Indian filmmakers
-
భాగ్యనగర్ కా బెనగళ్..
సాక్షి, హైదరాబాద్: విఖ్యాత సినీ దర్శకుడు శ్యామ్ బెనగళ్‌కు నగరంతో విడదీయరాని అనుంబంధం ఉంది. ఆయన చదువు ఇక్కడే కొనసాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని నిజాం కళాశాల నుంచి ఆరి్థక శాస్త్రంలో శ్యామ్ బెనగళ్ పట్టభద్రుడయ్యాడు. అదే సమయంలో ఆయన హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీని ప్రారంభించారు. నాన్నే తొలి గురువు... నగరంలో ఉండగానే తన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించారు శ్యామ్ బెనగళ్. ఆయన తండ్రి నగరంలో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా ప్రాచుర్యం పొందాడు. ఖాళీ సమయాల్లో ఆయన 16 ఎంఎం కెమెరాతో తన పిల్లలతోనే సినిమాలను షూట్ చేసేవారు. ఆయన దగ్గర ఈ సినిమాల భారీ కలెక్షన్ ఉంది. శ్యామ్ బెనగళ్ది పెద్ద కుటుంబం. ఆయనతో కలిపి పది మంది పిల్లలు. ‘నాకు మా నాన్న తొలిగా సినిమా గురించి అవగాహన కల్పించారు. మా డిన్నర్ తర్వాత వినోదం.. మా నాన్న రూపొందించిన చిత్రాలను చూడటమే. సినిమాతో నా ప్రమేయం అలా మొదలై చివరికి నన్ను ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్‌గా మార్చింది’ అంటూ శ్యామ్ బెనగళ్ గుర్తు చేసుకునేవారు. తన తండ్రికి చెందిన 16 ఎంఎం సినిమా కెమెరాతో వేసవి సెలవుల్లో తన అన్నదమ్ములు, కజిన్లు కలిసినప్పుడు తాను తీసిన ‘చుటియో మే మౌజ్ మజా (సెలవుల్లో వినోదం, ఆటలు)’ తన మొదటి సినిమాగా ఆయన పేర్కొంటారు. కంటోన్మెంట్ ఏరియాలో... సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఏరియాలో తాము నివసించే ప్రదేశానికి దగ్గరగా ఉన్న ఆర్మీ గ్యారీసన్‌లో సినిమా ప్రదర్శనలు ఉండేవనీ, ప్రధానంగా సైన్యం కోసం ఉద్దేశించిన ఆ ప్రదేశంలో వారాంతంలో ఆంగ్ల భాషా చిత్రంతో పాటు, వివిధ భారతీయ భాషలలోని చలనచిత్రాలు ప్రదర్శించేవారని ఆయ న తన చిన్ననాటి స్మృతులను నెమరేసుకునేవారు. అనుబంధం..అపురూపం... ‘హైదరాబాద్ నా జన్మభూమి’ అని శ్యామ్ బెనగళ్ సగర్వంగా చెప్పేవారు. తాను జని్మంచిన నగరం గురించి ‘నేను ఇక్కడ పెరిగాను, నా పాఠశాల కళాశాల ఇక్కడే. ఇక్కడ మరే ఇతర ప్రదేశంలో లేని విశిష్టమైన స్వభావం, మిశ్రమ సంస్కృతి దీని సొంతం’ అంటూ కొనియాడేవారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నిజాం కాలేజ్‌లో చదువుకున్న తాను ప్రస్తుతం పిల్లల చదువు గురించి ఆందోళన చెందుతున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘విశ్వవిద్యాలయం ఇప్పటికీ గొప్పగా ఉంది, కానీ అక్కడ రాజకీయ ప్రమేయం పెరిగింది’ అంటూ ఆయన తాను చదువుకున్న ఉస్మానియా గురించి గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నేపథ్యంలో మరో చిత్రం తీస్తానన్నారు... తన సినిమాలపై తెలంగాణ ప్రభావం గురించి మాట్లాడుతూ తన సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘అంకుర్, నిషాంత్, మండి చిత్రాలపై ఈ ప్రాంత ప్రభావం ఉందని బెనగళ్ అనేవారు. తెలంగాణ నేపథ్యంలో మరొక కథ దొరికితే, తాను ఖచి్చతంగా దాన్ని కూడా సినిమాగా మలుస్తాను అంటూ ఈ రాష్ట్రంపై ప్రేమను చాటేవారాయన. అనుగ్రహం అనే తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన బెనగళ్‌కు తెలుగు మాట్లాడటం అంతగా రాదు.‘నాకు తెలుగు బాగా అర్థం అవుతుంది కానీ మాట్లాడటం కొంచెం కష్టమవుతుంది’ అనేవారు. తాను హైదరాబాద్‌ను విడిచిపెట్టి 50 సంవత్సరాలకు పైనే అవుతున్నా, ఈ సిటీపై ఇష్టానికి దూరం కాలేదంటారు. ‘ఇది సినిమా క్రేజీ సిటీ. ఇక్కడ భారీ సంఖ్యలో ప్రేక్షకులు సినిమాలు చూస్తారు. చాలా మంది మంచి దర్శకులు, నిర్మాతలు ఇక్కడ ఉన్నారు’ అంటూ కొనియాడేవారు. ఆయన ఇప్పుడు లేకున్నా..ఆ మంచి దర్శక నిర్మాతలకు ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎప్పటికీ ఉంటుందనేది వాస్తవం. -
