మేడిన్ హైదరాబాద్.. 100 కిలోల బరువు మోసుకెళ్తుంది
2026లో మార్కెట్‌లోకి.. దేశంలోనే మొట్టమొదటిది..
శంషాబాద్: అత్యవసరాల్లో ట్రాఫిక్ కష్టాలుండవు.. అనుకున్న సమయానికి మీ కార్గో చేరిపోతుంది. ఎమర్జెన్సీలో తీసుకెళ్లాల్సిన వైద్య సంబంధిత వస్తు వులు, ఆర్గాన్స్ కూడా గ్రీన్ చానల్ ఏర్పాట్లు లేకుండా గమ్యానికి చేరిపోతాయి. దీనికి మరెంతో దూ రం లేదు. 2026లో మార్కెట్‌లోకి రాబోతున్న అతి పేద్ద డ్రోన్‌తో ఇవన్నీ సాకారమవుతాయి. హైదరాబాద్ యువ ఇంజనీర్లు దీన్ని సిద్ధం చేశారు.
ఇప్పటికే ట్రయల్‌రన్‌లో సక్సెస్ కావడంతో డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతులతో త్వరలో నే అందుబాటులోకి రానుంది. దీనిని ఆదిభట్లలోని బ్లూజే ఏరోస్పేస్ వ్యవస్థాపకులు ఉత్తమ్‌కుమార్, అమర్‌దీప్ నేతృత్వంలోని ఏరోనాటికల్ ఇంజనీర్ల బృందం తయారు చేసింది. నోవాటెల్ హోటల్‌లో ‘కోల్డ్‌చైన్ అన్‌బ్రోకెన్–2024’సదస్సులో దీనిని ఏర్పాటు చేశారు.
‘పర్యావరణహితంగా తయారు చేసిన ఈ పైలట్‌రహిత డ్రోన్ 100 కిలోల కార్గోను 300 కిలోమీటర్ల దూరంలోని గమ్యస్థానానికి గంటన్నర సమయంలో తీసుకెళ్తుంది. ఇంత సామర్థ్య మున్న డ్రోన్ తయారీ దేశంలో ఇదే మొదటిది. 2029 నాటికి పదిమంది ప్రయాణికులతోపాటు వేయి కేజీల బరువు, వేయి కి.మీ. దూరం ప్రయాణించే డ్రోన్‌ను తయారుచేసేందుకు కృషిచేస్తున్నాం’అని ఉత్తమ్‌కుమార్ ‘సాక్షి’తో తెలిపారు.
ప్రత్యేకతలు..
డ్రోన్ బరువు 400 కేజీలు
మోసుకెళ్లే సామర్థ్యం 300 కి.మీ.
వేగం గంటకు 200 కి.మీ.
ప్రయాణించే ఎత్తు భూమికి 1000 అడుగుల ఎత్తులో
ఇంధనం హైడ్రోజన్, విద్యుత్ (కాలుష్యరహితంగా)
Comments
Please login to add a commentAdd a comment