సాక్షి, హైదరాబాద్: నగరంలో ఖరీదైన వాహనాలతో రోడ్లపై రేసింగ్, ఛేజింగ్‌లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. గతంలో రాత్రి వేళల్లో మాత్రమే యువకులు రేసింగ్‌లకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు ఉదయం, మధ్యాహ్నం వేళల్లోనూ రేసింగులకు పాల్పడుతున్నారు. నెక్లెస్ రోడ్డు, పీవీ ఎలివెటెడ్ ఎక్స్‌ప్రెస్ వే, ఔటర్ రింగురోడ్లపై వారు రెచ్చిపోతున్నారు. ఆదివారం ఉదయం పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై 2 ఖరీదైన స్పోర్ట్స్ కార్లలో విపరీతమైన వేగంతో దూసుకుపోతున్న వారిని పోలీసులు వెంబడించి మరీ పట్టుకున్నారు. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పందించారు. నగరంలో ఇలాంటి వాహనాలు ఎన్ని ఉన్నాయో గుర్తించి వాటి యజమానులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఒకసారి కౌన్సెలింగ్ ఇచ్చాక కూడా వాహనాలను పరిమితికి మించిన వేగంతో నడిపినట్లు తేలితే వారి లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. వాహనాలను కూడా సీజ్ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment