
రాష్ట్రంలోని పెట్రోల్ బంక్ నిర్వాహకులకు ఈసీ ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం ముందస్తు కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్‌ను కంటైనర్లు, సీసాల్లో విక్రయించరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్‌షిప్ లైసెన్స్ రద్దు చేస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు అన్ని పెట్రో డీలర్లకు తాజాగా మార్గదర్శకాలను ఎన్నికల సంఘం జారీ చేసింది. పెట్రోల్ బంకులపై నిరంతరం ఫ్లైయింగ్ స్క్వాడ్ నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. బంకుల్లో ఎన్నికల సంఘం ఆదేశాలను ప్రదర్శించడమే కాకుండా గొడవలు చేసే వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఈసీ సూచించింది.
ఈ ఆదేశాల మేరకు ఏపీ పెట్రో డీలర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రావి గోపాలకృష్ణ కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని డీలర్లకు సూచించారు.

Comments
Please login to add a commentAdd a comment