
'వాళ్లిద్దరూ సమాజానికి ప్రమాదకరమే'
ఒంగోలు : లైసెన్స్ లేని వాహన డ్రైవర్, లైసెన్స్ లేకుండా తుపాకీ కలిగి ఉన్న వ్యక్తులిద్దరూ సమాజానికి ప్రమాదకరమేనని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు అన్నారు. లైసెన్స్ లేని వాహనాలు ఎక్కకుండా ప్రజల్లో చైతన్యం రావాలని, అప్పుడే ప్రమాదాలు నివారించవచ్చని ఆయన బుధవారమిక్కడ పేర్కొన్నారు. ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన పోలీస్ ఆన్లైన్ ఫిర్యాదు (ఐ-క్లిక్) కేంద్రాలు రెండింటిని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హోంగార్డుల సెలవులు, తదితర సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.