‘ప్రివిలేజ్’ ఆదాయం రూ. 404 కోట్లు | 'Privilege' income is Rs. 404 crore | Sakshi
Sakshi News home page

‘ప్రివిలేజ్’ ఆదాయం రూ. 404 కోట్లు

Published Tue, Jul 14 2015 1:41 AM | Last Updated on Fri, Aug 17 2018 7:42 PM

‘ప్రివిలేజ్’ ఆదాయం రూ. 404 కోట్లు - Sakshi

‘ప్రివిలేజ్’ ఆదాయం రూ. 404 కోట్లు

ప్రభుత్వానికి మద్యం ద్వారా అదనపు ఆదాయం
ఏడాది కాలంలో గణనీయంగా పెరిగిన అమ్మకాలు
2,033 దుకాణాల్లో లెసైన్స్
ఫీజు కన్నా ఏడు రెట్లకు మించి అమ్మకాలు
ఏపీలో ప్రివిలేజ్ ఫీజు రూపంలో వచ్చిన ఆదాయం రూ. 20 కోట్లు మాత్రమే
 

హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. గడిచిన ఆబ్కారీ సంవత్సరం(జూలై 2014- జూన్ 2015) లో రాష్ట్రంలో చలామణిలో ఉన్న 2,113 మద్యం దుకాణాలకు గాను ఏకంగా 2,033 షాపుల్లో మద్యం వ్యాపారం మూడు బీర్లు, ఆరు బాటిళ్లుగా కొనసాగింది. ఈ దుకాణాల నిర్వహణ కోసం వ్యాపారులు చెల్లించిన లెసైన్సు ఫీజు కన్నా ఏడు రెట్లకు మించి అమ్మకాలు సాగాయి. తద్వారా ఆబ్కారీ శాఖకు ప్రివిలేజ్ ఫీజు రూపంలో వచ్చిన ఆదాయం ఏకంగా రూ. 404 కోట్లు. ఆంధ్రప్రదేశ్‌లో 4,380 దుకాణాలకు గాను కేవలం రూ. 20 కోట్లు మాత్రమే ప్రివిలేజ్ ఫీజు వచ్చినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.

 లెసైన్స్ ఫీజులో 50 శాతం మేర
 ప్రివిలేజ్ ఫీజు: జూలై 2014 నుంచి జూన్ 2015 వరకు సాగిన ఎక్సైజ్ సంవత్సరానికి 2,216 దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తే 2113 దుకాణాలను వ్యాపారులు తీసుకున్నారు. ఈ షాపులకు లెసైన్స్ ఫీజు రూపంలో రూ. 986 కోట్లు ఎక్సైజ్ శాఖకు ఆదాయంగా లభించింది. మద్యం దుకాణదారుడు తాను చెల్లించిన లెసైన్స్ ఫీజు కన్నా ఏడు రెట్లు మద్యం అమ్మకాలు దాటితే 13.6 శాతం ప్రివిలేజ్ ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, గోదావరి ఖని, ఖమ్మం తదితర ప్రాంతాల్లో తొలి 9 నెలల్లోనే ఈ ఏడు రెట్ల టార్గెట్ దాటిపోయింది. ఏడు రెట్ల మార్కు దాటిన వ్యాపారులు మద్యం డిపోల్లో చేసే ప్రతి బాటిల్ కొనుగోలు మీద 13.6 శాతం ప్రివిలేజ్ ఫీజు చెల్లించాల్సి వచ్చింది. జూన్ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని 80 దుకాణాలు మాత్రమే ప్రివిలేజ్ ఫీజు చెల్లించాల్సి రాలేదు.

 వార్షిక రెవెన్యూ రూ. 11,044 కోట్లు
 ఎక్సైజ్ శాఖ 2014 జూలై నుంచి జూన్ 2015 వ రకు రూ. 11,044 కోట్లు రెవెన్యూ సాధించింది. ఇందులో రూ. 986 కోట్లు లెసైన్సు ఫీజు రూపం లో కాగా, ప్రివిలేజ్ ఫీజు ద్వారా రూ. 404 కోట్లు లభించింది. మిగతా మొత్తం దాదాపుగా మద్యం అమ్మకాలపైనే లభించింది. కాగా 2013- 14లో వచ్చిన రెవెన్యూ రూ. 9481 కోట్లు. ఈసారి జులై నుంచి అమలు కావలసిన నూతన మద్యం విధానాన్ని అక్టోబర్‌కు వాయిదా వే సిన ప్రభుత్వం పాతవారికి మూడునెలల పాటు లెసైన్సులు రెన్యూవల్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అయితే అమ్మకాలు సరిగా లేని రాష్ట్రంలోని 80 దుకాణాలను వ్యాపారులు రెన్యూవల్ చేయించుకోలేదు. అలాగే 27 బార్లు కూడా రెన్యూవల్ కాలేదు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement