హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డ్రోన్ల తయారీ, సాంకేతిక సేవల్లో ఉన్న డ్రోగో డ్రోన్స్ మానవరహిత వైమానిక వాహనం (యూఏవీ) క్రిషి 2.0 ఆవిష్కరించింది. ఇది 10 కిలోల బరువు మోయగలదు. రోజుకు 30 ఎకరాల్లో పురుగు మందులను పిచికారీ చేస్తుంది.
డ్రోన్ల తయారీకి అవసరమైన ధ్రువీకరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి కంపెనీ అందుకుంది. డ్రోన్లను హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడేపల్లి కేంద్రంలో తయారు చేస్తారు. ఏడాదికి 3,000 డ్రోన్లను ఉత్పత్తి చేస్తామని డ్రోగో డ్రోన్స్ సీఈవో యశ్వంత్ బొంతు తెలిపారు. డిమాండ్‌నుబట్టి సామర్థ్యం పెంచుతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 26 సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment