న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం సర్వీసులకు సంబంధించి అదానీ డేటా నెట్‌వర్క్‌కు ఏకీకృత లైసెన్సు (యూఎల్) లభించింది. కేంద్రం తాజాగా దీన్ని మంజూరు చేసినట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. అదానీ డేటా నెట్‌వర్క్స్ (ఏడీఎన్‌ఎల్) , ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు,ముంబై ఇలా ఆరు సర్కిళ్లలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నుండి ఏకీకృత లైసెన్స్‌ను పొందింది.
అదానీ గ్రూప్‌లో భాగమైన ఏడీఎన్‌ఎల్ ఇటీవల జరిగిన 5జీ స్పెక్ట్రం వేలంలో 26 గిగాహెట్జ్ బ్యాండ్‌లో 20 ఏళ్ల వ్యవధికి 400 మెగాహెట్జ్ మేర స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 212 కోట్లు వెచ్చించింది. ఈ స్పెక్ట్రంను తమ గ్రూప్ వ్యాపారాల కస్టమర్ల కోసం రూపొందిస్తున్న సూపర్ యాప్‌తో పాటు తమ డేటా సెంటర్ల కోసం మాత్రమే వినియోగించుకునే యోచనలో ఉన్నట్లు అదానీ గ్రూప్ గతంలోనే పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment