న్యూఢిల్లీ: దేశీయంగా రూపొందించిన కొత్త అగ్రి–డ్రోన్ ’అగ్రిబాట్ ఏ6’కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి ’టైప్ సర్టిఫికెట్’ లభించినట్లు ఐవోటెక్‌వరల్డ్ ఏవిగేషన్ సంస్థ తెలిపింది. నిర్దేశిత సాంకేతిక, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్దిష్ట ఉత్పత్తి ఉన్నట్లు ధృవీకరిస్తూ డీజీసీఏ ఈ సర్టిఫికెట్‌ను అధికారికంగా జారీ చేస్తుంది.
క్రితం మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఆవిష్కరించిన మోడల్ పరిమాణంలో 30 శాతం చిన్నదిగా ఉంటుందని సంస్థ సహ వ్యవస్థాపకుడు దీపక్ భరద్వాజ్ తెలిపారు. అధునాతన డిజైన్ అయినప్పటికీ కొత్త ఉత్పత్తి రేటును పెంచలేదని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,000 పైచిలుకు డ్రోన్లను విక్రయించాలని నిర్దేశించుకున్నట్లు భరద్వాజ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment