గత కొన్ని రోజులుగా ఆర్‌బీఐ, నియమాలను అతిక్రమించే బ్యాంకుల మీద కఠినంగా చర్యలు తీసుకుంటోంది. భారీ జరిమానాలు విధించడమే కాకుండా.. లైసెన్సులు సైతం రద్దు చేస్తోంది. ఇప్పటికే పలు బ్యాంకుల మీద కొరడా ఝళిపించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా వారణాసిలోని బెనారస్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది.
వారణాసిలోని బెనారస్ మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దాని లైసెన్స్‌ను రద్దు చేసింది. లైసెన్స్ రద్దు చేసిన తరువాత ఉత్తరప్రదేశ్‌కు చెందిన కోఆపరేటివ్ కమీషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ బ్యాంక్‌ను మూసివేయడానికి, లిక్విడేటర్‌ను నియమించడానికి ఉత్తర్వు జారీ చేయాలని ఆర్‌బీఐ కోరింది.
బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో డిపాజిటర్లు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిపాజిటర్లు తమ డిపాజిట్ మొత్తాలను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసిజీసి) నుంచి పొందుతారు. లిక్విడేషన్ తర్వాత, ప్రతి డిపాజిటర్ DICGC నుండి రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు.
Comments
Please login to add a commentAdd a comment