rigistrar
-
హైకోర్టు రిజిస్ట్రార్ పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు రిజిస్ట్రార్ (ప్రోటోకాల్) సి.విద్యాధర్ భట్ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ఉద్యోగులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం భట్ మట్లాడుతూ, 1997లో ఉద్యోగుల సంఘం సాంస్కృతిక కార్యదర్శిగా ఉన్నప్పుడు చదువులో మంచి ప్రతిభ కనబరచిన ఉద్యోగుల పిల్లలకు ప్రతిభా అవార్డులు ప్రవేశపెట్టడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ అవార్డులకు ఆర్థిక సాయం చేస్తున్న ఉద్యోగి విరూపాక్ష రెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విరూపాక్ష రెడ్డి లాగే తాను కూడా రెండు పతకాలకు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. -
అసలు ఏమైనా తెలుసా మీకు.. సుప్రీం చీవాట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టులో కేసులు పెండింగ్ ఉండటంపై ఆ కోర్టు రిజిస్ట్రార్ సుప్రీంకోర్టులో నీళ్లు నమిలారు. ఉన్నత న్యాయస్థానం వరుసగా ఆయనకు ప్రశ్నలు సందించడంతో 'ఐయామ్ వెరీ నెర్వస్ మై లార్డ్' అంటూ మరో ప్రశ్న వేయకుండా సమాధానం చెప్పారు. వీలయినంత త్వరగా కేసులు విచారణకు వచ్చేలా చూస్తానని అన్నారు. భారీ ఎత్తున కేసులు పేరుకుపోవడం, కేసులు విచారణ ఆలస్యం జరుగుతుండటంపై ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)ని జస్టిస్ రంజన్ గొగోయ్ ధర్మాసనం తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. జస్టిస్ గొగోయ్ ప్రశ్నించడం మొదలుపెట్టేసరికి ఆర్జీ కంగారు పడిపోయారు. న్యాయమూర్తి అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పలేదు. గత పదేళ్లుగా ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అడిగినా ఆయన నామమాత్రం కూడా సమాధానం చెప్పలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు అసలు మీరు కోర్టుకు ఎందుకు వచ్చారు? అసలు ఇక్కడ ఏ కేసు విచారణ జరుగుతుందనే విషయం అయినా తెలుసా? . 1994 నుంచి కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో అనే విషయం కూడా మీకు తెలియదు. మీకు కనీసం ఆ విషయం అయినా తెలుసుండాలి ? అని గొగోయ్ ప్రశ్నించింది. దీంతో నీళ్లు నమిలిన రిజిస్ట్రార్ 'అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. ఐయామ్ వెరీ నెర్వస్ మై లార్డ్. దయచేసి నాకు కొంచెం గడువు ఇవ్వండి' అని ప్రార్థించాడు. దీనికి బదులిచ్చిన గొగోయ్ 'అయితే సరే.. మీకు కొంచెం గడువు ఇస్తున్నాను. ఆ సమయంలోగానైనా మీ నెర్వస్ పోతుందేమో చూస్తాము' అని అన్నారు. -
స్విమ్స్ ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా వాసుదేవ రెడ్డి
తిరుపతి మెడికల్ ఃశ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) యూనివర్శిటీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ డాక్టర్ వాసుదేవరెడ్డిని నియమించారు. ఈమేరకు గురువారం నియామక ఉత్తర్వులను డైరెక్టర్ రవికుమార్ జారీచేయగా, డాక్టర్ వాసుదేవ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు రిజిస్ట్రార్‌గా పనిచేసిన డాక్టర్ ఆంజనేయులు ఉద్యోగ విరమణ చేశారు. ఈనేపథ్యంలో శ్రీపద్మాతి మహిళా మెడికల్ కళాశాలలో అనాటమి ప్రొఫెసర్, విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ వాసుదేవరెడ్డిని ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా నియమించారు. గతంలో ఈయన ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, అడిషనల్ డైరెక్టర్‌గా సేవలందించారు. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి 2012లో పదవీ విరమణ పొందారు. ఆయన సుదీర్ఘ అనుభవాన్ని దష్టిలో ఉంచుకుని ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా నియమించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.