ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్‌గా నియమితులైన డాక్టర్ వాసుదేవ రెడ్డి
తిరుపతి మెడికల్ ఃశ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) యూనివర్శిటీ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ డాక్టర్ వాసుదేవరెడ్డిని నియమించారు. ఈమేరకు గురువారం నియామక ఉత్తర్వులను డైరెక్టర్ రవికుమార్ జారీచేయగా, డాక్టర్ వాసుదేవ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు రిజిస్ట్రార్‌గా పనిచేసిన డాక్టర్ ఆంజనేయులు ఉద్యోగ విరమణ చేశారు. ఈనేపథ్యంలో శ్రీపద్మాతి మహిళా మెడికల్ కళాశాలలో అనాటమి ప్రొఫెసర్, విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ వాసుదేవరెడ్డిని ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్‌గా నియమించారు. గతంలో ఈయన ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, అడిషనల్ డైరెక్టర్‌గా సేవలందించారు. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి 2012లో పదవీ విరమణ పొందారు. ఆయన సుదీర్ఘ అనుభవాన్ని దష్టిలో ఉంచుకుని ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్‌గా నియమించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.