
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు రిజిస్ట్రార్ (ప్రోటోకాల్) సి.విద్యాధర్ భట్ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ఉద్యోగులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం భట్ మట్లాడుతూ, 1997లో ఉద్యోగుల సంఘం సాంస్కృతిక కార్యదర్శిగా ఉన్నప్పుడు చదువులో మంచి ప్రతిభ కనబరచిన ఉద్యోగుల పిల్లలకు ప్రతిభా అవార్డులు ప్రవేశపెట్టడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ అవార్డులకు ఆర్థిక సాయం చేస్తున్న ఉద్యోగి విరూపాక్ష రెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విరూపాక్ష రెడ్డి లాగే తాను కూడా రెండు పతకాలకు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment