
సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు అంశమే రాబోయే సాధారణ ఎన్నికల్లో ప్రధానాంశం అవుతుందని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంవోపీఎస్) సెక్రెటరీ జనరల్ గంగాపురం స్థితప్రజ్ఞ అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని చరక్ భవన్ గ్రౌండ్‌లో ఆదివారం ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల కుంభమేళా నిర్వహించారు.
కార్యక్రమంలో స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ఇప్పటికే ఒక జాతీయ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేసిందని, మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రూ.లక్షల కోట్ల కార్పొరేట్ కంపెనీల అప్పులు రద్దు చేసినప్పుడు కలగని నష్టం.. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పింఛన్ అమలు చేస్తే వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా మహాకాళుడి సాక్షిగా ఉజ్జయిని నగరంలో ‘ఓట్ ఫర్ ఓపీఎస్’ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో విజయకుమార్ బంధు (ఉత్తరప్రదేశ్), వితీశ్ ఖండేల్కర్ (మహారాష్ట్ర), కల్వల్ శ్రీకాంత్, నరేశ్ గౌడ్ (తెలంగాణ) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment