బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు బ్యాంక్‌ల వద్ద తగినంత మొత్తంలో నిధులు లేవని రెండు బ్యాంక్‌ల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
కర్ణాటక రాష్ట్రం కర్ణాటకలోని తమకూరులో సేవలందిస్తున్న శ్రీ శారదా మహిళా కో- ఆపరేటీవ్ బ్యాంక్, మహారాష్ట్రలోని సతారా జిల్లాలో హరిహరేశ్వర్ సహకార బ్యాంక్‌లు కస్టమర్లకు బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్నాయి. అయితే, కార్యకలాపాల కోసం ఈ రెండు బ్యాంక్‌ల వద్ద తగినంత మొత్తం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాము తీసుకున్న నిర్ణయంతో జులై 11 నుంచి ఆ రెండు బ్యాంక్‌లు మూత పడినట్లే ఆర్‌బీఐ పేర్కొంది.
ఖాతా దారుల సొమ్ము వెనక్కి
ఆర్‌బీఐ ఆదేశాలతో ఖాతాదారులు డిపాజిట్ చేసిన మొత్తాన్ని హరిహరేశ్వర్ సహకరి బ్యాంక్ 99.96 శాతం, శ్రీ శారద మహిళా కో-ఆపరేటీవ్ బ్యాంక్ 97.82 శాతం పొదుపు మొత్తాన్ని డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ)లు అందించినట్లు ఆర్‌బీఐ చేసిన అధికార ప్రకటనలో పేర్కొంది.
►ప్రతి డిపాజిటర్ డీఐసీజీసీ నుండి రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులేనని తెలిపింది. అలాగే, ప్రస్తుత ఆర్థిక స్థితి ఉన్న బ్యాంకులు తమ ప్రస్తుత డిపాజిటర్లకు పూర్తిగా చెల్లించలేవని పేర్కొంది.
►మార్చి 8, 2023 నాటికి, బ్యాంకు యొక్క మొత్తం బీమా డిపాజిట్లలో డీఐసీజీసీ ఇప్పటికే రూ.57.24 కోట్లను చెల్లించింది.
►జూన్ 12, 2023 నాటికి, శ్రీ శారద మహిళా కో-ఆపరేటివ్ బ్యాంక్ డిపాజిటర్లకు మొత్తం బీమా చేసిన డిపాజిట్లలో రూ.15.06 కోట్లను చెల్లించింది.
►మహారాష్ట్రలోని సహకార కమీషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ బ్యాంకును మూసివేయడానికి ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్‌బీఐ సూచించింది.
చదవండి : సామాన్యులకు భారీ ఊరట?..ఇంటికే వచ్చి రూ. 2వేల నోట్లను తీసుకెళ్తారట!
Comments
Please login to add a commentAdd a comment