Telecom circles
-
‘అదానీ’ కి టెలికం లైసెన్స్: డాట్ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం సర్వీసులకు సంబంధించి అదానీ డేటా నెట్‌వర్క్‌కు ఏకీకృత లైసెన్సు (యూఎల్) లభించింది. కేంద్రం తాజాగా దీన్ని మంజూరు చేసినట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. అదానీ డేటా నెట్వర్క్స్ (ఏడీఎన్ఎల్) , ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు,ముంబై ఇలా ఆరు సర్కిళ్లలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నుండి ఏకీకృత లైసెన్స్‌ను పొందింది. అదానీ గ్రూప్‌లో భాగమైన ఏడీఎన్ఎల్ ఇటీవల జరిగిన 5జీ స్పెక్ట్రం వేలంలో 26 గిగాహెట్జ్ బ్యాండ్‌లో 20 ఏళ్ల వ్యవధికి 400 మెగాహెట్జ్ మేర స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 212 కోట్లు వెచ్చించింది. ఈ స్పెక్ట్రంను తమ గ్రూప్ వ్యాపారాల కస్టమర్ల కోసం రూపొందిస్తున్న సూపర్ యాప్‌తో పాటు తమ డేటా సెంటర్ల కోసం మాత్రమే వినియోగించుకునే యోచనలో ఉన్నట్లు అదానీ గ్రూప్ గతంలోనే పేర్కొంది. -
వొడాఫోన్ ఐడియాకు తగ్గిన నష్టాలు!
Voda Idea FY 2021-22 Q1 Result: న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా(వీఐ) ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి త్రైమాసికంలో ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర నష్టం భారీగా తగ్గి రూ. 7,319 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 25,460 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. అయితే మొత్తం ఆదాయం 14 శాతం క్షీణించి రూ. 9,152 కోట్లను తాకింది. గత క్యూ1లో వీఐ రూ. 10,659 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇక జూన్‌కల్లా మొత్తం రుణ భారం రూ. 1,91,590 కోట్లకు చేరింది. దీనిలో వాయిదా పడిన స్పెక్ట్రమ్ చెల్లింపులు రూ. 1,06,010 కోట్లుకాగా.. రూ. 62,180 కోట్లమేర ఏజీఆర్ సంబంధ బకాయిలున్నాయి. అయితే ఇదే సమయంలో FY 2021-22కు గానూ కంపెనీ చేతిలో నగదు, తత్సంబంధ నిల్వలు రూ. 920 కోట్లుగా ఉన్నాయి. తగ్గిన సబ్స్క్రయిబర్లు, పెరిగిన.. ఈ కేలండర్ ఏడాది(2021) ముగిసేలోగా రూ. 4,000 కోట్లమేర వ్యయాల్లో పొదుపును సాధించాలని వొడాఫోన్ ఐడియా లక్ష్యంగా పెట్టుకుంది. విశేషం ఏంటంటే.. జూన్‌కల్లా దీనిలో 70 శాతాన్ని సాధించినట్లు ప్రకటించింది. గతేడాది క్యూ1లో నమోదైన 27.98 కోట్లమంది సబ్స్క్రయిబర్ల సంఖ్య.. తాజాగా 25.54 కోట్లకు క్షీణించింది. 4జీ వినియోగదారుల సంఖ్య మాత్రం 10.46 కోట్ల మంది 11.29 కోట్లకు బలపడింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ARPU) రూ. 114 నుంచి రూ. 104కు తగ్గినట్లు ప్రకటించుకుంది వీఐ. చదవండి: కళ్లు చెదిరే ఆఫర్.. బైక్‌పై లక్ష వరకు ప్రైజ్‌లు -
స్పెక్ట్రంను తక్షణం కేటాయించండి: వొడాఫోన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో దక్కించుకున్న 1800 మెగాహెట్జ్ స్పెక్ట్రంను తక్షణమే కేటాయించాలని టెలికం దిగ్గజం వొడాఫోన్ ప్రభుత్వాన్ని కోరింది. అలాగే, ప్రస్తుతం ఉపయోగిస్తున్న 900 మెగాహెట్జ్ బ్యాండ్ విడ్త్ స్పెక్ట్రం గడువును కూడా ఆరు నెలల పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. కొత్త స్పెక్ట్రం కేటాయించిన తేదీ నాటి నుంచి ఈ పొడిగింపును వర్తింపచేయాలని పేర్కొంది. ప్రస్తుతం కొన్ని సర్కిళ్లలో తమ దగ్గరున్న స్పెక్ట్రంను వినియోగించుకునేందుకు ఇచ్చిన గడువు తీరిపోవడానికి 7 వారాలే మిగిలి ఉందని, ఈలోగా కేటాయించకపోతే ఏర్పాట్లు చేసుకోవడం కష్టమవుతుందని వొడాఫోన్ పేర్కొంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా టెలికం సర్కిల్స్‌లో తమ లెసైన్సుల గడువు నవంబర్‌తో ముగిసిపోనుండటం, కొత్తగా మరో బ్యాండ్‌కి మారాల్సిన పరిస్థితి నెలకొనడం మొదలైన అంశాల నేపథ్యంలో సత్వరం స్పెక్ట్రంను సమకూర్చుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ విషయంలో మరింత జాప్యం జరిగితే సర్వీసులు అందించడంలో సమస్యలు తలెత్తుతాయని, కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని ప్రభుత్వానికి తెలిపింది. దీనిపై ఈ నెల 10 లోగా స్పష్టతనివ్వాలని కోరింది. ఈ విషయమై కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో వొడాఫోన్ గ్రూప్ చీఫ్ విటోరియో కొలావో, కంపెనీ భారత విభాగం ఎండీ మార్టిన్ పీటర్స్ భేటీ కూడా అయ్యారు. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో వొడాఫోన్ సహా ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ తదితర సంస్థలు రూ. 62,162 కోట్లు వెచ్చించి స్పెక్ట్రం దక్కించుకున్నాయి. అయినా ఇప్పటిదాకా కేటాయింపులు జరగకపోవడంతో కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.