సాక్షి, న్యూఢిల్లీ: గడచిన రెండు వారాల్లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న దాదాపు 540 కోట్ల నగదు, విలువైన వస్తువులను ఎలక్షన్ కమిషన్ స్వాధీనం చేసుకుంది. వీటిలో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో దాదాపు రూ.104 కోట్లు, అత్యల్పంగా అండమాన్ నికోబర్‌లో రూ.90 లక్షలు పట్టుబడినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఫ్లైయింగ్ స్కాడ్, నిఘా సంస్థాల తోడ్పాటుతో వివిధ రాష్ట్రాలలో అక్రమంగా తరలిస్తున్న డబ్బును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఏడు దశలలో ఏప్రిల్ 11 నుంచి 19 మధ్య జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడనున్నాయి.
వివిధ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న డబ్బు:
రాష్ట్రాలు | రూపాయలు (కోట్లలో) |
ఆంధ్రప్రదేశ్ | 103 |
గుజరాత్ | 6 |
మణిపూర్ | 22.6 |
వెస్ట్ బెంగాల్ | 16.295 |
అస్సాం | 4.20 |
అరుణాచ్ ప్రదేశ్ | 2.28 |
కర్ణాటక | 26.53 |
మధ్యప్రదేశ్ | 9.197 |
మహరాష్ట్ర | 19.11 |
Comments
Please login to add a commentAdd a comment