాఖ ఠాణా మొదలుకొని సబ్డివిజన్స్థాయి దాకా సమావేశాలు ఏర్పాటు చేసే పనిలో పడ్డాయి. ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని ఈనెల 10 లోగా ప్రభుత్వానికి నివే దించనున్నారు. సామాన్యుడు సైతం సమస్య చెప్పుకునేలా.. గతంలో పోలీసుస్టేషన్‌కు వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ భయపడేవారు. స్టేషన్‌కు వెళ్తే అక్కడి పోలీసులు ఏమంటారోననే భయం ఉండేది. ఈ భయం నుంచి సామాన్యుడిని విముక్తి చే సి.. నిర్భయంగా పోలీసు మెట్లెక్కేలా చేయాలని భావిస్తోంది సర్కారు. ఇందులో భాగంగానే పోలీసు వ్యవస్థ ప్రక్షాళనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో కాలం చెల్లిన చట్టాలను, ప్రజల అవసరాలు తీర్చలేని పోలీసులను మార్చేందుకు సిద్ధమవుతోంది. నూతన పోలీసు వ్యవస్థ రూపకల్పనలో ప్రజలను భాగస్వాములను చేసి వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలకనుగుణంగా నూతన పోలీసు వ్యవస్థను రూపొందించనున్నారు. ఈ మేరకు ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 50 శాతం ప్రజాభిప్రాయ సేకరణ అయినట్లు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ వివరాలను ప్రభుత్వానికి అందజేసేందుకు మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉండడంతో ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు పోలీసులు ప్రణాళికను రూపొందించారు. మంగళవారం నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఐదు రోజులపాటు ప్రజాభిప్రాయాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో రెండు లేదా మూడు సమావేశాలు నిర్వహించి.. అందులో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాములను చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అంశాల వారీగా సూచనలు, సలహాలు అక్కడే నమోదు చేసుకుని జిల్లా స్థాయి అధికారులకు పంపించనున్నారు. ఆధునికీకరణలో ప్రజలే భాగస్వాములు.. పోలీసులను ఫ్రెండ్లీ అండ్ మాడ్రన్ (స్నేహ పూర్వక, అధునాతన)గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై దృష్టి సారించింది. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో పోలీసు వ్యవస్థలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇలాగే ప్రతి జిల్లాలోనూ పోలీసు వ్యవస్థను ఆధునికీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆ మేరకు రంగంలోకి దిగిన డీజీపీ జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లు, సమావేశాలు నిర్వహించి ప్రజల నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. ప్రజలతో పాటు, వివిధ ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు, మహిళా సంఘాలు, ఎన్జీవోలు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులను భాగస్వాములుగా చేసి, వారి నుంచి అభిప్రాయాలను సేకరించాలని ప్రభుత్వం సూచిస్తోంది. -
శత్రు దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థ
మోడీ ప్రమాణ స్వీకారానికి కట్టుదిట్టమైన భద్రత న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేస్తున్నారు. దుర్భేద్యమైన గగనతల రక్షణ వ్యవస్థను వైమానిక దళం ఏర్పాటు చేయగా, దాదాపు 10 వేల మంది భద్రతా సిబ్బంది కార్యక్రమానికి రక్షణగా నిలుస్తున్నారు. ఢిల్లీ పోలీస్, ఎన్ఎస్జీ, పారామిలటరీ దళాలు, ఎస్పీజీ తదితర దళాలు అందులో పాల్గొంటున్నాయి. రాష్ట్రపతిభవన్ నుంచి రెండు కిలోమీటర్ల పరిధిని వారు తమ అధీనంలోకి తీసుకున్నారు. విదేశాల అధిపతులు, ప్రముఖులు బస చేసిన అన్ని హోటళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, ప్రమాణ స్వీకార వేదికను ఐటీబీపీకి చెందిన జాగిలాలు క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నాయి. వీవీఐపీల రాకపోకలకు వీలుగా ట్రాఫిక్‌ను అదుపు చేసేందుకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లే అన్ని మార్గాలనూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు మూసివేయనున్నారు. {పధానిగా మోడీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయినట్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కార్యదర్శి ఒమితా పాల్ చెప్పారు. మోడీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే విషయమై తన వద్ద ఎలాంటి సమాచారం లేదని, మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల వివరాలు కూడా తెలియదని అన్నారు. ఢిల్లీలో సోమవారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఒకవేళ వర్షం పడితే, వేదికను దర్బార్ హాలుకు మారుస్తామన్నారు. అయితే, అక్కడ 500 మంది కూర్చోవడానికి, మరో 400 మంది నిల్చోవడానికి మాత్రమే వీలవుతుందని ఆమె వివరించారు. రాష్ట్రపతి భవన్లో ఎక్కువ మంది పాల్గొంటున్న భారీ కార్యక్రమం ఇదే. దాదాపు 4 వేల మంది హాజరు కావచ్చని భావిస్తున్నారు. గతంలో రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో చంద్రశేఖర్, వాజ్‌పేయి ప్రధానులుగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమాల్లో 1200 నుంచి 1300 మంది మాత్రమే పాల్గొన్నారు.భారత ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్ దేశాల అధిపతులను ఆహ్వానించడం ఇదే ప్రథమం.భారత్‌లోని విదేశీ రాయబారులు, హై కమిషనర్లను ఆహ్వానించడం కూడా ఇదే తొలిసారి.దక్షిణాసియా దేశాల కూటమి ‘సార్క్’లో సభ్య దేశాలైన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స, అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా, మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ అబ్దుల్ గయూమ్లు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా జపాన్ పర్యటనలో ఉన్నందున ఆమె తరఫున బంగ్లా స్పీకర్ షిరిన్ చౌధురి హాజరవుతున్నారు. బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్, సల్మాన్ ఖాన్లు కూడా హాజరవుతున్నారు.వడోదరా లోక్‌సభ స్థానం నుంచి మోడీ నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఆయనకు ప్రతిపాదకులుగా ఉన్న మాజీ రాచకుటుంబానికి చెందిన టీ వర్తకుడు కిరణ్ మహీదా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. గుజరాత్ కొత్త సీఎం ఆనందీబెన్ పటేల్ సహా గుజరాత్ రాష్ట్రానికి చెందిన మొత్తం 21 మంది మంత్రులు, బీజేపీ గుజరాత్ రాష్ట్ర శాఖ కార్యనిర్వాహక సభ్యులందరూ మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఇటీవలే బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జితన్‌రామ్ మంజీ కూడా హాజరు కానున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తన తరఫున ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రదీప్ అమత్ను పంపనున్నారు. {పముఖ ఎన్నారైలు సహా దాదాపు 90 మంది విదేశీ ప్రముఖులను కార్యక్రమానికి ఆహ్వానించారు.{పమాణం తర్వాత మోడీ ప్రధాని అధికారిక నివాసమైన 7 రేస్ కోర్సు రోడ్డు భవనానికి వెళ్తారు