పిల్లల్ని కనడానికి లైసెన్స్ ఉండాలి | sanjana expressing her feeling about deliver a baby | Sakshi
Sakshi News home page

పిల్లల్ని కనడానికి లైసెన్స్ ఉండాలి

Published Sat, Dec 31 2016 2:17 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

పిల్లల్ని కనడానికి లైసెన్స్  ఉండాలి

పిల్లల్ని కనడానికి లైసెన్స్ ఉండాలి

పిల్లల్ని కనడానికి తల్లులకు లైసెన్స్ ఉండాలని నటి సంజన అభిప్రాయపడ్డారు. తమిళం, తెలుగు, కన్నడ తదితర భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు పొందిన ఈ భామ కోలీవుడ్‌కు కాదల్‌ సెయ్‌వీర్‌ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. తమిళంలో పాపులర్‌ అయిన నటి నిక్కీగల్రాణి సోదరి అయిన సంజన అందరిలాగా తన గురించి, తన చిత్రాల గురించి కాకుండా ఒక వినూత్న భావాన్ని వ్యక్తం చేశారు. తనేమంటున్నారో చూద్దాం. మోటార్‌ వాహనాలు నడపడానికి లైసెన్స్ ఉంటుంది. వస్తువుల ఉత్పత్తులకు, వాటి విక్రయాలకు లైసెన్స్ కావలసి ఉంటుంది.

అదే విధంగా పిల్లల్ని కనడానికి తల్లులకు లైసెన్స్ విధానం అవసరం. చాలా మంది తల్లులు పిల్లల్ని కని వారితో బిచ్చమెత్తిస్తున్నారు. కొందరైతే చంటి పిల్లల్ని చంకనేసుకొని అడుక్కుంటున్నారు. మరి కొందరు మహిళలు పిల్లల్ని అద్దెకు తీసుకొచ్చి బిచ్చమెత్తుకుంటున్నారు. ఇంకొందరు సంపాదన కోసమే పిల్లల్ని కంటున్నారు. అలాంటి తల్లులకు లక్ష రూపాయలు ఇచ్చి ఇకపై పిల్లల్ని అడుక్కునే వారిగా తయారు చేయకండి అని చెప్పినా వారిలో మార్పురాదు. మండే ఎండల్లో రోడ్ల పక్కన జీవశ్చవాల్లా పడిఉన్న అలాంటి పిల్లల్ని చూస్తుంటే దుఃఖం పొంగుకొస్తుంది. వారికి తినడానికి అన్నం, కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండవు.

ఇలా చాలా మందిని బాల కార్మికుల్లా మారుస్తున్నారు. అలాంటి బాల కార్మికులు తయారవ్వకుండా ఉండాలంటే పిల్లల్ని కనడానికి తల్లులకు లైసెన్స్ విధానం అమలవ్వాలి. స్త్రీలకు పిల్లల్ని కని పెంచే స్తోమత ఉందా అని విచారించి అందుకు లైసెన్స్ ఇవ్వాలని, అలా లైసెన్స్ లేని వారు పిల్లల్ని కంటే తగిన శిక్ష విదించాలి అని వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు పిల్లలను కనడానికి తల్లులకు లైసెన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని విజ్ఞప్తి చేసినట్టు నటి సంజన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement