సాక్షి ప్రతినిధి, వరంగల్: వైన్‌షాప్ టెండర్‌కు రూ.లక్ష వెచ్చించి దరఖాస్తు చేయడం, వందలాది మందితో పోటీపడి లైసెన్సు దక్కిం చుకున్నా అది రెండేళ్లపాటే ఉంటుండటంతో మద్యం వ్యాపారులు ఇబ్బందులు పడుతు న్నారు. ఈ క్రమంలో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఎలైట్ బార్’ విధానంతో లాభాల బాటలో పయనిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 820 బార్లకు 2009లో లైసెన్సులు మం జూరు చేశారు. అప్పటి నుంచి ఏటా వీటినే రెన్యువల్ చేస్తూ పోతున్నారు. దీంతో కొత్తగా మద్యం వ్యాపారంలోకి వచ్చే వారికి వైన్‌షాపులే దిక్కుగా మారాయి. ఇటీవల కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా 2,215 వైన్ షాపులకు లైసెన్సులు జారీ చేశారు. షాపులకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో దరఖాస్తు ధరను ఏకంగా రూ. 25,000 నుంచి రూ. లక్షకు పెంచారు. అయినా డిమాండ్ తగ్గలేదు. సగానికి పైగా షాపులకు పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వీటి ఫలితంగా లైసెన్సుల జారీ ద్వారా రూ. 1,274 కోట్లు ప్రభుత్వ ఖజానాలో చేరితే.. దరఖాస్తుల ద్వారానే రూ. 420 కోట్ల ఆదాయం వచ్చింది. లైసెన్సు ఫీజులో నాలుగో వంతు ఆదాయం వీటి ద్వారానే వచ్చింది.
ఈజీగా ఎలైట్..
సాధారణ బార్ లైసెన్సు ఫీజు కంటే 25 శాతం అధిక ఫీజుతో ఎలైట్ బార్‌లకు లైసెన్సులు మంజూరు చేస్తున్నారు. ఈ బార్ పొందాలను కుంటే నేరుగా ఎక్సైజ్‌శాఖ మంత్రికి దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వరకు దరఖాస్తు వస్తుంది. ఎలైట్ బార్ పెట్టేందుకు అనువైన మౌలిక సదుపా యాలు ఉన్నట్లుగా నిర్ధారించి, దరఖాస్తుదారుడి వ్యక్తిగత సమాచారంపై సంతృప్తి చెందితే లైసె న్సు మంజూరు చేయవచ్చు. డిమాండ్‌ను బట్టి ఒక ఏరియాకు ఎన్నైనా ఎలైట్ బార్లను మం జూరు చేసే వెసులుబాటు ఉంది. దీంతో కొత్తగా మద్యం వ్యాపారంలోకి రావాలనుకునేవారు వీటి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
నిబంధనలకు నీళ్లు
ఎలైట్ బార్ ఏర్పాటు చేయాలంటే కనీసం పది వేల చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఇందులో 2 వేల చ.అడుగుల స్థలం కేవలం మద్యం డిస్‌ప్లేకు కేటాయించాలి. సెంట్రల్ ఏసీ, సువిశాల పార్కింగ్ సౌకర్యాలు తప్పనిసరి. విదేశీయులకు అసౌకర్యం లేని విధంగా సదుపాయాలు ఉన్నప్పుడు లైసెన్సు మంజూరు చేయాలి. సాధారణ బార్‌షాప్ లైసెన్సు ఫీజుపై 25 శాతం అదనం చెల్లిస్తే చాలు అధికారులు లైసెన్సులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోందని ప్రతిపక్షాలు అసెంబ్లీలో గొంతు చించుకుంటున్నా.. ఎక్సైజ్‌శాఖ కొత్త మద్యం దుకాణాలకు లైసెన్సులు మంజూరు చేస్తూ పోతుండటం విమర్శలకు తావిస్తోంది.
ఫుల్ డిమాండ్..
ప్రతి 25,000 మంది జనాభాకు ఒక బార్‌షాప్‌ను కేటాయించాలని ఎక్సైజ్ నిబంధ నలు ఉన్నాయి. ఈ లెక్కన 8 లక్షల జనాభా ఉన్న వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 30 నుంచి 35 బార్‌షాపులు ఉండాలి. ఇప్పటికే ఇక్కడ 89 బార్లు, 59 వైన్‌షాపులు ఉన్నాయి. కొత్తగా ఇక్కడ ఎలైట్ బార్లు నెలకొల్పేందుకు పలువురు పోటీ పడుతున్నారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఎలైట్ బార్ కోసం మంత్రి పద్మారావు పేషీలో 50కి పైగా దరఖాస్తులు చేరినట్లు సమాచారం. ఇందులో ఇప్పటికే 4 బార్లకు అనుమతులు వచ్చాయి. కాగా, వరంగల్ కార్పొరేషన్ పరిధిలో మరో మూడు, కరీంనగర్ జిల్లాలో ఒకటి వంతున ప్రాసెస్‌లో ఉండగా, ఖమ్మం జిల్లా మధిరలో రెండు, నిజామాబాద్, రామగుండం కార్పొరే షన్ల పరిధిలో ఎలైట్ బార్ల కోసం దరఖాస్తులు మంత్రి పేషీకి చేరుతున్నాయి.
బారు.. జోరు..
Published Thu, Nov 2 2017 5:17 AM | Last Updated on Fri, Aug 17 2018 7:48 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment