
ఐజ్వాల్: మిజోరాంలో డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. పోలీసులు, అస్సాం రైఫిల్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఐజ్వాల్‌లో రెండు చోట్ల మత్తుపదార్థాలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.12 కోట్లు ఉంటుందని అంచనా.
రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం నలుగురు డ్రగ్ పెడ్లర్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక చోట 98,000 డ్రగ్స్ మాత్రలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.9.8 కోట్లు ఉంటుందని తెలిపారు.
మరో ఘటనలో శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. 40 సబ్బుపెట్టెల్లో హెరాయిన్‌ను గుర్తించారు అధికారులు. దీని విలువ రూ.2.5కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.
చదవండి: ఎంపీ సుప్రియా సూలే చీరకు అంటుకున్న నిప్పు.. వీడియో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment