
భారీ బడ్జెట్ చిత్రాలకు లైసెన్స్ ‘బాహుబలి’
చెన్నై: మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ మరో అయిదు రోజుల్లో (ఏప్రిల్ 28) ప్రేక్షకుల ముందుకు రానుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే రహస్యాన్ని తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో బల్లాలదేవ పాత్రద్వారా తనదైన గుర్తింపును సాధించిన రానా దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రతిష్టాత్మక చిత్రం భారతదేశ సినీ నిర్మాతలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందనీ, భారీ చిత్రాలను నిర్మించే లైసెన్స్ ఇచ్చిందని ఏఎన్‌ఓస్‌తో చెప్పారు. .మోహన్ లాల్ చేపట్టబోయే భారీ బహుముఖ చిత్రం "మహాభారత్" రూ. 1000 కోట్ల బడ్జెట్ సినిమాలకు బాహుబలి నాంది పలికిందా అని ప్రశ్నించినపుడు ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నిర్మాతలు ఆవైపుగా ఆలోచించడం అద్భుతం మన్నారు. ఒక ప్రాంతీయ భాషా చిత్రం అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకుందని తెలిపారు.
బాహుబలి విజయం భారతీయ చలన చిత్ర నిర్మాతల్లో గొప్ప విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచిదని రానా చెప్పుకొచ్చారు. ఒక భాషలో మొత్తం దేశం కోసం సినిమా చేయడం మిగిలిన సినిమాలకంటే గొప్ప విషయమని బాహుబలి నిరూపించిందన్నారు. దమ్ము ధైర్యం ఉండి, గ్రేట్ సూపర్ హీరో లభిస్తే మధురై నిర్మాత అయినా నమ్మకంతో సినిమా తీస్తే చూడడానికి జనం ఉన్నారని పేర్కొన్నారు. బాహుబలి ది బిగినింగ్ అనూహ్యంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టిందని, ఇది తమలో నమ్మకాన్ని పెంచిందని తెలిపారు. ఈ చిత్రంలోని రెండు భాగాల నుంచి తాను నేర్చుకున్న దాని ఆధారంగా భవిష్యత్తుల్లో పాత్రలను ఎంచుకుంటానని రానా చెప్పారు.
అయితే మొదటి భాగంలో యుద్ం, యుద్ధ సన్నివేశాలు లాంటి ప్రతివీ మొదటి ప్రయత్నం, కొత్త కావడంతో కొంత కష్టమనిపించినా , రెండవ భాగంలో చాలా సులువుగా అనిపించిందంటూ చిత్ర విశేషాలను పంచుకున్నారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్‌ను జోడించడం ప్రతి రోజూ సవాల్ గా అనిపించిందన్నారు. అయితే మొదటి భాగంలో చేసిన తప్పులను రెండవ భాగంలో దొర్లకుండా జాగ్రత్తపడినట్టు చెప్పారు.
మరోవైపు ఈ రెండో భాగంలో బాహుబలి పట్టాభిషేకం, భల్లాల దేవుడికి, అతడికి మధ్య యుద్ధ సన్నివేశాలు రిచ్‌గా ఉంటాయని టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రకటించారు. భావోద్వేగ సన్నివేశాలతో , కథ పకడ బందీగా సాగుతుందని చెప్పారు. హీరో ప్రభాస్, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, సత్యరాజ్, రమ్యకృష్ణన్ ముఖ్యప్రాతల్లో నటించిన "బాహుబలి 2 ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.