బాహుబలి-2కు ఆ అనుమతి చట్టవిరుద్ధం
-
భారీ బడ్జెట్ చిత్రాలకు లైసెన్స్ ‘బాహుబలి’
చెన్నై: మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ మరో అయిదు రోజుల్లో (ఏప్రిల్ 28) ప్రేక్షకుల ముందుకు రానుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే రహస్యాన్ని తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో బల్లాలదేవ పాత్రద్వారా తనదైన గుర్తింపును సాధించిన రానా దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రతిష్టాత్మక చిత్రం భారతదేశ సినీ నిర్మాతలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందనీ, భారీ చిత్రాలను నిర్మించే లైసెన్స్ ఇచ్చిందని ఏఎన్‌ఓస్‌తో చెప్పారు. .మోహన్ లాల్ చేపట్టబోయే భారీ బహుముఖ చిత్రం "మహాభారత్" రూ. 1000 కోట్ల బడ్జెట్ సినిమాలకు బాహుబలి నాంది పలికిందా అని ప్రశ్నించినపుడు ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నిర్మాతలు ఆవైపుగా ఆలోచించడం అద్భుతం మన్నారు. ఒక ప్రాంతీయ భాషా చిత్రం అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకుందని తెలిపారు. బాహుబలి విజయం భారతీయ చలన చిత్ర నిర్మాతల్లో గొప్ప విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచిదని రానా చెప్పుకొచ్చారు. ఒక భాషలో మొత్తం దేశం కోసం సినిమా చేయడం మిగిలిన సినిమాలకంటే గొప్ప విషయమని బాహుబలి నిరూపించిందన్నారు. దమ్ము ధైర్యం ఉండి, గ్రేట్ సూపర్ హీరో లభిస్తే మధురై నిర్మాత అయినా నమ్మకంతో సినిమా తీస్తే చూడడానికి జనం ఉన్నారని పేర్కొన్నారు. బాహుబలి ది బిగినింగ్ అనూహ్యంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టిందని, ఇది తమలో నమ్మకాన్ని పెంచిందని తెలిపారు. ఈ చిత్రంలోని రెండు భాగాల నుంచి తాను నేర్చుకున్న దాని ఆధారంగా భవిష్యత్తుల్లో పాత్రలను ఎంచుకుంటానని రానా చెప్పారు. అయితే మొదటి భాగంలో యుద్ం, యుద్ధ సన్నివేశాలు లాంటి ప్రతివీ మొదటి ప్రయత్నం, కొత్త కావడంతో కొంత కష్టమనిపించినా , రెండవ భాగంలో చాలా సులువుగా అనిపించిందంటూ చిత్ర విశేషాలను పంచుకున్నారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్‌ను జోడించడం ప్రతి రోజూ సవాల్ గా అనిపించిందన్నారు. అయితే మొదటి భాగంలో చేసిన తప్పులను రెండవ భాగంలో దొర్లకుండా జాగ్రత్తపడినట్టు చెప్పారు. మరోవైపు ఈ రెండో భాగంలో బాహుబలి పట్టాభిషేకం, భల్లాల దేవుడికి, అతడికి మధ్య యుద్ధ సన్నివేశాలు రిచ్‌గా ఉంటాయని టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రకటించారు. భావోద్వేగ సన్నివేశాలతో , కథ పకడ బందీగా సాగుతుందని చెప్పారు. హీరో ప్రభాస్, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, సత్యరాజ్, రమ్యకృష్ణన్ ముఖ్యప్రాతల్లో నటించిన "బాహుబలి 2 ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.