Kerala's 1st DGCA-Licensed Woman Drone Pilot - Sakshi
Sakshi News home page

డ్రోన్‌ పైలట్‌గా డీజీసీఏ లైసెన్స్‌ పొందిన కేరళ తొలి మహిళ!

Published Wed, Aug 9 2023 10:27 AM | Last Updated on Wed, Aug 9 2023 10:42 AM

Keralas First DGCA Licensed Woman Drone Pilot - Sakshi

కేరళలోని మలప్పురానికి చెందిన రిన్ష పట్టకకు గాలిలో ఎగురుతున్న డ్రోన్‌లను చూడడం అంటే సరదా. ఆ సరదా కాస్తా ఆసక్తిగా మారింది. డ్రోన్‌లకు సంబంధించిన ఎన్నో విషయాలను సివిల్‌ ఇంజనీర్‌ అయిన తండ్రి అబ్దుల్‌ రజాక్‌ను అడిగి తెలుసుకునేది. ప్లస్‌ టు పూర్తయిన తరువాత బీటెక్‌ అడ్మిషన్‌ కోసం ఎదురుచూస్తున్న టైమ్‌లో విరామ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని ఆలోచిస్తుప్పుడు రిన్షకు తట్టిన ఐడియా డ్రోన్‌ ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ కోర్సు. తండ్రితో చెబితే ఆయన ‘బాగుంటుంది’ అని ఓకే చెప్పి ప్రోత్సహించాడు.

శిక్షణ కోసం కాసర్‌గోడ్‌లోని ఏఎస్‌ఏపీ కేరళ కమ్యూనిటీ స్కిల్‌ పార్క్‌లో చేరింది. క్లాసులో తాను ఒక్కతే అమ్మాయి! ఈ స్కిల్‌పార్క్‌లో యువతరం కోసం ఆటోమోటివ్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ హార్డ్‌వేర్, హాస్పిటాలిటీ, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ఎన్నో వొకేషనల్‌కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డ్రోన్‌ ఫ్లయింగ్‌ కోర్సుకు మంచి డిమాండ్‌ ఉంది. కోర్సులో భాగంగా బేసిక్‌ ఫ్లైట్‌ ప్రిన్సిపల్స్‌ నుంచి డ్రోన్‌ ఫ్లయింగ్‌ రూల్స్‌ వరకు ఎన్నో నేర్చుకుంది రిన్ష.

ఏరియల్‌ సర్వైలెన్స్, రెస్క్యూ ఆపరేషన్స్, అగ్రికల్చర్, ట్రాఫిక్, వెదర్‌ మానిటరింగ్, ఫైర్‌ ఫైటింగ్‌లతోపాటు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డెలివరీ సర్వీస్‌... మొదలైన వాటిలో డ్రోన్‌లకు ప్రాధాన్యత పెరుగుతోంది. మన దేశంలో డ్రోన్స్‌ ఆపరేట్‌ చేయడానికి డీజీసీఏ డ్రోన్‌ రిమోట్‌ పైలట్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి.

డీజీసీఏ లైసెన్స్‌ పొందిన కేరళ తొలి మహిళా డ్రోన్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించిన రిన్ష ఇలా అంటోంది... ‘రెస్క్యూ ఆపరేషన్స్‌ నుంచి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు ఎన్నో రంగాలలో డ్రోన్‌లు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. డీజీసీఏ డ్రోన్‌ రిమోట్‌ పైలట్‌ సర్టిఫికెట్‌ అందుకున్నందుకు గర్వంగా ఉంది’ ‘రిన్ష విజయం ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నారు స్కిల్‌పార్క్‌ ఉన్నతాధికారులు.    

(చదవండి: బార్బీ కాస్త హిజార్బీ! నాలా లేదన్న ఆలోచనే.. ఈ సరికొత్త బార్బీ!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement